
సమగ్ర సర్వేలో పాల్గొననున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మంగళవారం జరిగే సమగ్ర సర్వే కార్యక్రమంలో పాల్గొంటారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మంగళవారం జరిగే సమగ్ర సర్వే కార్యక్రమంలో పాల్గొంటారు. హైదరాబాద్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ తన కుటుంబ వివరాలు అందజేయనున్నారు.
ఇదిలావుండగా, సమగ్ర కుటుంబ సర్వేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సమస్యలను పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఖమ్మం కార్పొరేషన్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని శ్రీనివాసరెడ్డి తెలిపారు.