ఇండియన్‌లో కొరియన్‌ భామ? | South Korean actor Bae Suzy in Kamal's Indian 2 | Sakshi
Sakshi News home page

ఇండియన్‌లో కొరియన్‌ భామ?

Published Fri, Jan 11 2019 12:13 AM | Last Updated on Thu, Aug 8 2019 11:13 AM

South Korean actor Bae Suzy in Kamal's Indian 2 - Sakshi

కమల్‌హాసన్

‘ఇండియన్‌ 2’ సినిమాను కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం చేసే ఉద్దేశంలో లేనట్టున్నారు దర్శకుడు శంకర్‌. 1995లో వచ్చిన ‘ఇండియన్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్‌ 2’ తెరకెక్కిస్తున్నారాయన. కమల్‌హాసన్, కాజల్‌ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కొంచెం కొరియన్‌ టచ్‌ కూడా ఇచ్చే ప్లాన్‌లో ఉన్నారట శంకర్‌. ఈ సీక్వెల్‌లో సూజీ బే అనే కొరియన్‌ హీరోయిన్‌ను ఓ కీలక పాత్రకు తీసుకోవాలనుకుంటున్నారట. కథానుసారం సినిమాలో కొంత భాగం తైవాన్‌లో షూట్‌ చేయనున్నారు. ఆ సన్నివేశాల్లో ఈ కొరియన్‌ భామ కనిపిస్తుందని సమాచారం. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్‌ సంగీత దర్శకుడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement