సూపర్‌ ఎగ్జైట్‌మెంట్‌ | Kajal Aggarwal starts shooting for Indian 2 Movie | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఎగ్జైట్‌మెంట్‌

Published Mon, Feb 10 2020 12:25 AM | Last Updated on Mon, Feb 10 2020 1:15 AM

Kajal Aggarwal starts shooting for Indian 2 Movie - Sakshi

కాజల్‌ అగర్వాల్‌

మేకప్‌ రూమ్‌లో చాలా శ్రద్ధగా డైలాగ్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. ఈ ఏకాగ్రత ‘ఇండియన్‌ 2’ కోసమే. కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్‌ 2’. 1996లో కమల్‌హాసన్‌– శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’(తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌ చెన్నైలో జరుగుతోందని సమాచారం. ఈ షూట్‌లో కాజల్‌ పాల్గొన్నారు.

‘‘ఇండియన్‌ 2’ షూట్‌లో పాల్గొంటున్నాను.. చాలా ఎగ్జైట్‌మెంట్‌గా ఉంది’’ అన్నారు కాజల్‌ అగర్వాల్‌. ఈ సినిమాలో 80ఏళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపిస్తారట కాజల్‌. ఈ చిత్రంలోని పాత్ర కోసం అప్పట్లో మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా సాధన చేశారామె. సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్‌సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. లైకాప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement