
కమల్‌హాసన్
‘ఇండియన్ 2’ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో భిన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ‘ఇండియన్ 2’ మూవీ గురించి కోలీవుడ్‌లో ఓ కొత్త ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఆగస్టులో ప్రారంభం అవుతుందని కోలీవుడ్ టాక్. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ఇది సీక్వెల్. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ 3తో బిజీగా ఉన్నారు కమల్.
Comments
Please login to add a commentAdd a comment