
కమల్‌హాసన్
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్నారు కమల్‌హాసన్. తప్పుగా అర్థం చేసుకోకండి. ఆయన జైలుకి వెళ్లింది ‘ఇండియన్ 2’ సినిమా కోసం. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఇండియన్ 2’. 1996లో కమల్‌హాసనే హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇండియన్’ చిత్రానికి ఇది సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రి సెంట్రల్ జైలులో జరుగుతోంది.
ఈ షెడ్యూల్ దాదాపు పదిహేను రోజుల పాటు జరుగుతుందట. కమల్‌హాసన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రధారులు. అనిరు«ద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment