
కమల్‌హాసన్, రకుల్ ప్రీత్‌సింగ్
రకుల్ ప్రీత్‌సింగ్ రాజమండ్రికి వెళ్లడానికి సూట్‌కేస్ సర్దుకుంటున్నారు. ఎందుకంటే ‘ఇండియన్ 2’ సినిమా కోసమే. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్ 2’. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. సిద్ధార్థ్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ నటించనున్నారు. ప్రియాభవానీశంకర్, ఐశ్వర్యా రాజేష్ కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ వచ్చే నెల 19న రాజమండ్రిలో ప్రారంభించడానికి టీమ్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది.
ఈ షెడ్యూల్‌లో రకుల్, కాజల్ పాల్గొంటారని కోలీవుడ్ టాక్. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం తమిళ ‘బిగ్ బాస్ 3’తో బిజీగా ఉన్నారు కమల్. అయితే ఆగిపోయిన ‘తలైవన్ ఇరుక్కిండ్రాన్’ (2015లో దర్శక–నిర్మాతగా కమల్ ప్రకటించారు) సినిమా పనులను కూడా కమల్ ఇటీవల మొదలుపెట్టారు. సో.. ‘ఇండియన్ 2’, ‘తలైవన్ ఇరుక్కిండ్రాన్’ సినిమా షూటింగ్ లొకేషన్స్‌కి, బిగ్ బాస్ షోతో కమల్ బిజీ బిజీగా ఉంటారన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment