
అక్షరా హాసన్
పిల్లల్ని తమ మాటలతో ఎప్పటికప్పుడు మోటివేట్ చేసి, ఈ ప్రపంచాన్ని జయించేలా తయారు చేసే ఫాదర్స్‌ను బెస్ట్ ఫాదర్స్ అంటాం. కమల్ హాసన్ కూడా ఈ కోవలోకి చెందిన వారే. తన ఇద్దరికూతుళ్లను ఎప్పటికప్పుడు తన మాటల ద్వారానో, తాను ఆచరిస్తున్న విషయాల ద్వారానో మోటివేట్ చేస్తూనే ఉంటారాయన. రాజకీయాలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కోసం జిమ్‌ను సందర్శించటం మిస్ కావట్లేదు కమల్.
ఇప్పుడు ఆయన కొత్త జిమ్ స్నేహితురాలు ఎవరో తెలుసా? ఆయన చిన్న కుమార్తె అక్షరా హాసన్. ప్రస్తుతం చిన్న కూతురు అక్షరా హాసన్‌కు జిమ్ పాఠాలు నేర్పిస్తున్నారు కమల్. ‘‘నీ శరీరాన్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటే అది నీ మన స్సుని అంత చురుకుగా ఉంచుతుంది. బాడీ ఫిట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా మైండ్ కూడా ఫిట్‌గా ఉంటుందని అర్థం. ‘‘జిమ్మింగ్ విత్ మై బేబ్. నీ బాడీ మీద వర్క్ చేయి, అది నీ మెదడుని చురుకుగా ఉంచుతుంది. స్ట్రాంగ్ బాడీ.. స్ట్రాంగ్ మైండ్‌ని తయారుచేస్తుంది’’ అని ట్వీటర్‌లో ఫొటోను షేర్ చేశారు కమల్.
Comments
Please login to add a commentAdd a comment