
కమల్‌హాసన్
ప్రస్తుతం తమిళ ‘బిగ్ బాస్’ షోతో బిజీగా ఉన్నారు కమల్‌హాసన్. ఈ షో పూర్తయిన వెంటనే ఆయన ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటారు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికిది సీక్వెల్. సేమ్ కాంబినేషన్‌లోనే ‘ఇండియన్ 2’ తెరకెక్కనుంది. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తారు.
ఈ సినిమా కోసం ఇటీవల దర్శకుడు శంకర్ కడపలో లొకేషన్స్ చూసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కమల్‌హాసన్ మరో సీక్వెల్ గురించి కూడా ఆలోచిస్తున్నారనే ఊహాగానాలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. దాదాపు 22 ఏళ్ల క్రితం కమల్ హీరోగా భరతన్ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర్ మగన్’ (తెలుగులో ‘క్షత్రియ పుత్రుడు’)కి సీక్వెల్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరి.. ఈ సీక్వెల్ గురించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నట్లు.. ‘సన్న జాజి పడక..’ పాట ‘క్షత్రియపుత్రుడు’లోనిదే అనే విషయం గుర్తు చేయక్కర్లేదు.