
విజయ్
ఒక్కరోజు ముఖ్యమంత్రి అనే సరికొత్త కథాంశంతో శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన తమిళ చిత్రం ‘ముదల్‌వన్’. తెలుగులో ‘ఒకే ఒక్కడు’గా విడుదలైంది. 1999లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌పై ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజా సంగతి ఏంటంటే.. విజయ్ హీరోగా ఈ సినిమా సీక్వెల్‌ని తెరకెక్కించనున్నారట శంకర్. ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా ‘ఇండియన్ 2’(భారతీయుడు 2) సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు శంకర్. కరోనా లాక్‌డౌన్ కాలంలో ‘ఒకే ఒక్కడు’ సీక్వెల్‌కి కథ తయారు చేశారట ఆయన. ఇందులో విజయ్ హీరోగా నటించనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment