కాజల్ అగర్వాల్
సినిమాలో హీరోయిన్లు ఎంత వీలుంటే అంత అందంగా కనిపించాలనుకుంటారు. దానికి విరుద్ధంగా కొన్నిసార్లు స్క్రిప్ట్ చాలెంజ్ విసిరితే బ్యూటీ కిట్ పక్కన పెట్టి సరికొత్త లుక్‌లోనూ కనిపిస్తారు. ఇప్పుడు అలాంటి చాలెంజ్‌కే సిద్ధపడ్డారు కాజల్ అగర్వాల్. శంకర్–కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘భారతీయుడు 2’లో కాజల్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తారని టాక్. ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్‌కి సీక్వెల్ అయిన ‘భారతీయుడు 2’ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం సెట్ వర్క్ ఇటీవల ఆరంభమైంది.
షూటింగ్ ఈ నెల 14న ప్రారంభం కానుంది. ఇందులో కాజల్ అగర్వాల్ ఇది వరకూ ఎప్పుడూ కనిపించనటువంటి డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారట. అలాగే ఈ సినిమాలో కమల్‌కు సంబంధించిన లుక్ టెస్ట్ ఇటీవలే నిర్వహించారు శంకర్. ఈ పాత్ర కోసం కమల్ బరువు కూడా తగ్గారు. ఫస్ట్ పార్ట్‌లో పెద్ద కమల్ హాసన్, సుకన్యలను గుర్తుపట్టలేనట్లుగా ఉంటాయి వాళ్ల మేకప్. మరి ఇందులోనూ కమల్ అలాంటి ఓల్డ్ లుక్‌లోనే కనిపిస్తారా? కాజల్ కూడా సుకన్యలా వృద్ధురాలిలా కనిపిస్తారా? వేచి చూడాలి. తమిళ, మలయాళ యంగ్ హీరోలు శింబు, దుల్కర్ సల్మాన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment