
కమల్ హాసన్
విలక్షణ నటుడు కమల్ హాసన్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లిపోతుండటంతో ‘ఇండియన్ 2’ (తెలుగులో భారతీయుడు 2) తన ఆఖరి చిత్రం అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు. కానీ, ఆ సీక్వెల్ తర్వాత మరో సీక్వెల్‌కి రెడీ అవుతున్నారు కమల్. 1992లో వచ్చిన ‘థేవర్ మగన్’కి (తెలుగులో క్షత్రియ పుత్రుడు) సీక్వెల్ తెరకెక్కించే ఆలోచన ఉందని తాజాగా స్పష్టం చేశారట ఈ లోకనాయకుడు. ‘క్షత్రియ పుత్రుడు’ సినిమా కథను కమల్ హాసనే రాయడం విశేషం.
ఇటీవల ఓ సందర్భంలో కమల్ మాట్లాడుతూ– ‘నాకు రాజకీయాలవైపు వెళ్లాలనే ఆలోచన ‘థేవర్ మగన్’ సినిమాకు పని చేస్తున్నప్పుడే వచ్చింది’ అని పేర్కొన్నారట. అంటే ఈ సీక్వెల్ ద్వారా తన రాజకీయ ఆలోచనలను పంచుకుంటారా? వేచి చూడాలి. ఆల్రెడీ ‘శభాష్ నాయుడు’ సినిమా షూటింగ్ దశలో ఉంది. ‘భారతీయుడు 2’ షూటింగ్ స్టార్ట్ కావాలి. అంటే.. ‘థేవర్ మగన్’ సీక్వెల్ ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాత ఉంటుందా? లేకపోతే ఈ రెండు సినిమాలతో పాటే ఈ సీక్వెల్‌నూ సెట్స్ మీదకు తీసుకువెళ్తారా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment