చెన్నై: ‘రాష్ట్రాన్ని కాపాడటానికే మీ అవసరం కావలసి వస్తుంది. మంత్రులకు బదులివ్వడానికి నేను చాలు..’ అని నటుడు కమల్‌హాసన్ తన అభిమానులకు హితవు పలికారు. తమిళనాడులో ప్రస్తుతం కమల్‌హాసన్‌కు రాష్ట్ర మంత్రులకు మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతున్న విషయం తెలిసిందే. కమల్ మంత్రులపై అవినీతి ఆరోపణలు చేయడంతో వారి మధ్య వార్‌కు తెరలేచింది. అవినీతికి ఆధారాలుంటే బయట పెట్టాలన్న మంత్రుల డిమాండ్‌తో కమల్‌హాసన్ శాఖల వారీగా అవినీతిపై ఆధారాలు సేకరించాలని తన అభిమానులకు పిలుపునిచ్చారు.
కాగా ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాలలో కమల్‌హాసన్ అభిమానులు మంత్రులపై మాటల దాడి చేస్తూ పోస్టర్లను అంటించారు. ఈ చర్యలకు స్పందించిన నటుడు కమల్‌హాసన్ పోస్టర్లు ముద్రిస్తూ డబ్బును వృధా చేయవద్దనీ, ఆ డబ్బును సహాయకార్యక్రమాలను ఉపయోగిస్తే మంచిదనీ హితవు పలికారు. రాష్ట్రాన్ని కాపాడటానికే మీ అవసరం ఉంటుందనీ, ఇలాంటి మంత్రులకు బదులివ్వడానికి తాను చాలని కమల్ సోమవారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మంత్రులకు నేనొక్కడిని చాలు: కమల్‌హాసన్
Published Mon, Jul 24 2017 7:54 PM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM
Advertisement
Advertisement