మంత్రుల సవాల్‌ను స్వీకరించిన కమల్‌ | Kamal ‍hasan who received the challenge of ministers | Sakshi
Sakshi News home page

మంత్రుల సవాల్‌ను స్వీకరించిన కమల్‌

Published Thu, Jul 20 2017 7:09 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

మంత్రుల సవాల్‌ను స్వీకరించిన కమల్‌

మంత్రుల సవాల్‌ను స్వీకరించిన కమల్‌

చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపండని మంత్రులు విసిరిన సవాల్‌ను నటుడు కమల్‌హాసన్‌ స్వీకరించారు. అభిమానులతో కలిసి అవినీతి జాబితాను డిజిటల్‌ విధానంలో ప్రజా బాహుళ్యంలోకి పంపుతున్నానని బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారందరినీ అరెస్ట్‌ చేస్తే దక్షిణభారత దేశంలోని జైళ్లు చాలవని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతే లేదని మంత్రులు అంటున్నారు.. అంతా అవినీతిమయమని రాసి పంపాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు.

పోస్టు కార్డులు, పోస్టర్లు ద్వారా ప్రచారం చేస్తే చెరిగిపోతాయి, చిరిగి పోతాయి. ఇది డిజిటల్‌ యుగం, ఇంటర్నెట్‌ ద్వారా ప్రభుత్వ అవినీతిని నమోదు చేయండని కోరారు.  రాష్ట్రప్రభుత్వ మంత్రుల అధికారిక వెబ్‌సైట్‌ చిరునామాను కమల్‌ అభిమానులకు అందజేశారు. ఆదివారం రాత్రి కమల్‌ ఇచ్చిన పిలుపుకు వెంటనే స్పందించిన అభిమానులు పెద్ద ఎత్తున అవినీతి సమాచారం వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. విద్యార్ది సంఘాలు గురువారం నగరంలో కమల్‌కు మద్దతుగా ర్యాలీ జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement