
'అభిమానుల చర్యలకు గర్వంగా ఉంది'
చెన్నై: సూపర్ స్టార్ రజినీ కాంత్ తన అభిమానుల చర్యలకు పొంగిపోయాడు. ఇటీవల చెన్నైతో సహా తమిళనాడులోని చాలా ప్రాంతాలు వరదలతో అల్లాడుతున్న సమయంలో రజినీ తన అభిమానులకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చాడు. అభిమాన కథానాయకుని పిలుపు అందుకున్న అభిమానులు సహాయ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
అభిమానుల స్పందనకు ముగ్ధుడైన రజినీ కాంత్ ట్విట్టర్ ద్వారా తన హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపాడు. 'కష్ట కాలంలో అభిమానులు చెన్నైకి సహాయంగా నిలిచారు. నాకు ఇంతకన్నా ఎక్కువగా ఏదీ సంతోషం కలిగించదు. అభిమానుల చర్య గర్వంగా ఉంది' అని పేర్కొన్నారు.
శనివారం 64వ పడిలోకి అడుగుపెట్టిన రజినీ కాంత్ చెన్నై వరదల మూలంగా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోలేదు. అభిమానులను కూడా వేడుకలకు దూరంగా ఉండాలని కోరాడు. అయితే రజినీ ఇచ్చిన ఈ పిలుపును మాత్రం అభిమానులు పట్టించుకోలేదు.
To all my dear fans who stood & lived up to the hour of need for our chennai ..heart felt thanks ..nothing could make me happier and proud
— Rajinikanth (@superstarrajini) December 12, 2015