‘ధనబలంతో గెలిచారు’ | RK Nagar bypoll win was a "purchased" one: Kamal Haasan | Sakshi
Sakshi News home page

‘ధనబలంతో గెలిచారు’

Published Thu, Jan 4 2018 3:27 PM | Last Updated on Thu, Aug 30 2018 6:07 PM

RK Nagar bypoll win was a "purchased" one: Kamal Haasan  - Sakshi

సాక్షి, చెన్నై : ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్‌ గెలుపుపై ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధనబలంతోనే దినకరన్‌ గెలిచారని కమల్‌ ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో, తమిళ రాజకీయాల్లో ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికలు మాయని మచ్చగా అభివర్ణించారు. ఆర్‌కే నగర్‌ గెలుపు ఓట్లను కొనుగోలు చేయడంతోనే సాధ్యమైందన్నారు. దీన్ని ఓ స్కామ్‌ అని కూడా తాను వ్యాఖ్యానించనని..ఇది పట్టపగలు జరిగిన నేరమని వ్యాఖ్యానించారు.

స్వతంత్ర అభ్యర్థి (దినకరన్‌) తో పాటు పాలక పక్షం ఓటర్లకు వెలకట్టిందని ఆరోపించారు. తమిళ మేగజీన్‌ ఆనంద వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఓటర్లను ఉద్దేశించి మీరు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించారు. కమల్‌ ఆరోపణలను దినకరన్‌ తోసిపుచ్చుతూ ఉప ఎన్నికలో తన గెలుపును జీర్ణించుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement