ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల బరిలో దినకరన్‌ | Dinakaran in rk nagar by election | Sakshi
Sakshi News home page

ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల బరిలో దినకరన్‌

Published Thu, Nov 30 2017 2:20 AM | Last Updated on Thu, May 24 2018 12:05 PM

Dinakaran in rk nagar by election - Sakshi

చెన్నై: తమిళనాడులోని రాధాకృష్ణ(ఆర్‌కే)నగర్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్‌ పోటీచేయనున్నారు. డిసెంబర్‌ 21న జరగనున్న ఎన్నికల్లో దినకరన్‌ బరిలో నిలుస్తారని ఆయన వర్గంనేత ఎస్‌ అంబళగన్‌ చెప్పారు. వీకే శశికళ అంగీకారంతోనే దినకరన్‌ ఎన్నికల్లో పోటీచేస్తున్నారని ఆయన తెలిపారు.

ఆర్కేనగర్‌ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగాల్సిన ఉప ఎన్నికల్లోనూ దినకరన్‌ పోటీచేశారు. ప్రచారసమయంలో కోట్లాది రూపాయలు ఓటర్లకు పంచారనే ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్‌ను రద్దుచేసింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఆర్కేనగర్‌ ఎమ్మెల్యే సీటు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement