ముహూర్తం కుదిరింది | Rajinikanth's film with Kamal Haasan to be announced on March 5 | Sakshi
Sakshi News home page

ముహూర్తం కుదిరింది

Published Fri, Feb 28 2020 12:13 AM | Last Updated on Fri, Feb 28 2020 12:13 AM

Rajinikanth's film with Kamal Haasan to be announced on March 5 - Sakshi

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌

సుమారు 35 ఏళ్ల విరామం తర్వాత కమల్‌హాసన్‌ – రజనీకాంత్‌ కలసి సినిమా చేయబోతున్నారు. అయితే ఇందులో ఇద్దరూ కలసి నటించడం లేదు. కమల్‌హాసన్‌ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌లో రజనీకాంత్‌ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాను మార్చి మొదటి వారంలో ప్రకటించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసే దర్శకుల పేర్లలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ‘ఖైదీ’ చిత్రాన్ని తెరకెక్కించిన లోకేశ్‌ కనగరాజ్, ‘ఖాకీ’ తీసిన హెచ్‌. వినోద్‌ ఈ రేస్‌లో ఉన్నారు. మరి ఈ సినిమాలో ఏదైనా సన్నివేశంలో కమల్‌–రజనీ కనిపించే అవకాశం ఉంటుందా? వేచి చూడాలి.
∙రజనీకాంత్, కమల్‌ హాసన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement