Rajkamal Film International
-
నవంబర్‌లో షురూ
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన స్నేహితుడు, హీరో కమల్‌హాసన్ నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ నటించనున్న ఈ 169వ చిత్రానికి ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్ నిర్మించనున్నారు. రజనీకాంత్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నందున ఈ ప్రాజెక్టును నిలిపివేసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ‘రజనీ–కమల్ సినిమా ఆగిపోయిందన్నది కేవలం పుకారు మాత్రమే.. ఈ ఏడాది నవంబరులో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది’ అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా గురించి ఏప్రిల్‌లో అధికారికంగా ప్రకటించాలనుకున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రకటించలేదు. పైగా రజనీకాంత్ ఈ చిత్రానికి డేట్స్ ఖరారు చేయాల్సి ఉందట. నవంబరులో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. కాగా ఈ చిత్రంలో రజనీతో కమల్ వెండితెరను పంచుకుంటారా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. వీరిద్దరూ కలిసి చివరిసారిగా ‘గిరఫ్తార్’ అనే హిందీ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం రజనీకాంత్ శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తుండగా, శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ ‘భారతీయుడు 2’ సినిమాలో నటిస్తున్నారు. -
ప్లాన్ రెడీ
రజనీకాంత్ నెక్ట్స్ మూవీ షూటింగ్ కోసం ప్లాన్ రెడీ అవుతోంది. కమల్‌హాసన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాకు ‘మా నగరం (2017), ఖైదీ (2019)’ చిత్రాల ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఇది రజనీకాంత్ కెరీర్లో 169వ చిత్రం. ఆల్రెడీ కథా చర్చల్లో భాగంగా రజనీని లోకేష్ రెండుసార్లు కలిశారని సమాచారం. కథ పట్ల రజనీ సుముఖంగానే ఉన్నారట. అలాగే ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణులుగా ఎవర్ని ఎంపిక చేసుకోవాలనే విషయంపై కూడా కమల్–లోకేష్ చర్చించుకుంటున్నారట. ఈ సినిమాని నిర్మించనున్న కమల్ అతిథి పాత్రలోనూ కనిపించే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘అన్నాత్తే’ చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్. లాక్డౌన్ వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆగింది. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ‘అన్నాత్తే’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ముహూర్తం కుదిరింది
సుమారు 35 ఏళ్ల విరామం తర్వాత కమల్‌హాసన్ – రజనీకాంత్ కలసి సినిమా చేయబోతున్నారు. అయితే ఇందులో ఇద్దరూ కలసి నటించడం లేదు. కమల్‌హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్లో రజనీకాంత్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాను మార్చి మొదటి వారంలో ప్రకటించనున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే దర్శకుల పేర్లలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ‘ఖైదీ’ చిత్రాన్ని తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్, ‘ఖాకీ’ తీసిన హెచ్. వినోద్ ఈ రేస్‌లో ఉన్నారు. మరి ఈ సినిమాలో ఏదైనా సన్నివేశంలో కమల్–రజనీ కనిపించే అవకాశం ఉంటుందా? వేచి చూడాలి. ∙రజనీకాంత్, కమల్ హాసన్ -
గుమ్మడికాయ కొట్టి కేక్ కట్ చేశారు
చిత్ర షూటింగ్ పూర్తి అయితే గుమ్మడి కాయ కొట్టడం చిత్రపరిశ్రమలో ఒక సంప్రదా యం. ఈ మధ్య కొత్తగా కేక్ కట్ చేయడం కూ డా ఆనవాయితీ అయ్యింది. అలా తూంగావ నం చిత్ర యూనిట్ షూటింగ్‌ను పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టి,కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. విశ్వనాయకుడు కమలహాసన్ హీరోగా నటిస్తూ, రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం తూం గావనం. నటి త్రిష కథానాయికిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్ ముఖ్యపా త్ర పోషిస్తున్నారు. నవ దర్శకుడు రా జేష్ ఎం సెల్వ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి కమలహాసన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఆయన ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిన జిబ్రాన్ సంగీత బాణీలు కడుతున్న తూంగావనం చిత్ర షూటింగ్‌ను వడివడిగా పూర్తిచేయడం విశేషం. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనూ, మలి షె డ్యూల్‌ను చెన్నై పరిసర ప్రాంతాల్లో నూ నిర్వహించి పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. వైరము త్తు రాసిన పాటకు జిబ్రాన్ సంగీత బాణీ లు కట్టగా కమలహాసన్ పాడడంతో తూంగావనం చిత్రం షూటింగ్ పార్టు ముగిసినట్లు వెల్లడించారు.ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో నిమగ్నమైన చిత్ర యూనిట్ త్వరలో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.