
కమల్‌హాసన్
నటుడిగా కమల్‌హాసన్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం నటుడిగానే కాదు.. కొరియోగ్రాఫర్‌గా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. మేకప్‌లో కూడా కమల్‌కి నైపుణ్యం ఉంది. మేకప్ విభాగంపై కూడా పట్టు సాధించడానికి శిక్షణ కూడా తీసుకున్నానని అంటున్నారు కమల్ హాసన్. ఆయన శిక్షణ తీసుకున్నది కూడా ఆస్కార్ విజేత దగ్గర కావడం విశేషం. ‘‘హాలీవుడ్ మూవీ ‘స్టార్ ట్రెక్: ఫస్ట్ కాంటాక్ట్’ అప్పుడు మేకప్ నిపుణుడు మైఖేల్ వేస్ట్‌మోర్ దగ్గర దాదాపు 40రోజులు మేకప్ ఆర్టిస్టుగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సినిమాలో విచిత్రమైన ఆకారాల్లో వివిధ జీవులుంటాయి.
మేకప్‌కి బాగా స్కోప్ ఉన్న సినిమా. అందుకే ఆ సినిమాకి పని చేశాను’’ అంటూ మేకప్ గురించి తనకు ఉన్న ఆసక్తిని కమల్‌హాసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ‘ఇండియన్ 2’ చిత్రం కోసం కమల్‌హాసన్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 1996లో శంకర్–కమల్‌హాసన్ కాంబినేషన్‌లోనే వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. అలాగే కమల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘శభాష్ నాయుడు’కి తాత్కాలిక బ్రేక్ పడింది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ని మొదలుపెట్టాలనుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment