makeup skills
-
Priyanka Panwar: ఆమెకు వంద ముఖాలు! అతడి మరణవార్త విని.. మొదటిసారి..
ముఖ కవళికలను మరింత అందంగా తీర్చిదిద్దడానికి మంచి సాధనం మేకప్. ఒకప్పుడు అందాన్ని పెంచడానికి వాడే ఈ సాధనం నేడు అనేక రకాల మేకప్ ట్రెండ్స్‌తో కొత్త పుంతలు తొక్కుతోంది. మేకప్‌లో సరికొత్త మెళకువలతో చిత్ర విచిత్ర జిమ్మిక్కులను ఆకర్షణీయంగా రూపొందించి అలరిస్తున్నారు కళాకారులు. మేకప్ మీద ఉన్న మక్కువతో చేస్తోన్న ఉద్యోగాన్ని సైతం వదిలేసి మంచి ఆర్టిస్ట్‌గా మారింది ప్రియాంక పన్వర్. దేశవిదేశాల్లోని ప్రముఖ సెలబ్రెటీల ముఖాన్ని తన ముఖంపై చిత్రించి ఔరా అనిపిస్తోంది. దివికేగిన ఎంతో మంది సెలబ్రెటీలకు సైతం తన మేకప్ ద్వారా నివాళులర్పిస్తోంది. ఆసక్తి లేకపోవడంతో.. ఘజియాబాద్‌కు చెందిన ప్రియాంక పన్వర్ ఫార్మసీలో మాస్టర్స్ చేసిన తరువాత, రెగ్యులేటరీ అఫైర్స్‌లో ఉద్యోగం చేసుకుంటూ బిజీగా ఉండేది. ఉద్యోగంలో చేసే పని బావున్నప్పటికీ తనకి పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా.. తనకి ఎంతో ఇష్టమైన కెనడాకు చెందిన ఇల్యూషన్ ఆర్టిస్ట్ ‘మిమి చాయిస్’ మేకప్ వీడియోలను చూస్తూ తను కూడా ఆమెలానే ఆర్టిస్ట్ కావాలనుకుంది. అనుకున్న వెంటనే బేసిక్ మేకప్ కోర్సు నేర్చుకుంది. తనకు నచ్చిన సెలబ్రెటీల రూపాలను వేయడం ప్రారంభించి చక్కగా వేయడం వచ్చాక చేస్తోన్న ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి సమయాన్ని ఇల్యూషన్ మేకప్‌కు కేటాయించింది. View this post on Instagram A post shared by Illusion Mua - Priyanka Panwar (@makeupbypriyankapanwar) అతని మరణ వార్త విని.. తనకు నచ్చిన ముఖ కవళికలను మేకప్ మెళకువలతో అందంగా రూపొందిస్తూ ‘మేకప్ బై ప్రియాంక పన్వర్’ పేరుతో ఉన్న తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్టు చేస్తుండేది. ప్రియాంక మేకప్ వీడియోలు నెటిజనులకు నచ్చుతుండడంతో మరింత ఉత్సాహంతో ఇల్యూషన్ స్కెచ్‌లు వేస్తుండేది. సుశాంత్ రాజ్‌పుత్‌సింగ్ ఇక లేడన్న వార్త తెలియడంతో .. మేకప్‌తో తనముఖంపై సుశాంత్ ముఖాన్ని చిత్రించి నివాళులు అర్పించింది. సుశాంత్ రూపం తీసుకురావడానికి ఏడు గంటలపాటు కష్టపడి పనిచేసింది. తొలి సెలబ్రెటీ రూపం అయినప్పటికీ ఎంతో చక్కగా వచ్చిందని వ్యూవర్స్ కామెంట్స్ చేయడంతో ఆమె అప్పటినుంచి ఇల్యూషన్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Illusion Mua - Priyanka Panwar (@makeupbypriyankapanwar) సెలబ్రెటీల నుంచి సినిమాలదాకా సుశాంత్ సింగ్ముఖంతో ప్రారంభమైన ప్రియాంక ఇల్యూషన్ మేకప్ ఆ తరువాత విరాట్ కోహ్లి, మనీ హీస్ట్ నటులు, బప్పీ లహరీ, రాజ్‌కుమార్ రావ్, అల్లు అర్జున్, గురురంధ్వా, కెల్లీ జెన్నర్, బిల్లీ పోర్టర్, దిల్జిత్ సింగ్, మిల్కా సింగ్, మొన్న హత్యకు గురైన గాయకుడు మూసావాల రూపాలను చక్కగా తీర్చిదిద్ది వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సెలబ్రెటీల ముఖాలేగాక ‘రే’ సినిమాలోని కేకే మీనన్ క్యారెక్టర్‌ను తన ఇల్యూషన్ ఆర్ట్‌తో చక్కగా తీర్చిదిద్దింది. ఎంతోమంది సెలబ్రెటీల రూపాలు చిత్రించిన ప్రియాంక తన నానమ్మ ముఖాన్ని చిత్రించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. View this post on Instagram A post shared by Illusion Mua - Priyanka Panwar (@makeupbypriyankapanwar) మనసు పెడితే కష్టం కాదు మేకప్‌లో చిన్న తప్పు జరిగినా మొత్తం పాడైపోతుంది. అనుకున్న రూపు రేఖలు రావు. ఇల్యూషన్ ఆర్ట్ సవాలుతో కూడుకున్నదైనప్పటికీ మనసుపెట్టి వేస్తే పెద్ద కష్టం కాదు. ఒక్కో ముఖాన్ని అచ్చుగుద్దినట్టు తీసుకురావడానికి కొన్ని గంటలు పడితే, మరికొన్నింటికి రోజంతా పడుతుంది. త్రీడి ఇమేజ్ రావాలంటే చాలా కష్టపడాలి. యాక్సెసరీస్, విగ్స్, లెన్స్, అవుట్ ఫిట్స్ అన్నీ చక్కగా కుదిరితేనే ఇల్యూషన్ ఇమేజ్ చక్కగా వస్తుంది. ‘‘ఏపీజే అబ్దుల్ కలాం, విక్రమ్ బాత్ర, జీత్లాల మా నానమ్మ ముఖాలు నేను రూపొందించిన వాటిలో నాకు బాగా నచ్చినవి. – ప్రియాంక పన్వర్ చదవండి: వ్యర్థాల నుంచి అర్థాలు: హీనంగా చూడకు దేన్నీ పనికొచ్చేవేనోయ్ అన్నీ! -
పర్మినెంట్ మేకప్.. హర్షిత సొంతం
శ్రీనగర్‌కాలనీ: అందం..ఈ పదం అంటే అందరికీ ఇష్టమే..ఎదుటివారికిఅందంగా కనబడటానికి ప్రతిఒక్కరూ తాపత్రయపడతారు. దీనికి పురుషులు, మహిళలు అనే తేడా లేదు. దాదాపు అందరూ అందంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందంగా కనిపించాలనే క్రమంలో కొందరు ప్రత్యేక బ్యూటీషియన్లను సంప్రదిస్తుంటారు. అయితే అలాంటి అందాన్ని అందించాలంటే నిపుణుల పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతేముఖం, శరీరం దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ నగరంలో అనుభవం, శిక్షణ తీసుకున్న పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌లు చాలా అరుదు. చదివింది బీటెక్.. చేసేది మేకప్.. హర్షిత చదివింది బీటెక్..ప్రతిభ అవార్డు సైతం పొందింది. తర్వాత ఎంబీఏ కూడా చేసింది.. అయితే మేకప్ ఆర్టిస్ట్‌గా రాణించాలనేది ఆమె ప్యాషన్.. అందుకే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్‌ను పొంది బ్యాంకాక్‌లో జరిగిన బ్యాంకాక్ బ్యూటోరియం చాంపియన్‌షిప్–2020లో అవార్డును సైతం పొంది తన మేకప్‌లో ప్రత్యేకత చాటుతుంది నగరానికి చెందిన హర్షిత అజ్మీర. బీటెక్–ఎంబీఏ చేసినా మేకప్ ఆర్టిస్ట్‌గా ఎలా తన కెరీర్‌ను ఎంచుకుందో సాక్షికి వివరించింది. ఆ వవివరాలు ఆమె మాటల్లోనే.. శిక్షణ చాలా అవసరం.. పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌కు శిక్షణ చాలా అవసరం. లేకుంటే స్కిన్‌తో పాటు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకచోట పర్మనెంట్‌గా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దుబాయ్, బ్యాంకాక్, యూఎస్‌లో అనుభవజ్ఞులైన స్పెషలిస్టుల వద్ద శిక్షణ తీసుకున్నాను. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ పొందాను. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ పొందినవారు అరుదు. ఐబ్రో మైక్రోబ్లేడింగ్, లిప్ మైక్రో షేడింగ్, ఐలాష్, మెషోవైట్ స్కిన్ వైటినింగ్, స్కిన్ లిప్టింగ్లకు ప్రత్యేక శిక్షణ అవసరం. చాలా జాగ్రత్తగా స్కిన్ దెబ్బతినకుండా అందంగా కనబడేలా పర్మనెంట్ మేకప్ చేయాలి. విదేశాల్లో ఉన్నవారికి సైతం పర్మనెంట్ మేకప్ ఇస్తుంటాను. నగరంలో హెచ్‌కే మేకప్ పేరిట క్లినిక్‌ను ఏర్పాటుచేశాను. బ్రైడల్మేకప్తో పాటు పర్మనెంట్ మేకప్ ఇస్తున్నాను. పర్మనెంట్ మేకప్‌లో ఇతర దేశాలతో పాటు, ఇక్కడ కూడా శిక్షణ ఇస్తున్నాను. పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌లో శిక్షణ తీసుకుంటే కెరీర్‌కు దోహదపడుతుంది. సిటీలోనే జన్మించా.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. ఎంజీఐటీలో బీటెక్, జేఎన్టీయూలో ఎంబీఏ చేశాను. కానీ చిన్నతనం నుంచి మహిళల అందం పట్ల, మేకప్ పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. చూసే వారికి అందంగా కనబడాలని, ఏదైనా శుభకార్యాల్లో అందరికంటే భిన్నంగా కనబడాలని ప్రతిఒక్కరికీ ఆశ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. జాబ్ కాకుండా పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలని ఆ దిశగా అడుగులు వేశాను. దుబాయ్, బ్యాంకాక్‌లో శిక్షణ.. మేకప్ ఆర్టిస్ట్, పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌కు చాలా తేడా ఉంది. మేకప్ అంటే అప్పటికప్పుడు అందంగా కనబడటానికి వేసేది. కానీ పర్మనెంట్ మేకప్ అలా కాదు. రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. మొదట బ్రైడల్ మేకప్ శిక్షణ తీసుకున్నాను. అలా కొద్ది నెలల తర్వాత ఎక్కడో వెలితి కనిపించింది. ఐబ్రో, లిప్స్, స్కిన్‌లకు అప్పటికప్పుడు మాత్రమే మేకప్ ఇవ్వడం..కొద్ది రోజులకు మళ్లీ మామూలు స్థితికి రావడంగమనించాను.ఇలా కాకుండా పర్మనెంట్‌గా చేస్తే బాగుటుందనే ఆలోచన వచ్చింది. వాటికి ప్రత్యేకమైన శిక్షణ తీసుకోవాలి. అందుకే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా రాణించాలని దుబాయ్, బ్యాంకాక్, యూఎస్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అవార్డు సంతోషాన్నిచ్చింది బ్యాంకాక్‌లో బ్యాంకాక్ బ్యూటోరియం ఛాంపియన్షిప్–2020లో అవార్డు రావడం చాలా సంతోషంగా అనిపించింది. కొత్త సంవత్సరం విదేశాల్లో అవార్డు అందుకున్నా. నా కుటుంబ సభ్యులు, భర్త కార్తీక్ నన్ను చాలా ప్రోత్సహించాడు. అంతేకాకుండా దుబాయ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. మేకప్రంగంలో కెరీర్‌ను కొత్తగా మలుచుకోవాలంటే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా శిక్షణ తప్పక తీసుకోవాలి. -
40 రోజుల శిక్షణ
నటుడిగా కమల్‌హాసన్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కేవలం నటుడిగానే కాదు.. కొరియోగ్రాఫర్‌గా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. మేకప్‌లో కూడా కమల్‌కి నైపుణ్యం ఉంది. మేకప్ విభాగంపై కూడా పట్టు సాధించడానికి శిక్షణ కూడా తీసుకున్నానని అంటున్నారు కమల్ హాసన్. ఆయన శిక్షణ తీసుకున్నది కూడా ఆస్కార్ విజేత దగ్గర కావడం విశేషం. ‘‘హాలీవుడ్ మూవీ ‘స్టార్ ట్రెక్: ఫస్ట్ కాంటాక్ట్’ అప్పుడు మేకప్ నిపుణుడు మైఖేల్ వేస్ట్మోర్ దగ్గర దాదాపు 40రోజులు మేకప్ ఆర్టిస్టుగా ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ సినిమాలో విచిత్రమైన ఆకారాల్లో వివిధ జీవులుంటాయి. మేకప్‌కి బాగా స్కోప్ ఉన్న సినిమా. అందుకే ఆ సినిమాకి పని చేశాను’’ అంటూ మేకప్ గురించి తనకు ఉన్న ఆసక్తిని కమల్‌హాసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ‘ఇండియన్ 2’ చిత్రం కోసం కమల్‌హాసన్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 1996లో శంకర్–కమల్‌హాసన్ కాంబినేషన్లోనే వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. అలాగే కమల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘శభాష్ నాయుడు’కి తాత్కాలిక బ్రేక్ పడింది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ని మొదలుపెట్టాలనుకుంటున్నారట. -
మేకప్‌తో మరింత అందం
-
అతను డిస్నీ ‘ప్రిన్సెస్’ అయిపోయాడు!
అమెరికాకు చెందిన 21 ఏళ్ల యువకుడు డిస్నీ ప్రిన్సెస్ కావడానికి అమ్మాయి అవసరం లేదని నిరూపించాడు. స్వయంగా మేకప్ మేన్ అయిన రిచర్డ్ స్కాఫర్ నాలుగేళ్ల పాటు డిస్నీ ప్రిన్సెస్ లా డ్రెస్, మేకప్ చేసుకోవాలనే కలను నిజం చేసుకున్నాడు. డిస్నీ ప్రిన్సెస్ లా వివిధ రకాల్లో ఫోటోలకు ఫోజిచ్చి వాటిని ఇంటర్ నెట్ ఉంచాడు. అంతే, అవి వైరల్ అయిపోయాయి. ప్రస్తుతం తాను రెండే రెండు గంటల్లో మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ చేసుకుని ప్రిన్సెస్ లా కనిపిస్తానని చెబుతున్నాడు. చిన్నతనం నుంచి పాఠశాలలో మేకప్ కాంపిటీషన్లలో పాల్గొనేవాడినని తెలిపాడు. ఈ ఫోటోలనే గనక డిస్నీ సంస్థ దృష్టిలో పడితే రిచర్డ్ రొట్టే విరిగి నేతిలో పడ్డట్టే..!