హర్షిత
శ్రీనగర్‌కాలనీ: అందం..ఈ పదం అంటే అందరికీ ఇష్టమే..ఎదుటివారికిఅందంగా కనబడటానికి ప్రతిఒక్కరూ తాపత్రయపడతారు. దీనికి పురుషులు, మహిళలు అనే తేడా లేదు. దాదాపు అందరూ అందంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందంగా కనిపించాలనే క్రమంలో కొందరు ప్రత్యేక బ్యూటీషియన్లను సంప్రదిస్తుంటారు. అయితే అలాంటి అందాన్ని అందించాలంటే నిపుణుల పర్యవేక్షణలోనే ట్రీట్‌మెంట్ తీసుకోవాలి. లేకపోతేముఖం, శరీరం దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ నగరంలో అనుభవం, శిక్షణ తీసుకున్న పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌లు చాలా అరుదు.
చదివింది బీటెక్.. చేసేది మేకప్..
హర్షిత చదివింది బీటెక్..ప్రతిభ అవార్డు సైతం పొందింది. తర్వాత ఎంబీఏ కూడా చేసింది.. అయితే మేకప్ ఆర్టిస్ట్‌గా రాణించాలనేది ఆమె ప్యాషన్.. అందుకే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్‌ను పొంది బ్యాంకాక్‌లో జరిగిన బ్యాంకాక్ బ్యూటోరియం చాంపియన్‌షిప్–2020లో అవార్డును సైతం పొంది తన మేకప్‌లో ప్రత్యేకత చాటుతుంది నగరానికి చెందిన హర్షిత అజ్మీర. బీటెక్–ఎంబీఏ చేసినా మేకప్ ఆర్టిస్ట్‌గా ఎలా తన కెరీర్‌ను ఎంచుకుందో సాక్షికి వివరించింది. ఆ వవివరాలు ఆమె మాటల్లోనే..
శిక్షణ చాలా అవసరం..
పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌కు శిక్షణ చాలా అవసరం. లేకుంటే స్కిన్‌తో పాటు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకచోట పర్మనెంట్‌గా ట్రీట్‌మెంట్ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దుబాయ్, బ్యాంకాక్, యూఎస్‌లో అనుభవజ్ఞులైన స్పెషలిస్టుల వద్ద శిక్షణ తీసుకున్నాను. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ పొందాను. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ పొందినవారు అరుదు. ఐబ్రో మైక్రోబ్లేడింగ్, లిప్ మైక్రో షేడింగ్, ఐలాష్, మెషోవైట్ స్కిన్ వైటినింగ్, స్కిన్ లిప్టింగ్‌లకు ప్రత్యేక శిక్షణ అవసరం. చాలా జాగ్రత్తగా స్కిన్ దెబ్బతినకుండా అందంగా కనబడేలా పర్మనెంట్ మేకప్ చేయాలి. విదేశాల్లో ఉన్నవారికి సైతం పర్మనెంట్ మేకప్ ఇస్తుంటాను. నగరంలో హెచ్‌కే మేకప్ పేరిట క్లినిక్‌ను ఏర్పాటుచేశాను. బ్రైడల్‌మేకప్‌తో పాటు పర్మనెంట్ మేకప్ ఇస్తున్నాను. పర్మనెంట్ మేకప్‌లో ఇతర దేశాలతో పాటు, ఇక్కడ కూడా శిక్షణ ఇస్తున్నాను. పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌లో శిక్షణ తీసుకుంటే కెరీర్‌కు దోహదపడుతుంది.
సిటీలోనే జన్మించా..
హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. ఎంజీఐటీలో బీటెక్, జేఎన్‌టీయూలో ఎంబీఏ చేశాను. కానీ చిన్నతనం నుంచి మహిళల అందం పట్ల, మేకప్ పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. చూసే వారికి అందంగా కనబడాలని, ఏదైనా శుభకార్యాల్లో అందరికంటే భిన్నంగా కనబడాలని ప్రతిఒక్కరికీ ఆశ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. జాబ్ కాకుండా పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలని ఆ దిశగా అడుగులు వేశాను.
దుబాయ్, బ్యాంకాక్‌లో శిక్షణ..
మేకప్ ఆర్టిస్ట్, పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌కు చాలా తేడా ఉంది. మేకప్ అంటే అప్పటికప్పుడు అందంగా కనబడటానికి వేసేది. కానీ పర్మనెంట్ మేకప్ అలా కాదు. రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. మొదట బ్రైడల్ మేకప్ శిక్షణ తీసుకున్నాను. అలా కొద్ది నెలల తర్వాత ఎక్కడో వెలితి కనిపించింది. ఐబ్రో, లిప్స్, స్కిన్‌లకు అప్పటికప్పుడు మాత్రమే మేకప్ ఇవ్వడం..కొద్ది రోజులకు మళ్లీ మామూలు స్థితికి రావడంగమనించాను.ఇలా కాకుండా పర్మనెంట్‌గా చేస్తే బాగుటుందనే ఆలోచన వచ్చింది. వాటికి ప్రత్యేకమైన శిక్షణ తీసుకోవాలి. అందుకే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా రాణించాలని దుబాయ్, బ్యాంకాక్, యూఎస్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను.
అవార్డు సంతోషాన్నిచ్చింది
బ్యాంకాక్‌లో బ్యాంకాక్ బ్యూటోరియం ఛాంపియన్‌షిప్–2020లో అవార్డు రావడం చాలా సంతోషంగా అనిపించింది. కొత్త సంవత్సరం విదేశాల్లో అవార్డు అందుకున్నా. నా కుటుంబ సభ్యులు, భర్త కార్తీక్ నన్ను చాలా ప్రోత్సహించాడు. అంతేకాకుండా దుబాయ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. మేకప్‌రంగంలో కెరీర్‌ను కొత్తగా మలుచుకోవాలంటే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా శిక్షణ తప్పక తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment