harshitha
-
Harshitha: కామన్ మ్యాన్ ఫ్రెండ్..!
ఆలోచించాలేగానీ.. శతకోటి సమస్యలకు అనంత కోటి పరిష్కారాలు ఉంటాయి. మామయ్యను అనారోగ్యానికి గురి చేసిన సమస్యపై దృష్టి పెట్టిన హరిత ఆ సమస్యకు పరిష్కారం కనుక్కుంది. శాస్త్రప్రపంచంలో తొలి అడుగు వేసింది...పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన హర్షిత చిన్ననాటి నుంచి తెలివైన విద్యార్థి. జెడ్పీ హెచ్ఎస్ చందనాపూర్లో చదువుతుండేది. క్రమం తప్పకుండా బడికి వచ్చే హర్షిత ఒకసారి వరుసగా వారంరోజులు రాలేదు. ఆ తరువాత బడికి వచ్చిన హర్షితను సైన్స్ టీచర్‌తో పాటు క్లాస్ టీచర్‌గా ఉన్న సంపత్ కారణం అడిగారు.తన మామయ్య వెల్డింగ్ పనిచేస్తాడని, వెల్డింగ్ పొగ పీల్చి ఊపిరితిత్తులు జబ్బు పడ్డాయని, ఆయనకు సహాయంగా ఉండేందుకు స్కూలుకు రాలేదని చెప్పింది. ‘మామయ్య మరోసారి జబ్బు పడకుండా ఏదైనా చేయాలని ఉంది’ అని తన మనసులోని మాట చెప్పింది. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహంతో హరిత ఒక హెల్మెట్ తయారుచేసింది. చిన్న ఫ్యాన్ అమర్చి రూపొందించిన ఈ హెల్మెట్ వెల్డింగ్ సమయంలో పొగను ముఖం వరకు చేరనివ్వదు. హరిత రూపొందించిన హెల్మెట్ చూసి సైన్స్ టీచర్ ఆశ్చర్యపోయారు. హరితను అభినందించారు.తొలుత ప్రోటోటైప్‌గా రూపొందించిన ఈ హెల్మెట్‌ను ఉపాధ్యాయుల సలహాలు, సూచనలతో మరింత మెరుగు పరిచింది. హెల్మెట్‌కు ఒక సెన్సార్ బిగించి, వెల్డింగ్ చేస్తున్న వ్యక్తి ముఖం పైకి పొగ రాగానే హెల్మెట్‌పై ఉన్న ఫ్యాన్ దానంతట అదే తిరిగేలా డిజైన్ చేసింది. సిమెంటు, ఇటుక, పిండిమర.... మొదలైన పరిశ్రమలలో పని చేసే కార్మికులు, నిరంతరం దుమ్ములో పనిచేసే ట్రాఫిక్ పోలీసులకు ఎలాంటి శ్వాసకోశ సమస్యలు రాకుండా రక్షణ ఇస్తుంది. దీనికి ‘కామన్ మ్యాన్ ఫ్రెండ్లీ హెల్మెట్’గా నామకరణం చేసింది. ఈ హెల్మెట్ జపాన్ సకురా ఇంటర్నేషనల్ సైన్స్ప్రోగ్రాం, ఇండియన్ ఇంటర్నేషన్ ఇన్నోవేషన్ప్రోగ్రాం, ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్ప్రోగ్రామ్లకు ఎంపికైంది.స్మార్ట్ ఫ్రెండ్లీ వాటర్‌బాటిల్.కరోనా టైమ్‌లో స్మార్ట్ ఫ్రెండ్లీ వాటర్ బాటిల్‌ను తయారు చేసింది హర్షిత. ఈ బాటిల్‌ను మూడు అరలుగా విభజించారు. మొదటి అరలో శానిటైజర్, రెండో అరలో తాగునీరు, మూడో అరలో సబ్బు/స్నాక్స్ పెట్టుకునేలా ఈ బాటిల్‌ను రూపొందించింది. ప్రతీ అరగంటకు ఒకసారి నీరు తాగే విషయాన్ని మనకు రెడ్‌లైట్‌తో లేదా వైబ్రేషన్, సౌండ్ సదుపాయాల ద్వారా గుర్తు చేస్తుంటుంది. హర్షిత కరీంనగర్‌లోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్’లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. – బాషబోయిన అనిల్ కుమార్, సాక్షి, కరీంనగర్ఇవి చదవండి: ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు! -
'ఎనిమిదేళ్లకే నూరేళ్లు నిండిన హర్షిత'.. భార్య, కూతురి మరణంతో తండ్రి శోకం..
జగిత్యాల: చిన్నతనంలోనే గుండెపోటు రావడంతో చిన్నారి ప్రాణాలు విడిచిన ఘటన తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన బొల్గం హర్షిత ఉరఫ్ జాను(8) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించింది. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తల్లి రమ్య మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది. తండ్రి సతీశ్‌గౌడ్ భార్య, కూతురి మరణంతో కన్నీరుమున్నీరయ్యా డు. జిల్లెల్ల గ్రామంలో విషాదం నెలకొంది. -
పర్మినెంట్ మేకప్.. హర్షిత సొంతం
శ్రీనగర్‌కాలనీ: అందం..ఈ పదం అంటే అందరికీ ఇష్టమే..ఎదుటివారికిఅందంగా కనబడటానికి ప్రతిఒక్కరూ తాపత్రయపడతారు. దీనికి పురుషులు, మహిళలు అనే తేడా లేదు. దాదాపు అందరూ అందంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అందంగా కనిపించాలనే క్రమంలో కొందరు ప్రత్యేక బ్యూటీషియన్లను సంప్రదిస్తుంటారు. అయితే అలాంటి అందాన్ని అందించాలంటే నిపుణుల పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతేముఖం, శరీరం దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ నగరంలో అనుభవం, శిక్షణ తీసుకున్న పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌లు చాలా అరుదు. చదివింది బీటెక్.. చేసేది మేకప్.. హర్షిత చదివింది బీటెక్..ప్రతిభ అవార్డు సైతం పొందింది. తర్వాత ఎంబీఏ కూడా చేసింది.. అయితే మేకప్ ఆర్టిస్ట్‌గా రాణించాలనేది ఆమె ప్యాషన్.. అందుకే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్‌ను పొంది బ్యాంకాక్‌లో జరిగిన బ్యాంకాక్ బ్యూటోరియం చాంపియన్‌షిప్–2020లో అవార్డును సైతం పొంది తన మేకప్‌లో ప్రత్యేకత చాటుతుంది నగరానికి చెందిన హర్షిత అజ్మీర. బీటెక్–ఎంబీఏ చేసినా మేకప్ ఆర్టిస్ట్‌గా ఎలా తన కెరీర్‌ను ఎంచుకుందో సాక్షికి వివరించింది. ఆ వవివరాలు ఆమె మాటల్లోనే.. శిక్షణ చాలా అవసరం.. పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌కు శిక్షణ చాలా అవసరం. లేకుంటే స్కిన్‌తో పాటు పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకచోట పర్మనెంట్‌గా ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. దుబాయ్, బ్యాంకాక్, యూఎస్‌లో అనుభవజ్ఞులైన స్పెషలిస్టుల వద్ద శిక్షణ తీసుకున్నాను. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ పొందాను. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ పొందినవారు అరుదు. ఐబ్రో మైక్రోబ్లేడింగ్, లిప్ మైక్రో షేడింగ్, ఐలాష్, మెషోవైట్ స్కిన్ వైటినింగ్, స్కిన్ లిప్టింగ్లకు ప్రత్యేక శిక్షణ అవసరం. చాలా జాగ్రత్తగా స్కిన్ దెబ్బతినకుండా అందంగా కనబడేలా పర్మనెంట్ మేకప్ చేయాలి. విదేశాల్లో ఉన్నవారికి సైతం పర్మనెంట్ మేకప్ ఇస్తుంటాను. నగరంలో హెచ్‌కే మేకప్ పేరిట క్లినిక్‌ను ఏర్పాటుచేశాను. బ్రైడల్మేకప్తో పాటు పర్మనెంట్ మేకప్ ఇస్తున్నాను. పర్మనెంట్ మేకప్‌లో ఇతర దేశాలతో పాటు, ఇక్కడ కూడా శిక్షణ ఇస్తున్నాను. పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌లో శిక్షణ తీసుకుంటే కెరీర్‌కు దోహదపడుతుంది. సిటీలోనే జన్మించా.. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. ఎంజీఐటీలో బీటెక్, జేఎన్టీయూలో ఎంబీఏ చేశాను. కానీ చిన్నతనం నుంచి మహిళల అందం పట్ల, మేకప్ పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. చూసే వారికి అందంగా కనబడాలని, ఏదైనా శుభకార్యాల్లో అందరికంటే భిన్నంగా కనబడాలని ప్రతిఒక్కరికీ ఆశ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు అందానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. జాబ్ కాకుండా పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ఎంచుకోవాలని ఆ దిశగా అడుగులు వేశాను. దుబాయ్, బ్యాంకాక్‌లో శిక్షణ.. మేకప్ ఆర్టిస్ట్, పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌కు చాలా తేడా ఉంది. మేకప్ అంటే అప్పటికప్పుడు అందంగా కనబడటానికి వేసేది. కానీ పర్మనెంట్ మేకప్ అలా కాదు. రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. మొదట బ్రైడల్ మేకప్ శిక్షణ తీసుకున్నాను. అలా కొద్ది నెలల తర్వాత ఎక్కడో వెలితి కనిపించింది. ఐబ్రో, లిప్స్, స్కిన్‌లకు అప్పటికప్పుడు మాత్రమే మేకప్ ఇవ్వడం..కొద్ది రోజులకు మళ్లీ మామూలు స్థితికి రావడంగమనించాను.ఇలా కాకుండా పర్మనెంట్‌గా చేస్తే బాగుటుందనే ఆలోచన వచ్చింది. వాటికి ప్రత్యేకమైన శిక్షణ తీసుకోవాలి. అందుకే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా రాణించాలని దుబాయ్, బ్యాంకాక్, యూఎస్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అవార్డు సంతోషాన్నిచ్చింది బ్యాంకాక్‌లో బ్యాంకాక్ బ్యూటోరియం ఛాంపియన్షిప్–2020లో అవార్డు రావడం చాలా సంతోషంగా అనిపించింది. కొత్త సంవత్సరం విదేశాల్లో అవార్డు అందుకున్నా. నా కుటుంబ సభ్యులు, భర్త కార్తీక్ నన్ను చాలా ప్రోత్సహించాడు. అంతేకాకుండా దుబాయ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. మేకప్రంగంలో కెరీర్‌ను కొత్తగా మలుచుకోవాలంటే పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్‌గా శిక్షణ తప్పక తీసుకోవాలి. -
టేక్ అనగానే పూనకం వచ్చేస్తుంది
‘‘రెండు హిట్స్ వస్తే రిలాక్స్ అయ్యే రోజులివి. ఇన్నేళ్లు ఫీల్డ్‌లో ఉన్నామంటే నిరంతరం పరిగెడుతుండటమే కారణం. రేస్‌లో ఉండాలంటే ప్రతిరోజూ పరిగెత్తాలి. రెస్ట్ తీసుకొని అవసరమైనప్పుడే పరిగెడతాను అంటే కిందపడతాం’’ అన్నారు రాజేంద్రప్రసాద్. విశ్వంత్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తోలుబొమ్మలాట’. విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో దుర్గా ప్రసాద్ మాగంటి నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా రాజేంద్రప్రసాద్ చెప్పిన విశేషాలు. ► మన పెద్దవాళ్లు చెప్పేవారు ‘జీవితమే ఒక తోలుబొమ్మలాట’ అని. తల్లి, తండ్రి, గురువు, దైవం ఇలా ఎవరో ఒకరు మనల్ని ఆడిస్తూనే ఉంటారు. మనందర్నీ ఆ దేవుడు ఆడిస్తున్నాడని నేను నమ్ముతాను. అనుకున్నట్టు జరగనిదే జీవితం. దాన్ని ఆస్వాదించాలి. ► దర్శకుడు విశ్వనాథ్ నాకు ‘తోలుబొమ్మలాట’ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ‘ఈ కథ మొత్తం మీ చుట్టూనే తిరుగుతుంది’ అన్నాడు. అవునా, సరే అని విన్నాను. కథ పూర్తయ్యేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది. ‘ఈ కథ నువ్వే రాశావా?’ అని అడిగాను. కథ నాకు అంత బాగా నచ్చింది. కుటుంబ బంధాలు, అనుబంధాలు గురించి చెప్పే మంచి కథ. కానీ దర్శకుడి వయసు చూస్తే 30కి తక్కువే. అందుకే కథ నువ్వే రాశావా? అని అతన్ని అడిగాను. ► ఈ సినిమాలో సోడాల రాజు అనే పాత్ర చేశాను. ఇందులో నా పాత్ర కొత్తగా కనపడాలనుకున్నాం. కొత్తగా కనపడాలంటే పాత్ర మాత్రమే కనపడాలి. పెద్ద మనిషిలా కనపడాలి. అందరూ గౌరవించేలా ఉండాలి. మనిషికి ఎన్నో బంధాలు. వాటి వల్ల పొందే కష్టాలు, సుఖాలు ఉంటాయి. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను మా సినిమాలో చూపించాం. ► కామెడీ ఎప్పుడూ రెండు రకాలు. ఒకటి హీరో చేసేది, మరోటి కమెడియన్ చేసేది. ఎవరు కామెడీ చేసినా సరే అది ఎక్కువ కాలం నిలబడాలంటే కామెడీ ఎప్పుడూ హుందాగా ఉండాలి. కొత్తకొత్తవాళ్లతో సినిమాలు చేస్తున్నాను. కొందరు ఎలా చేద్దాం? అని డిస్కస్ చేస్తుంటారు. అలాంటప్పుడు నా అభిప్రాయాలు చెబుతుంటాను. ► నటుడిగా ఇన్నేళ్లుగా సినిమాలు చేస్తున్నా ఎప్పుడూ కూడా నా వృత్తిని తేలికగా తీసుకోలేదు. ఎప్పుడైనా బయటకు సరదాగా చెబుతాం అవలీలగా పాత్రలు చేసేశాం అని. అయితే ప్రతీ పాత్ర చేయడానికి ఎంతో శ్రమ దాగి ఉంటుంది. నేనేదైనా కథ విన్నాక ఓ 2–3 గంటలు మా ఇంట్లో ఎవ్వరూ నన్ను డిస్ట్రబ్ చేయరు. ఆ సమయాన్నంతా పాత్రలోకి ఎలా వెళ్లాలి? అని ఆలోచిస్తుంటాను. సెట్లో కూడా ఆ పాత్ర గురించి ఆలోచిస్తుంటాను. టేక్ అనగానే నాకు పూనకం వచ్చేస్తుంది. ► ప్రస్తుతం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాను. ‘సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో..’ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నాను. ‘ఎర్ర చీర’ చేస్తున్నాను. ‘సరిలేరులో..’ మహేశ్, నేను టామ్ అండ్ జెర్రీలా ఉంటాం. ‘వైకుంఠ..’లో పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నా. ► నా వారసుణ్ణి కూడా నేనే. నాకు ఆసక్తి ఉండి నేనే సినిమాల్లోకి వచ్చాను. మా పిల్లలు రాలేదు. కానీ నా మనవరాలు ‘మహానటి’ ద్వారా పరిచయం అయింది. తనకి ఆసక్తి ఉండి చేసింది. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మంచి పాత్ర చేస్తోంది కూడా. ► మన ఇంట్లో ఉన్న సమస్యను మన ఇంట్లో కూర్చునే పరిష్కరించుకోవాలి. బయటకు వచ్చి గొడవలు పడితే ఎవరికి నష్టం? చూసేవాళ్లకు గొడవలు బాగా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ వాళ్లు వాళ్ల సమస్యను అసోసియేషన్ లోపలే పరిష్కరించుకోవాలి. సమస్యలు వస్తాయి. హుందాగా ఎదుర్కోవాలి. బయటపడిపోకూడదు. ఒకవేళ నాకు అవకాశం ఇస్తే ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. -
ఆ టైటిల్ ఎందుకంటే?
తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు.. పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘బేవర్స్’. రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో, సంజోష్, హర్షిత హీరోహీరోయిన్లుగా రమేష్ చెప్పాల దర్శకత్వంలో కాసం సమర్పణలో పొన్నాల చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్. అరవింద్ నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి ‘బేవర్స్’ టైటిల్ ఏంటి? అని మొదట్లో అనిపించింది. ఇదే అనుమానం ప్రేక్షకులకి కూడా వస్తుంది. కానీ, ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్లో మరో సూపర్ హిట్ సినిమా చేశాననే తృప్తి ఉంది’’ అన్నారు. ‘‘మీ శ్రేయోభిలాషి’ చిత్రానికి రచయితగా ఎంత తృప్తి చెందానో ‘బేవర్స్’ చిత్రం తెరకెక్కిస్తున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతృప్తి పొందాను. రాజేంద్రప్రసాద్‌గారు ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చేయకపోవడం నా అదృష్టం’’ అన్నారు రమేష్ చెప్పాల. ‘‘ఎక్కడా రాజీ పడకుండా ‘బేవర్స్’ నిర్మించాం. సునీల్ కశ్యప్ మంచి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటకి చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు నిర్మాతలు. హీరో సంజోష్ పాల్గొన్నారు. -
లక్ష్యం వైపే గురి
పశ్చిమగోదావరి, భీమవరం: అతనో చిరువ్యాపారి. చిన్నతనం నుంచీ రైఫిల్ షూటింగ్ అంటే మహా ఇష్టం. తుపాకీతో లక్ష్యాన్ని గురి పెట్టాలని ఆశ.. అయితే అతని ఆశ నెరవేరలేదు. దాంతో తన కోరికకు కుమార్తె ద్వారా నెరవేర్చుకోవాలని సంకల్పించారు. తండ్రి ఆశయానికి తగ్గట్టుగానే 14 ఏళ్ల వయస్సులోనే రాష్ట్ర స్థాయి పోటీల్లో రజత పతకం సాధించడమేగాక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై తండ్రిని అబ్బుర పర్చింది ఆచిన్నారి. రెండేళ్ల నుంచి శిక్షణ భీమవరం పట్టణానికి చెందిన ముదుండి సత్యనారాయణరాజు పట్టణంలోని జువ్వలపాలెం రోడ్డులో హర్షిత ఫుడ్స్‌ను నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె హర్షిత స్థానిక శ్రీచైతన్య టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. హర్షితకు ఆర్చరీపై మక్కువ ఏర్పడింది. ఆర్చరీలో శిక్షణ పొందాలని పట్టణానికి చెందిన కోచ్ కుంటముక్కల గోపాలగాంధీ కృష్ణారావు వద్దకు వెళ్లగా ఆమె ఫిజికల్ ఫిట్నెస్ బట్టి రైఫిల్ షూటింగ్లో రాణించగలుగుతుందని సూచించడంతో హర్షితకు రెండేళ్ల నుంచి రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. జాతీయ స్థాయిలో 23వ స్థానం మంచి క్రమశిక్షణ, పట్టుదల కలిగిన హర్షిత రైఫిల్ షూటింగ్లో మంచి ప్రతిభ కనబర్చడంతో ఈ ఏడాది ఆగస్టు 14న హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విధంగా తర్ఫీదు ఇచ్చారు. ఈ పోటీల్లో హర్షిత రజత పతకం సాధించింది. దీంతో హర్షితకు మరిన్ని పతకాలు సాధించాలనే పట్టుదల పెరిగి శిక్షణలో మరింతగా దృషి ్టపెట్టింది. ఒక పక్క చదువుపై శ్రద్ధ చూపిస్తూనే రైఫిల్ షూటింగ్ శిక్షణకు ఎక్కువ సమయం కేటాయించింది. ఆగస్టు 30 నుంచి 9 రోజుల పాటు తమిళనాడులో నిర్వహించిన ఫ్రీ నేషనల్స్ స్మాల్ బోర్ రైఫిల్ షూటింగ్ పోటీల్లో హర్షిత జాతీయ స్థాయిలో 23వ స్థానంలో నిలిచి తండ్రి కలలను సాకారం చేసింది. అండర్–14 విభాగంలో రాష్ట్ర స్థాయిలో హర్షిత ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. దీంతో నవంబర్‌లో ఢిల్లీలో నిర్వహించనున్న నేషనల్ స్మాల్ బోర్ రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపికైందని కోచ్ కృష్ణారావు తెలిపారు. -
సామ్రాట్ రెడ్డికి కండిషనల్ బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు సామ్రాట్‌రెడ్డికి కండిషనల్ బెయిల్ మంజూరైంది. భార్య హర్షితారెడ్డి మోపిన దొంగతనం కేసులో అరెస్ట్ అయిన సామ్రాట్‌రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయంపై బుధవారం మియాపూర్‌లోని 25వ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వరూధిని కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తులు రూ.25 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ప్రతి శనివారం సామ్రాట్‌రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో హజరు కావాలని ఆదేశించారు. -
సామ్రాట్ సైకోలా ప్రవర్తించేవాడు : హర్షితా రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : చీటికిమాటికి చిరాకు పడుతూ, చేతికిదొరికిన వస్తువులతో కొడుతూ, నోటికొచ్చినట్లు తిడుతూ సామ్రాట్ టార్చర్ పెట్టేవాడని భార్య హర్షితా రెడ్డి చెప్పారు. ఇకనైనా మరతాడని ఎంతోకాలం ఓపికపట్టానని, బాధ భరింలేని స్థితిలో బయటికి వచ్చానని అన్నారు. తన భర్త, టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డిపై కేసులు పెట్టిన హర్షిత.. మంగళవారం మాదాపూర్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘రెండేళ్లు నరకం అనుభవించా :సామ్రాట్‌తో నా వివాహం జరిగి రెండేళ్లైంది. పెళ్లైన కొద్ది రోజుల నుంచే అదనపు కట్నం గురించి గొడవలు మొదలుపెట్టారు. అస్తమానం డబ్బులు, నగలు కావాలని అడిగేవాళ్లు. సామ్రాట్ నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నా వాళ్లమ్మ అడ్డు చెప్పకపోయేది. ఫ్యామిలీమెంబర్స్ ముందే నన్ను ఎన్నోసార్లు కొట్టేవాడు. చేతికి ఏది దొరికితే దాన్ని విసిరేసేవాడు. కుర్చీలు, సోఫాలను ఎత్తిపడేసేవాడు. ఇంత జరుగుతున్నా అతనిది తప్పని చెప్పేవాళ్లేలేరు. నా పేరుమీదున్న ఆస్తుల్ని అతనికి రాసివ్వకుంటే బ్రేకప్ అవుతానని బెదిరించేవాడు. సామ్రాట్ కుటుంబం ఒక దశలో నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారు. పరిస్థితి దారుణంగా మారడంతో మా ఇంట్లోవాళ్లకు చెప్పాను. అలా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో వాళ్లపై కేసు పెట్టాం. కౌన్సిలింగ్ తర్వాత.. నన్ను మాదాపూర్‌లోని వేరే ఇంట్లో ఉంచాడు. ఎప్పుడోగానీ ఇంటికి వచ్చేవాడుకాదు, వచ్చినా తిట్టి,కొట్టి వెళ్లేవాడు.. డ్రగ్స్, హుక్కా అతని రెగ్యులర్ హ్యాబిట్స్ : అందరిముందు మంచివాడిలా నటించే సామ్రాట్.. నాతో మాత్రం అంత సైకిక్‌గా ఎలా బిహేవ్ చేసేవాడో మొదట్లో అర్థంకాలేదు. తర్వాత తెలిసిందేమంటే.. అతనికి లేని చెడు అలవాటులేదు. రెగ్యులర్‌గా హుక్కా సెంటర్లకు వెళతాడు. నాకు ఇష్టంలేదని చెప్పినా బలవంతంగా ఓ హుక్కా సెంటర్‌కు తీసుకెళ్లాడు. ఆ వాసనకు ఊపిరాడక నేను బయటికొచ్చేశాను. సామ్రాట్‌కు డ్రగ్స్ కూడా అలవాటుంది. పెద్ద వుమనైజర్. నా పక్కన కూర్చొనే వేరే అమ్మాయిలను ఫ్లర్ట్ చేసేవాడు. మొత్తంగా ఆయన స్వేచ్ఛకు నేను అడ్డుగా ఉన్నాను కాబట్టి, అగిడినట్లు ఆస్తులు రాసివ్వలేదు కాబట్టి నన్ను చంపడం లేదా వదిలించుకోవాలని అతను భావించాడు. ఆధారాలు లేకుండా చేద్దామనుకున్నాడు : నా సేఫ్టీ కోసమని ఇప్పుడుంటున్న ఇంటి బయట మా వాళ్లు సీసీటీవీ కెమెరాలు పెట్టించారు. సామ్రాట్ ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు వెళ్లేది అంతా రికార్డయింది. నన్ను వదిలించుకోవాలని పూర్తిగా నిర్ణయించుకున్నాడు కాబట్టే.. నా ఇంట్లో అతనికి సంబంధించిన ఆధారాలను చెరిపేద్దామనుకున్నాడు. నేను ఇంట్లో లేనప్పుడు వాళ్ల అక్కతో కలిసి వచ్చి.. సీసీటీవీ రికార్డులను, అతని వస్తువులను తీసుకొని వెళ్లిపోయాడు. పెళ్లన్నా, భార్యన్నా ఏమాత్రం బాధ్యతలేని వ్యక్తి నుంచి నన్ను కాపాడేది ఎవరు, అందుకే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించా’’ అని హర్షితా రెడ్డి చెప్పారు. మనం ఏ జనరేషన్లో ఉన్నాం? : మీడియాతో మాట్లాడుతూ హర్షితా రెడ్డి పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు. ‘పిల్లలు ఇలా ఎందుకు తయారవుతున్నారో తల్లిదండ్రులు పట్టించుకోరా? ఎల్లకాలం భరించడానికి నేను బొమ్మనా? మగపిల్లల్ని ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చెయ్యడం పేరెంట్స్ బాధ్యత కాదా? అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో దయచేసి మగపిల్లలకు పిల్లలకు నేర్పించండి.. ఒకవేళ వాళ్లు మాట వినకుంటే దండించండి. మనం ఏ జనరేషన్లో ఉన్నామో కాస్త ఆలోచించండి..’ అంటూ హర్షితా కన్నీటిపర్యంతమయ్యారు. సామ్రాట్ గే! : హీరో సామ్రాట్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు హర్షిత తండ్రి మధుసూదన్. ‘‘పెళ్లికి ముందు మాకు చాలా అబద్ధాలు చెప్పారు. సినిమాలు మానేశాడని, బిజినెస్ చేస్తున్నాడని, త్వరలో ఓ హోటల్ కూడా కట్టాలనుకుంటున్నాడని మధ్యవర్తి చెప్పాడు. తర్వాత తెలిసిందేమంటే సామ్రాట్ గే అని! నా కూతురిని ఏనాడూ సంతోషపర్చలేదు. ఆస్తుల్ని తన పేరున రాయలని కొట్టేవాడు. చాలా కాలంపాటు ఈ విషయాలేవీ మా అమ్మాయి చెప్పలేదు. చివరికి ఒకసారి తలదిండుతో హర్షితను చంపాలని చూశారు. సడన్‌గా పనిమనిషి రావడంతో నా కూతురు ఆ గండం నుంచి బయటపడింది’’ అని మధుసూదన్ తెలిపారు. -
మంచి కథ.. హిట్ గ్యారంటీ – రాజేంద్రప్రసాద్
‘‘తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు.. పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్సే అనే కథాంశంతో దర్శకుడు రమేశ్ ‘బేవర్స్’ సినిమాని చక్కగా తెరకెక్కించాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రమిది. నా కెరీర్లో ఎక్కువ పారలల్ సినిమాలు చేశా. మళ్లీ ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా వస్తోంది. ఈ సినిమా నా కెరీర్లో మరో మంచి చిత్రంగా నిలుస్తుంది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. సంజోష్, హర్షిత జంటగా రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రలో రమేష్ చెప్పాల దర్శకత్వంలో పొన్నాల చందు, ఎమ్.అరవింద్ నిర్మించిన ‘బేవర్స్’ టీజర్ రిలీజ్ చేశారు. రమేష్ చెప్పాల మాట్లాడుతూ– ‘‘మీ శ్రేయోభిలాషి’ చిత్రానికి రచయితగా ఎంత తృప్తి చెందానో ‘బేవర్స్’ సినిమా రూపొందిస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువ సంతృప్తి చెందా. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ గారు చేసిన పాత్ర ఇప్పటివరకూ ఆయన వేరే సినిమాల్లో చేయకపోవడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. -
చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
-
చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
హైదరాబాద్: నగరంలోని నల్లకుంట పరిధి అడిక్‌మెట్ లో కిడ్పాప్ కు గురైన చిన్నారి కథ సఖాంతమైంది. హర్షిత(5) అనే చిన్నారిని ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఉన్న ఓ మహిళ చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి సోమవారం ఉదయం అపహరించుకు వెళ్లింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉండే సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా చెవి దిద్దులు తీసుకుని చిన్నారిని అంబర్ పేటలో వదిలి నిందితురాలు పరారైంది. పాపను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. నిందితురాలి కోసం గాలింపు చేపట్టారు. -
నగరంలో ఐదేళ్ల చిన్నారి కిడ్నాప్
-
800 మీ. పరుగులో హర్షితకు స్వర్ణం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ మీట్లో తొలి రోజు మహిళల 800 మీటర్ల పరుగు పందెంలో లయోలా అకాడమీకి చెందిన అథ్లెట్ సిహెచ్.హర్షిత 2:39.8 సెకన్లలో గమ్యం చేరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఎస్.కె.షబ్నమ్ (విల్లా మేరీ కాలేజి, 2:41.9 సె.) రజత పతకాన్ని గెల్చుకోగా, బి.ఎస్.భావన (కస్తూర్బా గాంధీ కాలేజి) కాంస్యం గెలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల తొలి రోజు ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. మహిళల విభాగం: 200మీ :1.కె.అర్చన కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.బి.సాహితి (వెస్లీ కాలేజి),3. పి.సర్జిత (జీసీపీఈ). 5000మీ: 1.డి.వైష్ణవి 22:08.2సె (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. అఫ్రీన్ బేగం (విల్లా మేరీ కాలేజి), 3. జి.లలిత (జీసీపీఈ). లాంగ్ జంప్: 1.కె.అర్చన కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.శ్రీలత (కస్తూర్బా గాంధీ కాలేజి), 3.జి.లలిత (జీసీపీఈ). హైజంప్: 1.సునైన (సెయింట్ ఆన్స్ కాలేజి), 2.వందన (లయోలా అకాడమీ), 3.కె.మంజుల (జీసీపీఈ). షాట్‌పుట్: 1.పి.రమ్య (భవాన్స్ కాలేజి), 2. కె.నాగ అనూష (సెయింట్ పాయిస్ కాలేజి), 3.మోనిక (జీసీపీఈ). డిస్కస్‌త్రో: 1.పి.రమ్య (భవాన్స్ కాలేజి), 2.షాహీనా(జీసీపీఈ), 3.కోమల (కస్తూర్బా గాంధీ కాలేజి). 400మీ. హర్డిల్స్: 1.కె.హేమలత(కస్తూర్బా గాంధీ కాలేజి), 2.దుర్గమ్మ (జీసీపీఈ), 3. కె.మంజుల (జీసీపీఈ). 4ఁ400 మీ.రిలే: 1.కస్తూర్బా గాంధీ కాలేజి, 2.విల్లా మేరీ కాలేజి, 3.గవర్నమెంట్ కాలేజి ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (జీసీపీఈ). పురుషుల విభాగం: 200మీ: 1.ఎం.రత్న కుమార్ (భవాన్స్ కాలేజి), 2.ఎం.తేజ వర్ధన్(అరుణోదయ కాలేజి), 3.ఎం.జెమ్య. 800మీ: 1.ఎ.లక్ష్మీ రామ్ (అరుణోదయ కాలేజి), 2.కె.రాములు (వి.వి.కాలేజి), 3. టి.రవికుమార్ (నిజాం కాలేజి). 5000మీ: 1.ఎన్.సాయి కిరణ్ (నిజాం కాలేజి), 2.సయ్యద్ అహ్మద్ ఉజ్మా (అవంతి కాలేజి). లాంగ్ జంప్: 1.ఎ.నవీన్(జీసీపీఈ), 2.ఎం.అనిల్ (యూసీఎస్ సైఫాబాద్), 3. ఈశ్వర్ రెడ్డి (అవంతి కాలేజి). హైజంప్: 1.ఎం.ప్రకాష్ (నిజాం కాలేజి), 2.ఎం.సైదా బాబు (యూసీఎస్ సైఫాబాద్), 3.గోవర్ధన్‌రావు (జీసీపీఈ). షాట్‌పుట్: 1.కె.రామకృష్ణ(జీసీపీఈ), 2.అంకిత్ కుమార్ (నిజాం కాలేజి), 3.సన్నీ(వెస్లీ కాలేజి). 400మీ.హర్డిల్స్: 1.డి.ఎస్.రాహుల్ (భవాన్స్ కాలేజి), 2. ప్రవీణ్ మూర్తి (ఎ.వి.కాలేజి), 3.మధు (సింధు కాలేజి). 4ఁ400 మీ.రిలే: 1.అవంతి కాలేజి, 2. రైల్వే కాలేజి, 3.భవాన్స్ కాలేజి.