
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు సామ్రాట్‌రెడ్డికి కండిషనల్ బెయిల్ మంజూరైంది. భార్య హర్షితారెడ్డి మోపిన దొంగతనం కేసులో అరెస్ట్ అయిన సామ్రాట్‌రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయంపై బుధవారం మియాపూర్‌లోని 25వ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వరూధిని కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తులు రూ.25 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ప్రతి శనివారం సామ్రాట్‌రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో హజరు కావాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment