miyapur court
-
సామ్రాట్ రెడ్డికి కండిషనల్ బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు సామ్రాట్‌రెడ్డికి కండిషనల్ బెయిల్ మంజూరైంది. భార్య హర్షితారెడ్డి మోపిన దొంగతనం కేసులో అరెస్ట్ అయిన సామ్రాట్‌రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయంపై బుధవారం మియాపూర్‌లోని 25వ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి వరూధిని కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు వ్యక్తులు రూ.25 వేల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ప్రతి శనివారం సామ్రాట్‌రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో హజరు కావాలని ఆదేశించారు. -
తాళం పగులగొట్టి లోపలికి వెళ్లిన సంగీత
-
కోర్టు ఆదేశాలున్నాయ్.. ఇంట్లోకి వెళ్తా
సాక్షి, హైదరాబాద్ : అత్తమామలు, భర్త తనను వేధిస్తున్నారంటూ 54 రోజులుగా సంగీత దీక్ష చేసిన ఇంటి వద్ద గురువారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లేందుకు సంగీత ప్రయత్నించారు. శ్రీనివాసరెడ్డి, సంగీతల కేసును విచారించిన మియాపూర్ ఫ్యామిలీ కోర్టు ఆమెను ఇంట్లోనే ఉండనివ్వాలని, నెలకు రూ. 20 వేలు భరణంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. దీంతో కోర్టు నుంచి బోడుప్పల్‌లోని ఇంటి వద్దకు చేరుకున్న సంగీత తలుపు తాళం పగులగొట్టారు. అనంతరం కూతురుతో తలుపు గడి తీయించి, ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. పాప భవిష్యత్ ముఖ్యం ఇంటి తాళం పగులగొడుతున్న సంగీతకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. కోర్టు తీర్పుతో సంగీతకు కొంత బలం చేకూరిందని చెప్పాయి. కోర్టు తీర్పుతో కాకుండా సంగీత అత్తమామలు వచ్చి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్తే బావుండేదని అభిప్రాయపడ్డాయి. పాప భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని శ్రీనివాస రెడ్డి, సంగీతతో రాజీకి రావాలని కోరాయి. సంతోషంగా చూసుకుంటే తీసేస్తాను.. కోర్టు తీర్పు నేపథ్యంలోపై సంగీత ‘సాక్షి’తో మాట్లాడారు. 54 రోజులుగా ఇంటి బయటే దీక్ష చేశానని చెప్పారు. అత్తింటివాళ్లు వస్తారని ఎదురుచూశానని తెలిపారు. శ్రీనివాస రెడ్డి వస్తే కలసి జీవించడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. శ్రీనివాస రెడ్డికి వివాహేతర సంబధాలు ఉండటం వల్లే ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయని చెప్పారు. హ్యాపీ ఉంటున్నామని అనుకున్న రోజే కేసును ఉపసంహరించుకుంటానని వెల్లడించారు. పెళ్లి అయిన నాటి నుంచి తాను ఈ ఇంట్లోనే నివాసం ఉంటున్నానని చెప్పారు. అందుకే కోర్టు తీర్పు అనంతరం తాళం పగులగొట్టి లోపలికి వెళ్తున్నానని తెలిపారు. చాలా నష్టం జరిగింది : శ్రీనివాస రెడ్డి కోర్టు తీర్పు వల్ల తమకు చాలా నష్టం జరిగిందని బహిష్కృత టీఆర్ఎస్ నేత, సంగీత భర్త శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం పిటిషన్ దాఖలు చేయగా.. గురువారమే ఉత్తర్వులు రావడం బాధకరమని చెప్పారు. తాను సంగీతతో కలసివుండాలంటే కేసును ఉపసంహరించుకోవాల్సిందేనని తెలిపారు. సంగీత డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో.. బోడుప్పల్‌లోని ఇల్లు తన తల్లిదండ్రులదని చెప్పారు. ఆ ఇంటితో తనకు సంబంధం లేదన్నారు. సంగీతకు నిజంగా నాతో జీవించాలని ఉంటే తానెక్కడ ఉంటే ఆమె అక్కడే ఉండాలన్నారు. అందుకు ఇష్టపడితే తాను ఎక్కడ ఉంటున్నానో ఆమెకు చెబుతానన్నారు. -
సంగీతకు ఊరట.. భర్త శ్రీనివాస్‌రెడ్డికి మొట్టికాయలు
-
కోర్టు తీర్పుతో సంగీతకు ఊరట
-
సంగీతకు ఊరట.. భర్త శ్రీనివాస్‌రెడ్డికి మొట్టికాయలు
సాక్షి, హైదరాబాద్ : ఆమరణ దీక్ష వైపుగా ముందుకెళుతున్న సంగీతను తొలి విజయం వరించింది. మియాపూర్ ఫ్యామిలీ కోర్టు సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డికి మొట్టికాయలు వేసింది. ఆమెను గౌరవ ప్రదంగా ఇంటికి తీసుకెళ్లాలని చెప్పింది. అదే సమయంలో ప్రతి నెల మెయింటెన్స్‌కు రూ.20వేలు చెల్లించాలని ఆదేశించింది. బోడుప్పల్‌కు చెందిన సంగీత తన భర్త శ్రీనివాసరెడ్డి వేధింపులపై గత 54 రోజులుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం ఈ కేసు విచారణలో భాగంగా మియాపూర్ ఫ్యామిలీ కోర్టు సంగీతకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. సంగీతకు మెయింటెనెన్స్ ఖర్చులు నెలకు రూ.20 వేలు చెల్లించాలని, అలాగే, ఆమెను గౌరవ ప్రదంగా ఇంట్లోకి భర్త తీసుకెళ్లాలని ఆదేశించింది. అయితే, దీనిపై భర్త శ్రీనివాస్‌రెడ్డి మరోసారి కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. భార్యను బాగానే చూసుకుంటానని, ఆమె తన వద్దే ఉంటుందని అలాంటప్పుడు మెయింటెన్స్ ఖర్చులు ఎందుకు ఇవ్వడం అని ఆ కౌంటర్లో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. భర్త, అత్తమామలు కొడుతూ, లైంగికంగా వేధిస్తున్నారంటూ సంగీత కేసు పెట్టిన విషయం తెలిసిందే. మొత్తం మూడు కేసులు ఆమె పెట్టారు. ఈ కేసుకు సంబంధించి భర్త, అత్తమామలు కోర్టుకు హాజరుకాగా సంగీత తరుపున ఆమె సోదరుడు కోర్టుకు హాజరయ్యాడు. సంగీత మాత్రం ఇంకా దీక్షలోనే ఉన్నారు. రోడ్డున పడ్డాం, రాజీకి రావా..? -
హెచ్‌సీయూ విద్యార్థుల విడుదల
చర్లపల్లి జైలు నుంచి ర్యాలీగా వర్సిటీకి సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ విద్యార్థులు మంగళవారం రాత్రి 9 గంటలకు బెయిలుపై విడుదలయ్యారు. వీరిలో ప్రొఫెసర్లు రత్నం, తథాగత్, ఏఎస్ఏ అధ్యక్షుడు ప్రశాంత్, జేఏసీ నాయకుడు వెంకటేశ్‌చౌహాన్, లింగస్వామి, అచ్యుతరావు, హరీష్‌లతో పాటు మొత్తం 25 మంది ఉన్నారు. మియాపూర్ కోర్టు న్యాయమూర్తి వరూధిని బెయిలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. వీరి విడుదల కోసం ఉదయం నుంచి జైలు బయట విద్యార్థులు, ప్రొఫెసర్ల నిరీక్షించారు. విడులైన అనంతరం జీవీవీ అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, రోహిత్ తల్లి రాధిక తదితరులతో కలసి ప్రదర్శనగా హెచ్సీయూకు వెళ్లారు. వారందరికీ హెచ్‌సీయూ వద్ద విద్యార్థులు కాగడాలు చేతపట్టి ఘనస్వాగతం పలికారు. ఏఎస్ఏ నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ... చెరసాలలు, ఉరికొయ్యలు తమ ఉద్యమాన్ని ఆపలేవన్నారు. ప్రొఫెసర్ రత్నం మాట్లాడుతూ... వీసీ అప్పారావును తొలగించేవరకు తమ పోరాటం ఆగదన్నారు. -
'అభయ' నిందితులకు 5వరకూ రిమాండ్
హైదరాబాద్ : 'అభయ' కేసు నిందితులను పోలీసులు బుధవారం మియాపూర్ లోని తొమ్మిదవ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అలాగే రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చారు. కాగా నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం పోలీసుల్ని ఆదేశించింది. ఢిల్లీ నిర్భయ కేసును తలపించేలా హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగినిపై ఇద్దరు కారు డ్రైవర్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సతీష్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా బాధితురాలికి సంబంధించిన వివరాలు పూర్తి గోప్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆమెకు పోలీసులు‘అభయ’ అనే పేరు పెట్టారు. మరోవైపు అభయ కేసు నిందితుల తరఫున ఎవరూ వాదించకూడదని రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. నిందితులు ఇద్దరూ కారు డ్రైవర్లే: పీయూష్ అనే వ్యక్తి ఈ కారును 24X7 ట్రాన్స్‌లైన్ ట్రావెల్స్‌కు అద్దెకిచ్చాడు. అలెగ్జాండర్ కన్స్ట్రక్షన్ కంపెనీలో సేల్స్‌మేనేజర్‌గా పనిచేస్తున్న సీపీ అగర్వాల్ దానిని వాడుతున్నారు. వరంగల్‌కు చెందిన వెడిచెర్ల సతీష్ (30) డ్రైవర్. ఈ కారు డ్రైవర్ సతీషే నిందితుడిగా రూఢీ చేసుకున్న పోలీసులు అతడికి అదుపులోకి తీసుకుని విచారించారు. తనతో పాటు కారులో ఉన్నది నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌కు చెందిన తన స్నేహితుడు, కారు డ్రైవర్ నెమ్మడి వెంకటేశ్వర్లు (28)గా సతీష్ వెల్లడించాడు. అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కారును సీజ్ చేశారు. వీరిద్దరూ కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండలో నివాసం ఉంటున్నారు. నిందితులపై ఐపీసీ 363, 364, 365, 366, (కిడ్నాప్) 376 (డి) (గ్యాంగ్‌రేప్) సెక్షన్లు, 2013 నిర్భయ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.