800 మీ. పరుగులో హర్షితకు స్వర్ణం | harshitha got gold award in 800m running race | Sakshi
Sakshi News home page

800 మీ. పరుగులో హర్షితకు స్వర్ణం

Published Tue, Nov 26 2013 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

800 మీ. పరుగులో హర్షితకు స్వర్ణం

800 మీ. పరుగులో హర్షితకు స్వర్ణం

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్:  ఓయూ ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ మీట్‌లో తొలి రోజు మహిళల 800 మీటర్ల పరుగు పందెంలో లయోలా అకాడమీకి చెందిన అథ్లెట్ సిహెచ్.హర్షిత 2:39.8 సెకన్లలో గమ్యం చేరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఎస్.కె.షబ్నమ్ (విల్లా మేరీ కాలేజి,  2:41.9 సె.) రజత పతకాన్ని గెల్చుకోగా, బి.ఎస్.భావన (కస్తూర్బా గాంధీ కాలేజి) కాంస్యం గెలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం ఈ పోటీలు జరిగాయి.  ఈ పోటీల తొలి రోజు ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
 మహిళల విభాగం: 200మీ :1.కె.అర్చన కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.బి.సాహితి (వెస్లీ కాలేజి),3.  పి.సర్జిత (జీసీపీఈ). 5000మీ: 1.డి.వైష్ణవి 22:08.2సె (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. అఫ్రీన్ బేగం (విల్లా మేరీ కాలేజి), 3. జి.లలిత (జీసీపీఈ). లాంగ్ జంప్: 1.కె.అర్చన కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.శ్రీలత (కస్తూర్బా గాంధీ కాలేజి), 3.జి.లలిత (జీసీపీఈ). హైజంప్: 1.సునైన (సెయింట్ ఆన్స్ కాలేజి), 2.వందన (లయోలా అకాడమీ), 3.కె.మంజుల (జీసీపీఈ).  షాట్‌పుట్: 1.పి.రమ్య (భవాన్స్ కాలేజి), 2. కె.నాగ అనూష (సెయింట్ పాయిస్ కాలేజి), 3.మోనిక (జీసీపీఈ). డిస్కస్‌త్రో: 1.పి.రమ్య (భవాన్స్ కాలేజి), 2.షాహీనా(జీసీపీఈ), 3.కోమల (కస్తూర్బా గాంధీ కాలేజి). 400మీ. హర్డిల్స్: 1.కె.హేమలత(కస్తూర్బా గాంధీ కాలేజి), 2.దుర్గమ్మ (జీసీపీఈ), 3. కె.మంజుల (జీసీపీఈ). 4ఁ400 మీ.రిలే: 1.కస్తూర్బా గాంధీ కాలేజి, 2.విల్లా మేరీ కాలేజి, 3.గవర్నమెంట్ కాలేజి ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (జీసీపీఈ).
 పురుషుల విభాగం: 200మీ: 1.ఎం.రత్న కుమార్ (భవాన్స్ కాలేజి), 2.ఎం.తేజ వర్ధన్(అరుణోదయ కాలేజి), 3.ఎం.జెమ్య. 800మీ: 1.ఎ.లక్ష్మీ రామ్ (అరుణోదయ కాలేజి), 2.కె.రాములు (వి.వి.కాలేజి), 3. టి.రవికుమార్ (నిజాం కాలేజి). 5000మీ: 1.ఎన్.సాయి కిరణ్ (నిజాం కాలేజి), 2.సయ్యద్ అహ్మద్ ఉజ్మా (అవంతి కాలేజి). లాంగ్ జంప్: 1.ఎ.నవీన్(జీసీపీఈ), 2.ఎం.అనిల్ (యూసీఎస్ సైఫాబాద్), 3. ఈశ్వర్ రెడ్డి (అవంతి కాలేజి). హైజంప్: 1.ఎం.ప్రకాష్ (నిజాం కాలేజి), 2.ఎం.సైదా బాబు (యూసీఎస్ సైఫాబాద్), 3.గోవర్ధన్‌రావు (జీసీపీఈ). షాట్‌పుట్: 1.కె.రామకృష్ణ(జీసీపీఈ), 2.అంకిత్ కుమార్ (నిజాం కాలేజి), 3.సన్నీ(వెస్లీ కాలేజి). 400మీ.హర్డిల్స్: 1.డి.ఎస్.రాహుల్ (భవాన్స్ కాలేజి), 2. ప్రవీణ్ మూర్తి (ఎ.వి.కాలేజి), 3.మధు (సింధు కాలేజి). 4ఁ400 మీ.రిలే: 1.అవంతి కాలేజి, 2. రైల్వే కాలేజి, 3.భవాన్స్ కాలేజి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement