Gold Award
-
ఏపీ సర్కార్‌కు అరుదైన అవార్డు.. అధికారులకు సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: ఏపీ ప్రభుత్వానికి అరుదైన అవార్డు లభించింది. ప్రతిష్టాత్మక గోల్డ్ అవార్డును స్కోచ్ సంస్థ ప్రదానం చేసింది. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు అందించడం, ఆ రుణాలను సద్వినియోగం చేసుకోవటం.. సకాలంలో తిరిగి చెల్లించడంలో అత్యుత్తమ ఫలితాలను సాధించడంలో ఏపీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఈ సహాయ సహకారాలకు గాను ఏపీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక స్కోచ్ సంస్ధ గోల్డ్ అవార్డు వరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పొదుపు సంఘాల మహిళలకు సులభ విధానంలో రుణాలు అందేలా స్త్రీ నిధి సంస్థ కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అవార్డులను అధికారులు చూపించారు. ఈ సందర్భంగా అధికారులను సీఎం ప్రశంసించారు. చదవండి: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
రాష్ట్రానికి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సుపరిపాలన – పారదర్శక పౌర సేవలు అందిస్తున్నందుకు, గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలకు ఈ ఏడాది రాష్ట్రానికి మొత్తం ఆరు స్కోచ్ అవార్డులు దక్కాయి. సోమవారం ఢిల్లీలో స్కోచ్ గ్రూప్ నిర్వహించిన జాతీయస్థాయి సదస్సులో రాష్ట్ర అధికారులు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు ఇప్పిస్తోంది. అంతేకాకఆయా కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగానూ చర్యలు చేపట్టింది. తద్వారా మహిళలు ఆర్థికంగా తమ కాళ్ల మీద నిలబడుతున్నారు. బ్యాంకులకు సకాలంలో రుణాలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖకు 5 స్కోచ్ అవార్డులు దక్కడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శక పౌర సేవలు.. దేశంలోనే ఆదర్శవంతంగా సుపరిపాలన – పారదర్శక పౌర సేవలు అందిస్తున్నందుకు రాష్ట్రానికి స్కోచ్ అవార్డు లభించింది. గుడ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కేటగిరీలో 2021–22కి ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలో స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచర్ చేతుల మీదుగా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ అవార్డును అందుకున్నారు. బ్యాంకు లింకేజీకి గోల్డ్ అవార్డు.. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకొని కుటుంబ ఆదాయాలను పెంచుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందుకు గాను స్కోచ్ సంస్థ రాష్ట్రాన్ని గోల్డ్ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అహ్మద్, డీజీఎం కేశవ కుమార్ అవార్డును అందుకున్నారు. స్త్రీనిధి కార్యక్రమాలకు మరో గోల్డ్ అవార్డు.. సెర్ప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్త్రీనిధి సంస్థ బ్యాంకులతోపాటు పొదుపు సంఘాల మహిళలకు అదనంగా, అత్యంత సులభ విధానంలో 48 గంటల్లోనే బ్యాంకు రుణాలను అందిస్తోంది. ఇందుకుగాను స్కోచ్ మరో గోల్డ్ అవార్డును ప్రకటించింది. స్త్రీనిధి ఎండీ కె.వి.నాంచారయ్య, డిప్యూటీ జీఎం సిద్ధి శ్రీనివాస్ ఈ అవార్డును అందుకున్నారు. జిల్లాలకు మూడు సిల్వర్ అవార్డులు.. పొదుపు సంఘాల విజయగాథలను ‘మహిళా నవోదయం’ పేరుతో ప్రతి నెలా ప్రత్యేక మాస పత్రిక రూపంలో ప్రచురించడంపై చిత్తూరు జిల్లా డీఆర్డీఏ విభాగానికి ప్రత్యేక సిల్వర్ అవార్డు దక్కింది. అలాగే నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నందుకు చిత్తూరు డీఆర్డీఏకు మరో సిల్వర్ అవార్డు దక్కింది. అదేవిధంగా పొదుపు సంఘాల నుంచి తీసుకున్న రుణాలతో మహిళలు పెద్ద ఎత్తున నాటుకోళ్ల పెంపకం ద్వారా అధిక ఆదాయం పొందుతున్నారు. దీనికి నెల్లూరు జిల్లా డీఆర్డీఏ విభాగానికి ప్రకటించిన సిల్వర్ అవార్డు లభించింది. -
‘శంషాబాద్’కు ఇంధన పొదుపు అవార్డు
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు గోల్డ్ అవార్డును గెలుచుకుంది. ప్రభుత్వం నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా నగరంలో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జీఎంఆర్ ప్రతినిధులకు అవార్డును అందజేసినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఇంధన, జల వనరులను సద్వినియోగం చేసుకోవడంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ముందు వరుసలో ఉందని ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఇప్పటికే అనేక అవార్డులను సొంతం చేసుకుందన్నారు. -
సాంకేతిక పద్ధతులతోనే గుర్తింపు
ఎన్టీటీపీఎస్ సీఈ ప్రభాకరరావు ఇబ్రహీంపట్నం: నూతన సాంకేతిక పద్ధతులు అవలంభించటం వల్లే జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ రావి ప్రభాకరరావు అన్నారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్‌కు జాతీయస్థాయిలో ఉత్తమ సేఫ్టీ మేనేజ్మెంట్ గ్రీన్‌టెక్ (గోల్డ్) అవార్డు లభించింది. జీరోస్థాయి ప్రమాద రేటును సాధించినందుకు ఢిల్లీకి చెందిన గ్రీన్‌టెక్ ఫౌండేషన్ వారు ఆగస్టు 29న గోవాలో నిర్వహించిన సమావేశంలో ఈ అవార్డును సీఈ అందజేశారు. గురువారం ఎన్టీటీపీఎస్లో అభినందనసభ నిర్వహించారు. సీఈ మాట్లాడుతూ ఉద్యోగుల నిరంతర కృషి వలనే ఈ అవార్డు దక్కిందని పేర్కొన్నారు. మూడేళ్లుగా సంస్థలో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా విధులు నిర్వహించటం సంస్థకు గర్వకారణమన్నారు. కార్మిక సంఘాలు కూడా భద్రత విషయంలో శ్రద్ధ చూపాయని కొనియాడారు. సంస్థ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, యూనియన్, అసోసియేషన్ నాయకులు, కార్మికులను సత్కరించారు. సీఈ ప్రభాకరరావును సన్మానించారు. కార్యక్రమంలో ఏపీజెన్కో శిక్షణా కేంద్రం సీఈ పద్మసుజాత, పర్యవేక్షక ఇంజినీర్లు మురళీకృష్ణ, నవీన్గౌతం, రమేష్‌బాబు, జవహర్, శ్రీరాములు, శేఖర్, గౌరీపతి, సాంబశివరావు, కర్మాగారాల మేనేజర్ కాండ్రు మైసూర్‌బాబు, డిప్యూటీ కార్యదర్శి భాస్కరరావు, ఏడీఈ శ్రీనివాసరావు, భద్రతాధికారి నాగబాబు, అప్పారావు, కార్మికులు పాల్గొన్నారు. -
800 మీ. పరుగులో హర్షితకు స్వర్ణం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ మీట్లో తొలి రోజు మహిళల 800 మీటర్ల పరుగు పందెంలో లయోలా అకాడమీకి చెందిన అథ్లెట్ సిహెచ్.హర్షిత 2:39.8 సెకన్లలో గమ్యం చేరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఎస్.కె.షబ్నమ్ (విల్లా మేరీ కాలేజి, 2:41.9 సె.) రజత పతకాన్ని గెల్చుకోగా, బి.ఎస్.భావన (కస్తూర్బా గాంధీ కాలేజి) కాంస్యం గెలిచింది. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల తొలి రోజు ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. మహిళల విభాగం: 200మీ :1.కె.అర్చన కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.బి.సాహితి (వెస్లీ కాలేజి),3. పి.సర్జిత (జీసీపీఈ). 5000మీ: 1.డి.వైష్ణవి 22:08.2సె (కస్తూర్బా గాంధీ కాలేజి), 2. అఫ్రీన్ బేగం (విల్లా మేరీ కాలేజి), 3. జి.లలిత (జీసీపీఈ). లాంగ్ జంప్: 1.కె.అర్చన కుమారి (కస్తూర్బా గాంధీ కాలేజి), 2.శ్రీలత (కస్తూర్బా గాంధీ కాలేజి), 3.జి.లలిత (జీసీపీఈ). హైజంప్: 1.సునైన (సెయింట్ ఆన్స్ కాలేజి), 2.వందన (లయోలా అకాడమీ), 3.కె.మంజుల (జీసీపీఈ). షాట్‌పుట్: 1.పి.రమ్య (భవాన్స్ కాలేజి), 2. కె.నాగ అనూష (సెయింట్ పాయిస్ కాలేజి), 3.మోనిక (జీసీపీఈ). డిస్కస్‌త్రో: 1.పి.రమ్య (భవాన్స్ కాలేజి), 2.షాహీనా(జీసీపీఈ), 3.కోమల (కస్తూర్బా గాంధీ కాలేజి). 400మీ. హర్డిల్స్: 1.కె.హేమలత(కస్తూర్బా గాంధీ కాలేజి), 2.దుర్గమ్మ (జీసీపీఈ), 3. కె.మంజుల (జీసీపీఈ). 4ఁ400 మీ.రిలే: 1.కస్తూర్బా గాంధీ కాలేజి, 2.విల్లా మేరీ కాలేజి, 3.గవర్నమెంట్ కాలేజి ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (జీసీపీఈ). పురుషుల విభాగం: 200మీ: 1.ఎం.రత్న కుమార్ (భవాన్స్ కాలేజి), 2.ఎం.తేజ వర్ధన్(అరుణోదయ కాలేజి), 3.ఎం.జెమ్య. 800మీ: 1.ఎ.లక్ష్మీ రామ్ (అరుణోదయ కాలేజి), 2.కె.రాములు (వి.వి.కాలేజి), 3. టి.రవికుమార్ (నిజాం కాలేజి). 5000మీ: 1.ఎన్.సాయి కిరణ్ (నిజాం కాలేజి), 2.సయ్యద్ అహ్మద్ ఉజ్మా (అవంతి కాలేజి). లాంగ్ జంప్: 1.ఎ.నవీన్(జీసీపీఈ), 2.ఎం.అనిల్ (యూసీఎస్ సైఫాబాద్), 3. ఈశ్వర్ రెడ్డి (అవంతి కాలేజి). హైజంప్: 1.ఎం.ప్రకాష్ (నిజాం కాలేజి), 2.ఎం.సైదా బాబు (యూసీఎస్ సైఫాబాద్), 3.గోవర్ధన్‌రావు (జీసీపీఈ). షాట్‌పుట్: 1.కె.రామకృష్ణ(జీసీపీఈ), 2.అంకిత్ కుమార్ (నిజాం కాలేజి), 3.సన్నీ(వెస్లీ కాలేజి). 400మీ.హర్డిల్స్: 1.డి.ఎస్.రాహుల్ (భవాన్స్ కాలేజి), 2. ప్రవీణ్ మూర్తి (ఎ.వి.కాలేజి), 3.మధు (సింధు కాలేజి). 4ఁ400 మీ.రిలే: 1.అవంతి కాలేజి, 2. రైల్వే కాలేజి, 3.భవాన్స్ కాలేజి. -
‘మెట్రో’కు గోల్డ్ అవార్డుపై సీఎం అభినందన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు భద్రత విషయంలో 2013 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘గోల్’్డ అవార్డు దక్కడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మెట్రో రైలు ఎండీ, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆ అవార్డును ముఖ్యమంత్రి, మునిసిపల్ శాఖ మంత్రి మహీధర్రెడ్డిలకు చూపించారు. లండన్‌లోని రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ (రోస్పా) సంస్థ ఈ నెల 19న లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ఎన్వీఎస్ రెడ్డికి ప్రదానం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న భారీ నిర్మాణ ప్రాజెక్టుల్లో ఉన్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నందునే మెట్రో ప్రాజెక్టుకు ఈ అవార్డు అందజేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ఉత్తమ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్-2013 అంతర్జాతీయ అవార్డు దక్కిన విషయం విదితమే.