‘మెట్రో’కు గోల్డ్ అవార్డుపై సీఎం అభినందన | 'Metro' to compliment the Gold Award in CM | Sakshi
Sakshi News home page

‘మెట్రో’కు గోల్డ్ అవార్డుపై సీఎం అభినందన

Published Thu, Sep 26 2013 2:45 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'Metro' to compliment the Gold Award in CM

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు భద్రత విషయంలో 2013 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘గోల్’్డ అవార్డు దక్కడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మెట్రో రైలు ఎండీ, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం సచివాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆ అవార్డును ముఖ్యమంత్రి, మునిసిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డిలకు చూపించారు.

లండన్‌లోని రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ (రోస్పా) సంస్థ ఈ నెల 19న లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ఎన్వీఎస్ రెడ్డికి ప్రదానం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న భారీ నిర్మాణ ప్రాజెక్టుల్లో ఉన్నత భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నందునే మెట్రో ప్రాజెక్టుకు ఈ అవార్డు అందజేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ఉత్తమ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఆఫ్ ది ఇయర్-2013 అంతర్జాతీయ అవార్డు దక్కిన విషయం విదితమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement