
జగిత్యాల: చిన్నతనంలోనే గుండెపోటు రావడంతో చిన్నారి ప్రాణాలు విడిచిన ఘటన తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన బొల్గం హర్షిత ఉరఫ్ జాను(8) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించింది. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తల్లి రమ్య మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది. తండ్రి సతీశ్‌గౌడ్ భార్య, కూతురి మరణంతో కన్నీరుమున్నీరయ్యా డు. జిల్లెల్ల గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment