
లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ఇండియన్ 2. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. సిద్ధార్థ్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ నటించనున్నారు. ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కొంత పూర్తవగా.. తరువాతి షెడ్యూల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్లాన్ చేశారు చిత్ర బృందం. దీనిలో భాగంగా కమల్‌తో సహా సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న నటీనటుల ఈ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ఈ నెల 19 నుంచి రాజమండ్రి జైల్లో రెగ్యులర్‌గా షూటింగ్ జరగనుందని కోలీవుడ్ టాక్. ఇక్కడ షూటింగ్ ముగిసిన అనంతరం తరువాతి షెడ్యూల్ కోసం విదేశాలకు పయనమయ్యే అవకాశం ఉంది. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళా సాధికారిత అంశాలపై ‘ఇండియన్ 2’ కథనం ఉంటుం దని టాక్. రత్నవేలు కెమెరామేన్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment