చాలాసార్లు పెళ్లి చేశారు | Ranveer Singh and Deepika Padukone make for a drop-dead gorgeous couple during a summit | Sakshi
Sakshi News home page

చాలాసార్లు పెళ్లి చేశారు

Published Sat, Oct 6 2018 1:29 AM | Last Updated on Sat, Oct 6 2018 1:29 AM

Ranveer Singh and Deepika Padukone make for a drop-dead gorgeous couple during a summit - Sakshi

దీపిక, కమల్, రణ్‌వీర్‌

బాలీవుడ్‌లో పెళ్లి టాపిక్‌ వస్తే... అందులో రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోన్‌ జంట తప్పకుండా ఉంటుంది. ఇటీవల ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న వీళ్ల వివాహం వాయిదా పడిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రణ్‌వీర్‌సింగ్‌ ముందు ప్రస్తావిస్తే...‘‘నా పెళ్లి గురించే నాకే తెలియనన్ని కథనాలు వస్తున్నాయి. నేను వేసుకోబోయే షేర్వాణీ ఆ కలర్‌ అని, ఎవరెవరో పెళ్లి బహుమతులు ఇవ్వబోతున్నారని కూడా వస్తున్నాయి. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతాను.

ఇప్పటికే నాకు, దీపికాకు చాలాసార్లు పెళ్లి చేసేశారు (నవ్వుతూ). అసలు నా పెళ్లి ఎప్పుడో అందరితో చెప్పే చేసుకుంటా’’ అని చెప్పుకొచ్చారు రణ్‌వీర్‌. ఇంకా మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపుల గురించి మహిళలు ధైర్యంగా బయటకు చెప్పాలి. మహిళలపై లైగింక వేధింపులు తప్పు’’ అన్నారు. ‘‘మీటూ’ ఉద్యమం లింగ వివక్షకు సంబంధించినది కాదు. తప్పొప్పులకు చెందినది’’ అన్నారు దీపికా పదుకోన్‌. ఇదంతా ఓ ప్రైవైట్‌ కార్యక్రమంలో భాగంగా జరిగింది.  అలాగే ఈ కార్యక్రమంలో కమల్‌హాసన్‌ పాల్గొన్నారు. కమల్‌హాసన్, రణ్‌వీర్, దీపికలు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు తమ అభిప్రాయాలను చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement