Wedding postponed
-
పెళ్లి గురించి చర్చించడం లేదు: మెహ్రీన్
కృష్ణగాడి వీరప్రేమగాథతో తెలుగు యువతరాన్ని కట్టిపడేసింది పంజాబీ హీరోయిన్ మెహ్రీన్ కౌర్. ఎఫ్ 2, మహానుభావుడు, కవచం వంటి పలు సినిమాలతో ఆకట్టుకున్న ఆమె హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లికి రెడీ అయింది. మార్చిలో వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. అన్నీ కలిసొస్తే ఈ ఏడాది సెకండాఫ్‌లో పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పారు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న మెహ్రీన్ కోవిడ్, పెళ్లి తదితర విషయాల గురించి మీడియాతో మాట్లాడింది. "కరోనా వైరస్ మరికొంతకాలం ఉంటుందని మనందరికీ తెలుసు. ఆ మహమ్మారి మనకు కావాల్సిన వ్యక్తులను ఎందరినో పొట్టనపెట్టుకుంటోంది. ఇది చాలా విషాదకరం. గతేడాది మా నాన్న కరోనా బారిన పడ్డాడు. ఈ ఏడాది ప్రారంభంలో నిశ్చితార్థం జరిగాక మా అమ్మకు, నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వెంటనే మేము ముంబైలో క్వారంటైన్లో ఉండిపోయాం. చాలా భయపడిపోయాం. కొద్ది రోజుల వరకు ఎంతో ఆందోళన చెందాం. కానీ దాన్నుంచే ఎలాగోలా బయటపడ్డాం" "కరోనాను జయించిన తర్వాత కూడా ఇప్పటికీ నీరసంగా ఉంటోంది. అందుకే వ్యాయామాలు చేయడం మొదలు పెట్టాను. నాకు కరోనా సోకిన సమయంలో భవ్య నాకు నిత్యం కాల్ చేసి నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. నేను కోలుకున్న వెంటనే అతడికి పాజిటివ్ వచ్చింది. అప్పుడు అతడి ఆరోగ్యం మీద నేను శ్రద్ధ చూపించాను. ఇక పెళ్లి గురించి ఇప్పుడే చర్చించడం లేదు. అయినా పరిస్థితులు చక్కబడాలి కదా!" అని మెహ్రీన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ‘ఎఫ్3’లో నటిస్తోంది. చదవండి: ‘చూడచక్కగా ఉన్నారు.. మీ జంట సూపర్’ -
కరోనాలో పెళ్లి వద్దు.. డ్యూటీయే ముద్దు!
భువనేశ్వర్: మందులేని మహమ్మారి కరోనా పోరులో ముందుండే పోలీసులు.. లాక్డౌన్ అమలుకై అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లో కుంటుంబాలతో కలిసి ఉంటే.. పోలీసులు డ్యూటీలో తలమునకలయ్యారు. ఈక్రమంలో ఒడిశాకు చెందిన ఇద్దరు మహిళా పోలీసు సిబ్బంది తమ పెళ్లిని సైతం వాయిదా వేసుకున్నారు. విధి నిర్వహణకే మొగ్గుచూపారు. సుందర్‌గర్ జిల్లాకు చెందిన హోంగార్డు తిలోత్తమ మెహర్ విహారం ఏప్రిల్ 12న జరగాల్సి ఉంది. కానిస్టేబుల్ అధ వివాహం ఏప్రిల్ 25 న జరగాల్సి ఉంది. కరోనా క్లిష్ట సమయంలో విధులకే ఈ ఇద్దరూ ప్రాధాన్యమిచ్చారని రాష్ట్ర డీజీపీ అభయ్ వెల్లడించారు. ప్రజల మేలు కోసం వివాహాలు వాయిదా వేసుకున్నారని ప్రశంసించారు. ఒడిశా వ్యాప్తంగా ఎంతోమంది పోలీసు సిబ్బంది తమ ఇళ్లల్లో జరిగే శుభకార్యాలను వాయిదా వేసుకున్నారని డీజీపీ తెలిపారు. (చదవండి: కరోనా: ఆరోగ్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు) -
అర్జున్.. అను వచ్చేశారు
‘భీష్మ’ వంటి హిట్ చిత్రం తర్వాత నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రంగ్ దే’. కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నేడు నితిన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్ పాత్రలో నితిన్, అను పాత్రలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారు. ఈ పాత్రలను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి కెమెరా: పి.సి. శ్రీరామ్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). పుట్టినరోజు వేడుకల్లేవ్.. పెళ్లి వాయిదా కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో నేడు తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం లేదని, ఏప్రిల్ 16న దుబాయ్‌లో జరగాల్సిన పెళ్లిని కూడా వాయిదా వేశానని నితిన్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఆందోళనకర పరిస్థితులున్నాయో మీకు తెలుసు. లాక్డౌన్ కొనసాగుతుండటంతో నేడు నా పుట్టినరోజుని జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఎక్కడా కూడా నా జన్మదిన వేడుకలు జరపవద్దు. నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను. ఈ సంక్షోభ సమయంలో మనం ఇళ్లల్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్లు’’ అన్నారు. ∙కీర్తీ సురేశ్, నితిన్ -
చాలాసార్లు పెళ్లి చేశారు
బాలీవుడ్లో పెళ్లి టాపిక్ వస్తే... అందులో రణ్‌వీర్‌సింగ్, దీపికా పదుకోన్ జంట తప్పకుండా ఉంటుంది. ఇటీవల ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న వీళ్ల వివాహం వాయిదా పడిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రణ్‌వీర్‌సింగ్ ముందు ప్రస్తావిస్తే...‘‘నా పెళ్లి గురించే నాకే తెలియనన్ని కథనాలు వస్తున్నాయి. నేను వేసుకోబోయే షేర్వాణీ ఆ కలర్ అని, ఎవరెవరో పెళ్లి బహుమతులు ఇవ్వబోతున్నారని కూడా వస్తున్నాయి. నేను పెళ్లి చేసుకుంటే అందరికీ చెబుతాను. ఇప్పటికే నాకు, దీపికాకు చాలాసార్లు పెళ్లి చేసేశారు (నవ్వుతూ). అసలు నా పెళ్లి ఎప్పుడో అందరితో చెప్పే చేసుకుంటా’’ అని చెప్పుకొచ్చారు రణ్వీర్. ఇంకా మాట్లాడుతూ– ‘‘లైంగిక వేధింపుల గురించి మహిళలు ధైర్యంగా బయటకు చెప్పాలి. మహిళలపై లైగింక వేధింపులు తప్పు’’ అన్నారు. ‘‘మీటూ’ ఉద్యమం లింగ వివక్షకు సంబంధించినది కాదు. తప్పొప్పులకు చెందినది’’ అన్నారు దీపికా పదుకోన్. ఇదంతా ఓ ప్రైవైట్ కార్యక్రమంలో భాగంగా జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో కమల్‌హాసన్ పాల్గొన్నారు. కమల్‌హాసన్, రణ్వీర్, దీపికలు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు తమ అభిప్రాయాలను చెప్పారు. -
పెళ్లి వాయిదా వేసుకున్న హీరోయిన్
నటి ప్రియమణికిప్పుడు ఓ భాషలోనూ అవకాశాలు లేవు. పెళ్లి చేసుకుని సంసార జీవితలో సెటిలవ్వాలని భావించారు. అందుకు ప్రియుడి తరపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ పడింది. అన్నట్టు ప్రియమణి ప్రేమ కథ చెప్పలేదు కదూ. ఈ భామ ముస్తాఫారాజ్ అనే ముంబాయికి చెందిన వ్యక్తిని ప్రేమించారు. తదుపరి కథను ప్రియమణినే అడుగుదాం. అసలు విషయం ఏమటంటే వీరి పెళ్లి వాయిదా పడింది. కారణం కొన్ని సినిమాల్లో చూసినట్లు ప్రియమణి పెళ్లి వాయిదాకు విధి తాత్కాలికంగా ఆటంకంగా నిలిసింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియమణినే తెలిపారు. అదేమిటో ఆమె మాటల్లోనే విందాం. బెంగుళూర్లో జరిగిన కిక్రెట్ క్రీడా పోటీల సమయంలో ముస్తాఫారాజ్‌తో పరిచయమయ్యింది. ముందుగా ఆయనే నా ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నారు. అలా ఒకరికొకరం ఫోన్ చేసుకోవడంతో ప్రేమ మొలకెత్తింది. అయితే నేనే ముందుగా నా ప్రేమను వ్యక్తం చేశాను. దాన్ని నమ్మడానికి ముస్తాఫాకు కొన్ని నెలలే పట్టింది. ఆ తర్వాత నిజంగానే ప్రేమిస్తున్నానని తెలుసుకుని తనూ ఓకే చెప్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే నా జాతక రీత్యా ఇప్పుడే పెళ్లి చేసుకోవడం మంచిది కాదని జ్యోతిష్కుడు చెప్పారు. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుంటే వైవిహిక జీవితంతో పాటు నట జీవితం బాగుంటుందని చెప్పడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు ప్రియమణి వెల్లడించారు.