
చైనాను వణికిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ చెన్నైలో షూటింగ్ చేసుకుంటున్న ‘ఇండియన్ 2’పై పడింది. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇండియన్ 2’. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్, సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ భారీ షెడ్యూల్‌ను చైనాలో షూట్ చేయాలనుకున్నారు. కరోనా వైరస్ ఇబ్బంది ఉండటంతో లొకేషన్‌ను మార్చుకోవాలనుకుంటున్నారట. ఈ షెడ్యూల్‌ను ఇటలీలో చేయనున్నారని తాజా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment