
కమల్ హాసన్
ఫ్యాన్స్‌తో ఇట్టే కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాలో ప్రతీ మార్గంలోకి అడుగుపెడుతున్నారు మన హీరోలు. ట్వీటర్‌లో సినిమాలు, రాజకీయాల విషయాలను పంచుకుంటూ బాగా యాక్టీవ్‌గా ఉంటారు కమల్ హాసన్. ఇప్పుడు ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ‘విశ్వరూపం 2’ ఫొటో షేర్ చేసి ఎంట్రీ ఇచ్చారు. అలాగా ‘విశ్వరూపం’ సీక్వెల్ ‘విశ్వరూపం 2’ ట్రెలర్‌ని సోమవారం కమల్ రిలీజ్ చేస్తూ –‘‘మొదటి భాగానికి ఎదురైనట్టే ఈ సినిమాకు సమస్యలు ఎదురైతే రాజకీయంగా ఎదుర్కో వడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. తెలుగు ట్రైలర్‌ను ఎన్టీఆర్ రిలీజ్ చేసి– ‘‘ఒక మనిషి అనేక రూపాలు. కమల్‌గారి ‘విశ్వరూపం’ ట్రైలర్ రిలీజ్ చేయడం నిజంగా హానర్‌గా ఫీల్ అవుతున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 10న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment