Vishwaroopam-2
-
ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు
‘‘విశ్వరూపం’ సినిమా ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ సినిమాలకు వచ్చిన గ్యాప్ మా వల్ల కాదు. అది రాజకీయం. ఇప్పుడు అవన్నీ పక్కకు తప్పుకోవడంతో ఈ సినిమా ఆడియన్స్ దగ్గరకు వస్తోంది. ఇంతకు ముందు సినిమాను మర్చిపోతారేమో అనే భయం ఉండేది. డిజిటల్ యుగం వల్ల ఫస్ట్ పార్ట్ పోయిన సంవత్సరం రిలీజ్ అయిన సినిమాలానే గుర్తుపెట్టుకొని సీక్వెల్‌ను స్వాగతిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది’’ అని కమల్‌హాసన్ అన్నారు. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘విశ్వరూపం 2’. 2013లో రిలీజ్ అయిన ‘విశ్వరూపం’ చిత్రానికి సెకండ్ పార్ట్. ఆండ్రియా, పూజా కుమార్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. జిబ్రాన్ సంగీత దర్శకుడు. ఈ నెల 10న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా కమల్‌హాసన్ చెప్పిన విశేషాలు. సినిమాను ముందుగానే రెండు పార్ట్స్‌గా డిజైన్ చేశాం. ఈ సినిమా షూటింగ్ నాలుగేళ్ల క్రితం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యాయి. కొత్తగా ఏమీ షూటింగ్ చేయలేదు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ చేశాం. సెకండ్ పార్ట్ ఇండియాలో జరుగుతుంది. ఈ ఇండికేషన్ ఫస్ట్ పార్ట్ లాస్ట్‌లో చూపించాం. ఫస్ట్ పార్ట్ అంతా అమెరికాలో జరిగింది. సినిమాలో హీరోకి వసీమ్ అహ్మద్ కశ్మీరీ అనే పేరు ఎందుకు పెట్టాం? అనేది కూడా ఇందులో వివరిస్తాం. సెకండ్ పార్ట్ చూసేటప్పుడు సినిమాలోని అన్ని లేయర్స్ అర్థం అవుతాయి. ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు క్రియేటీవ్ ఫ్రీడమ్ అనేది మన దగ్గర చాలా తక్కువ అని ఫీల్ అవుతాను. వాక్ స్వాతంత్య్రం కూడా తక్కువే. సినిమా అనేది నాకు దొరికిన ఒక ప్లాట్‌ఫామ్. వివాదాలు చేసేవాళ్లు ఆ పనిని ఆపేశారు. ఇప్పుడు నేను కూడా రాజకీయ నాయకుడినే. ఇప్పుడు ఎవరూ ఎవరి ఉద్దేశాలు వినేలా లేరు. నేషనలిజానికి అర్థం మారుతూ ఉంటుంది. పెషావర్ మనది. కానీ ఇప్పుడు కాదే. నిజాం అని పిలిచే వాళ్లం. కానీ ఇప్పుడు? ఎవరి ఒపీనియన్ వాళ్లది. నేషనలిజానికి నా అర్థం ఏంటో నేను తెలుసుకున్నాను. ఎలా ఉండాలో నాకు చెప్పొద్దు. మా స్టైల్లో మేం పాటిస్తూనే ఉన్నాం. ఎవరి అర్థం వారు డిఫైన్ చేసుకోవచ్చు. ప్రపంచ స్థాయి సినిమాలు తీస్తున్నాం ‘విశ్వరూపం 2’ యాక్షన్ సీన్స్ ఫస్ట్ పార్ట్స్‌ని మించి ఉంటాయి అనుకుంటున్నాను. నాతోటి హీరోలు ఏం చేస్తున్నారో చూస్తూనే ఉన్నాను. పది సంవత్సరాల క్రితం చేసిన యాక్షన్స్ సినిమాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు సినిమా స్టాండర్డ్స్ ఇంకా పెరిగాయి. వరల్డ్ సినిమా స్టాండర్డ్స్‌లో మనం సినిమాలు చేస్తున్నాం. ఈ సినిమా కూడా ఆ స్థాయికి తక్కువ ఏం ఉండదనుకుంటున్నాను. జిబ్రాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్‌కి పని చేసిన శంకర్ ఎహసన్ లాయ్‌ని రిపీట్ చేయడం కుదర్లేదు. సినిమాలు వేరు.. పాలిటిక్స్ వేరు సినిమాలు వేరు. పాలిటిక్స్ వేరు. సినిమాల్లానే నా పొలిటికల్ ఐడియాలజీలు కూడా సోఫిస్టికేటెడ్‌గా ఉంటాయా అంటే.. అందరూ ప్రజాస్వామ్యానికి అలవాటు పడాలి, అర్థం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. మనకు స్వాతంత్య్రం వచ్చి 71 సంవత్సరాలు అయింది. కానీ నేను మాత్రం 1948లోనే ఉన్నాం అని భావిస్తాను. స్వాతంత్య్రం వచ్చి ఒక్క ఏడాదే అయిందని భావించి, అభివృద్ధికి అందరూ తమ వంతు సహకారం అందించాలి. కమల్ పేరు వినిపించదు! చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇంత మంది జనాభా ఉన్నాం. మంచి నటులు వస్తారు, రావాలి. నేను చాలా స్వార్థపరుణ్ణి. మంచి మంచి పాత్రలన్నీ నేనే ఎంచుకున్నాను. ఇప్పుడు నేను చెప్పాల్సిన కథలు చాలానే ఉన్నాయి. అయితే రాజకీయాల్లోకి వెళ్లాను కాబట్టి వేరే వాళ్లు చెబుతారు. కమల్‌హాసన్ అనే పేరు వినిపించదు. అంతే కానీ అదే టాలెంట్‌తో, ఇంకా ఎక్కువ టాలెంట్‌తో వస్తూనే ఉంటారు. ‘సాగర సంగమం’లో ‘ఆర్ట్ నెవర్ ఎండ్స్’ అని వేశాం. సినిమాలపై పొలిటికల్ ప్రెజర్ సినిమాలపై వచ్చే పొలిటికల్ ప్రెజర్ అసలు పొలిటికల్ ప్రెజరే కాదు. జస్ట్ ప్రెజర్ మాత్రమే. పొలిటికల్ అని అంటున్నాం. నిరంకుశత్వ ధోరణి ఉన్నవాళ్లే ఎక్కువ భయపడతారని నేను భావిస్తాను. ఫిల్మ్ జర్నలిస్ట్ అయినా, వేరే ఏ జర్నలిస్ట్ అయినా టైమ్ వచ్చినప్పుడు పొలిటీషియన్స్‌ను ప్రశ్నలు అడగాలి. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ బాధ్యత ఉంది జర్నలిస్ట్‌లకు. వాళ్లు సమాధానాలను దాటేయవచ్చు కానీ జర్నలిస్ట్‌లు క్వశ్చన్స్ వేయకుండా ఉండకూడదు. ఇలా జర్నలిస్ట్‌లు క్వశ్చన్స్ అడిగినప్పుడు పొలిటీషియన్‌గా నా పని ఈజీ అవుతుంది. బాలచందర్‌గారు స్టార్స్‌ని తయారు చేశారు యాక్టర్స్‌ని సెలెక్ట్ చేయడం రెండు విధాలు. ఒకటి స్టార్ దగ్గరకు వెళ్లడం, స్టార్స్‌ని తయారు చేయడం. బాలచందర్ గారు స్టార్స్‌ని తయారు చేయడం చూశాను. మట్టి బొమ్మలకు దేవత రూపాలు ఇచ్చారు. మేల్ స్టార్స్, ఫీమేల్ స్టార్స్‌ని తయారు చేశారు. ఆ పద్ధతి నాకు ఇష్టం. ఆర్ట్‌ని ప్రేమిస్తే తప్ప అలా చేయలేం. స్టార్స్ అంటే సెపరేట్ వ్యాన్, టచప్ చేయడం ఇవన్నీ కాదు. ఎప్పుడు రిహార్సల్స్‌కి పిలిచినా వచ్చేవారు. పట్టుదలతో చేసేవారే స్టార్స్. మా టీమ్ అందరం కలిసి స్క్రిప్ట్ చదువుతాం. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్లు నన్ను అడుగుతారు. ఈ సినిమా కెమెరామెన్ ఒక డైరెక్టర్, ఎడిటర్ ఒక డైరెక్టర్.. ఇలా ఎంతో మంది ఇంటెలిజెన్స్ పర్సన్స్ వేసే ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్, వచ్చే డిస్కషన్స్ సినిమాకు ప్లస్ అవ్వడంతో పాటు నా క్యారెక్టర్ మరింత మెరుగు అవ్వడానికి దోహదపడుతుంది. మా టీమ్‌లో ఎక్కువ మంది డైరెక్టర్స్ ఉన్నారు. ఒక సినిమాను తీయడంలో ఉన్న కష్టం ఏంటో వారందరికీ తెలుసు. వాళ్ల రుణం తీర్చుకోవాలి ఫిల్మ్ మేకింగ్‌లో ప్రతీ పనిని ఎంజాయ్ చేస్తాను. నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆడియన్స్‌తో కలిసి చూడటమే నా రెమ్యునరేషన్, ఫస్ట్ అడ్వాన్స్లా భావిస్తాను. నా ఫేమ్, మనీ, నా స్టేటస్ అన్నీ ఆడియన్స్ ఇచ్చినవే. వాళ్ల రుణం తీర్చుకోవాలి కదా. వాళ్లకు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాను (రాజ కీయాల్లోకి అడుగుపెట్టడాన్ని ఉద్దేశించి). -
పంద్రాగస్టుకి ముందే!
కమల్‌హాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘విశ్వరూపం’ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా కమల్‌హాసన్ దర్శకత్వంలోనే ‘విశ్వరూపం 2’ రూపొందింది. ఆస్కార్ ఫిలింస్ (ప్రై) లిమిటెడ్ వి.రవిచంద్రన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 10న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్నారనే వార్తలు వచ్చాయి. ‘‘తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. అంతర్జాతీయ స్థాయిలో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది’’ అన్నారు రవిచంద్రన్. -
ఒక మనిషి అనేక రూపాలు
ఫ్యాన్స్‌తో ఇట్టే కనెక్ట్ అవ్వడానికి సోషల్ మీడియాలో ప్రతీ మార్గంలోకి అడుగుపెడుతున్నారు మన హీరోలు. ట్వీటర్లో సినిమాలు, రాజకీయాల విషయాలను పంచుకుంటూ బాగా యాక్టీవ్‌గా ఉంటారు కమల్ హాసన్. ఇప్పుడు ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ‘విశ్వరూపం 2’ ఫొటో షేర్ చేసి ఎంట్రీ ఇచ్చారు. అలాగా ‘విశ్వరూపం’ సీక్వెల్ ‘విశ్వరూపం 2’ ట్రెలర్ని సోమవారం కమల్ రిలీజ్ చేస్తూ –‘‘మొదటి భాగానికి ఎదురైనట్టే ఈ సినిమాకు సమస్యలు ఎదురైతే రాజకీయంగా ఎదుర్కో వడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. తెలుగు ట్రైలర్‌ను ఎన్టీఆర్ రిలీజ్ చేసి– ‘‘ఒక మనిషి అనేక రూపాలు. కమల్‌గారి ‘విశ్వరూపం’ ట్రైలర్ రిలీజ్ చేయడం నిజంగా హానర్‌గా ఫీల్ అవుతున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 10న విడుదల కానుంది. -
విశ్వరూపం-2 ట్రైలర్ విడుదల
కమలహాసన్ ‘విశ్వరూపం’ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపారు. ఈ యూనివర్సల్ హీరోకు విశ్వరూపం విడుదల విషయంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా విశ్వరూపం 2 సినిమాను తెరకెక్కిస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో విడుదల కావల్సిన ‘విశ్వరూపం 2’ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హిందీలో ఆమీర్ ఖాన్, తమిళ్లో శృతి హాసన్, తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ‘ఏ ఒక్క మతానికో కట్టుబడటం తప్పుకాదు.. దేశ ద్రోహం మాత్రం తప్పు’ అంటూ చెప్పిన డైలాగ్ ట్రైలర్లో ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో చూపిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. జిబ్రాన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం అదిరిపోయేలా ఉన్నాయి. ట్రైలర్ విజువల్ పరంగానూ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. మరి ఈ సినిమాతో కమల్‌హాసన్‌కు భారీ విజయాన్ని అందుకుంటారో లేదో వేచి చూడాలి. కమల్ స్వీయ దర్శకత్వంలో ఆగస్టు 10న రాబోతున్న ఈ సినిమాలో ప్రియా, ఆండ్రియా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
దేశద్రోహం మాత్రం తప్పు
-
వేసవిలో విశ్వరూపం
అవును...... మే లో విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నారట కమల్‌హాసన్. నాలుగు సంవత్సరాలుగా పలు వివాదాలతో లేటవుతున్న‘విశ్వరూపం2’ ఈ సమ్మర్‌కు కచ్చితంగా థియేటర్స్‌లో సందడి చేయనుందట. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వరూపం’ సినిమాకు ఇది సీక్వెల్ అన్న విషయం తెలిసిందే. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్‌హాసన్ నిర్మించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయనీ, ఎలాగైనా సమ్మర్లో తీసుకురావాలని ‘విశ్వరూపం 2’ చిత్రబృందం ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ టాక్. విశేషం ఏంటంటే.. ‘విశ్వరూపం 2’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ‘కాలా’ కంటే ముందే కంప్లీట్ అయిపోయాయట. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారని టాక్. ఆల్రెడీ ఈ సినిమా ట్రైలర్ రెడీ అయిందని, తమిళనాడులో జరిగిన థియేటర్స్ బంద్ వల్ల రిలీజ్ చేయలేదని టాక్. ఆండ్రియా, పూజాకుమార్, శేఖర్ కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు జీబ్రాన్ సంగీతం అందించారు. -
సీక్వెల్ మచ్చీ సీక్వెల్
మచ్చీ... ‘రోబో’ అప్డేట్ అయ్యి వస్తున్నాడు.... భారతీయుడు విశ్వరూపం చూపిస్తాడట. ఈసారి పందెంకోడి మళ్లీ బరిలోకి దిగాడు... సామి దూకుడు పెంచాడు... మారి మమ్మమ్మాస్...సీక్వెల్ మచ్చీ సీక్వెల్... ఈ ఏడాది తమిళంలో సీక్వెల్స్ జోరు సాగుతోంది... ‘2.0’, ‘విశ్వరూపం 2’ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అయ్యాయి.... ఆన్ సెట్స్‌లో పదికి పైగా సీక్వెల్స్ ఉన్నాయి. సీక్వెల్స్ మావా సీక్వెల్స్. మరోసారి ఇండియన్ విశ్వరూపం కొడుకు మీద ఉన్న ప్రేమకన్నా, దేశభక్తే మిన్న అని చెప్పాడు భారతీయుడు. శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్, ఉర్మిళ, మనీషా కోయిరాల ముఖ్య తారలుగా తమిళ్, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘భారతీయుడు’ (1996). ఆల్మోస్ట్ ఎనిమిది కోట్లతో నిర్మించిన ఈ సినిమా 30 కోట్లను అప్పట్లోనే కొల్లగొట్టింది. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్ విభాగంలో కమల్‌హాసన్ స్టేట్ అండ్ నేషనల్ అవార్డులు అందుకున్నారు. అంతేనా బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ విభాగంలో ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్‌కు పంపించారు. భారతీయుడు అంత క్రేజ్ ఉండబట్టే... ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో పడ్డారు దర్శకుడు శంకర్ అండ్ కమల్‌హాసన్. సీక్వెల్ ఎనౌన్స్ చేసిన వెంటనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ముందు ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించాలనుకున్నారు. ఆ తర్వాత తప్పుకున్నారు. దాంతో ఫస్ట్ పార్ట్‌ని నిర్మించిన ఏయం రత్నం సీక్వెల్ తీయడానికి ముందుకొచ్చారు. ప్రముఖ రచయిత జయమోహన్‌తో కలసి ప్రముఖ రచయిత వైరముత్తు తనయుడు, యువరచయితల్లో మంచి పేరు తెచ్చుకున్న కబిలన్ వైరముత్తు రెండో భాగానికి కథ రెడీ చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ చిత్రం కోసం భారీ సెట్ వేయిస్తున్నారట. ఆగస్ట్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.విశేషం ఏంటంటే.. రానున్న రోజుల్లో కమల్ రెండు సీక్వెల్స్‌లో కనిపించనున్నారు. ఆల్రెడీ ‘విశ్వరూపం 2’ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆల్మోస్ట్ ఐదేళ్ల క్రితం రిపబ్లిక్‌డే టైమ్‌లో ‘విశ్వరూపం’ విడుదలైంది. కమల్‌హాసన్, రాహుల్ బోస్, పూజా కుమార్, ఆండ్రియా, జై దీప్ ముఖ్య తారలుగా నటించారు. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో ఆల్మోస్ట్ 90కోట్లతో రూపొందిన ఈ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరింది. సో.. ‘విశ్వరూపం 2’ పై అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేసి, చిత్రాన్ని ఈ ఏడాదిలో విడుదల చేయాలనుకుంటున్నారు. విశ్వరూపం ఫస్ట్‌లుక్ రంజాన్‌కు సామి స్క్వేర్ ! పద్నాలుగేళ్లు పట్టింది.. 2003లో వచ్చిన ‘సామి’ సినిమాకు సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లేందుకు. విక్రమ్, త్రిష, వివేక్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘సామి’. దోచుకున్న వారిని దోచుకునే పోలీస్ పాత్రలో విక్రమ్ నటించారు. అప్పట్లో ఐదు కోట్లతో రూపొందిన ఈ సినిమా 30కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమాను తెలుగులో ‘లక్ష్మీనరసింహా’ పేరుతో బాలకృష్ణ రీమేక్ చేశారు. తెలుగులో కూడా మంచి స్పందన లభించింది. సామి స్వే్కర్ ఆన్‌లోకేషన్ ‘సామి’ సెన్సేషనల్ హిట్ సాధించడంతో ‘సామి స్వే్కర్పై అంచనాలు పెరిగాయి. స్క్రిప్ట్ పరంగా ఇద్దరు హీరోయిన్లకు చాన్స్ ఉన్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ స్టార్టింగ్‌లోనే క్రియేటివ్ డిఫరెన్స్‌తో హీరోయిన్ త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ 80శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సీక్వెల్లో కూడా విక్రమ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. రంజాన్‌కు రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. సామిలో విక్రమ్ మళ్లీ రేస్ మొదలైంది డిఫరెంట్ యాంగిల్ రౌడీయిజాన్ని ‘మారి’లో చూపించారు దర్శక–నటుడు–నిర్మాత ధనుష్. ఆయన హీరోగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో కాజల్ కథానాయికగా రూపొందిన చిత్రం ‘మారి’. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. పావురాల రేసింగ్ కాన్సెప్ట్ ఈ సినిమాలో హైలెట్. ఈ ఏడాది ఈ సినిమాకు సీక్వెల్‌ను ఎనౌన్స్ చేశారు ధనుష్. మారిలో ధనుష్ బాలాజీ మోహన్ దర్శకత్వంలోనే తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయి పల్లవి, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. పదేళ్ల క్రితం ధనుష్ నటించిన ‘యారుడా నీ మోహిని’కి సంగీతం అందించిన యువన్ శంకర్ రాజా ఇన్నేళ్ల తర్వాత ధనుష్ ‘మారి 2’కి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 40 శాతం కంప్లీట్ అయ్యింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మారి2 వర్కింగ్ స్టిల్ ఇదిగో వస్తా.. అదిగో వస్తా! రజనీకాంత్ ‘2.0’ రిలీజ్ డేట్ చాలాసార్లు మారింది. కానీ అంచనాలు మాత్రం మరింత పెరిగాయి. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ముఖ్య తారలుగా దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఆల్మోస్ట్ ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘ఎందిరన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు ఇది సీక్వెల్. ఆల్మోస్ట్ 130 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘రోబో’ భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ‘2.0’ అయితే... రిలీజ్‌కు ముందే ఆల్మోస్ట్ 150 కోట్ల బిజినెస్ చేసింది. రోబో అంతేకాదు ఈ సినిమాను త్రీడీ వెర్షన్‌తో పాటు, ఆల్మోస్ట్ 14 భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. కొందరైతే ఇప్పటివరకు ఇండియాలో అత్యధిక వసూళ్లు చేసిన మొదటి సినిమా ‘బాహుబలి’ రికార్డులను ‘2.0’ బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. జనవరిలో రావాల్సిన ఈ సినిమా ఏప్రిల్‌కి వాయిదా పడింది. అదీ జరగలేదు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ చేస్తారని కొందరు, లేదు లేదు దీపావళికి రిలీజ్ చేస్తారని మరికొందరు అంచనాలు వేస్తున్నారు. మరి.. ఇదిగో వస్తా.. అదిగో వస్తా అంటున్న ‘2.0’ ఎప్పుడు వస్తుందో కాలమే చెప్పాలి. 2.0 కాంచన కమింగ్ సూన్ ‘ముని’ సినిమాను తెరకెక్కించేటప్పుడు రాఘవ లారెన్స్ ఊహించారో లేదో.. ఈ సినిమాకు మూడు సీక్వెల్స్ వస్తాయని. స్వీయ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ నటిస్తూ వేదిక, రాజ్ కిరణ్ ముఖ్య తారలుగా 2007లో రూపొందిన సినిమా ‘ముని’. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు 15 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. అంతేకాదు. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా 2011లో వచ్చిన ‘కాంచన’, నాలుగేళ్ల తర్వాత 2015లో వచ్చిన ‘కాంచన 2’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. కాంచన3 వర్కింగ్ స్టిల్ ఇప్పుడు ‘కాంచన 3 రూపొందుతోంది. ఈ సినిమాని కూడా స్వీయ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇందులో ఓవియా, వేదిక నటిస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఎనిమిదేళ్ల క్రితం ‘ముని’ ఫస్ట్ పార్ట్‌లో నటించిన వేదిక మళ్లీ ‘కాంచన 3’లో నటిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ నుంచి ఓవియా తప్పుకున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఓవియా ‘కాంచన 3’ షూట్లో జాయిన్ అవ్వడంతో ఆ వార్తలు అవాస్తవం అని తేలిపోయాయి. ‘కాంచన 3’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘ముని’లో రాజ్‌కిరణ్, లారెన్స్ బరిలోకి అదే పందెంకోడి విశాల్‌ని మంచి మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ‘పందెం కోడి’. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, మీరా జాస్మిన్ జంటగా తమిళ్లో రూపొందిన చిత్రం ‘సండైకోళి’ (2005) తెలుగులో ‘పందెంకోడి’గా రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘పందెం కోడి 2’ నిర్మిస్తున్నారు. స్టార్టింగ్‌లో కాస్త స్లోగా ఈ చిత్రం షూటింగ్ సా..గిం..ది. ఇప్పుడు ‘పందెం కోడి’ మంచి ఊపుమీద ఉంది. ఈ సీక్వెల్లో విశాల్ సరసన కీర్తీ సురేశ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేసుకుందని సమాచారం. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కీర్తీ సురేశ్, విశాల్ నవ్వుల పందిరి ‘పెళ్లాం ఊరెళితె’ ఏం జరిగిందో థియేటర్లో చూశాం. ఇది తమిళ ‘చార్లీ చాప్లీన్’కి రీమేక్. శక్తి సుందర్ రాజన్ దర్శకత్వంలో ఆల్మోస్ట్ 16 ఏళ్ల క్రితం ప్రభుదేవా, ప్రభు, లివింగ్స్టన్, అభిరామి, గాయత్రి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చార్లీ చాప్లీన్’. థియేటర్స్‌లో నవ్వులతోపాటు, బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ప్రస్తుతం ‘చార్లీ చాప్లీన్ 2’ తెరకెక్కుతోంది. శక్తి సుందర్ రాజన్ దర్వకత్వంలోనే ప్రభుదేవా, ప్రభు, ఆదా శర్మ, నిక్కి గల్రానీ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ 70 శాతం కంప్లీట్ అయ్యిందని సమాచారం. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందట. పెళ్లి మండపంలో మా నవ్వుల పందరి ఏంటో సిల్వర్ స్క్రీన్‌పై చూడండి అంటున్నారు చిత్రబృందం. ఆదా శర్మ సుడిగాడి సందడి సినిమా రిలీజ్‌కి ముందే లీకయ్యే పరిస్థితి ఇప్పుడు. అయితే కొన్ని కొన్ని సీన్లు లీకవుతుంటాయి. అయితే రిలీజైన మర్నాడు మొత్తం సినిమా ఆన్లైన్లో దర్శనమిస్తోంది. దీన్ని ఉద్దేశించే ‘తమిళ్ పడమ్ 2.0’ చిత్రబృందం ‘మా సినిమా మే 25న విడుదలవుతుంది. 26న ఆన్లైన్లో ఉంటుంది. చూసుకోండి’ అని సెటైరికల్‌గా అన్నారు. అన్నట్లు ఇది కూడా సెటైరికల్ మూవీనే. సీయస్ అముదాన్ దర్శకత్వంలో డిఫరెంట్ పేరడీలతో శివ, దిశా పాండే జంటగా రూపొందిన చిత్రం ‘తమిళ్ పడమ్’. ఈ సీక్వెల్ సేమ్ హీరో, సేమ్ డైరెక్టర్‌తో తెరకెక్కుతోంది. ‘తమిళ్ పడమ్’ సినిమా తెలుగులో ‘సుడిగాడు’ టైటిల్‌తో రిలీజైన సంగతి తెలిసిందే. మరికొన్ని... ఈ సినిమాలే కాకుండా త్రిష, అరవిందస్వామి జంటగా ‘చదురంగ వేటై్ట 2’ తెరకెక్కుతోంది. ఇది ‘చదురంగ వేటై్ట’ కి సీక్వెల్. అలాగే సముద్రఖని దర్వకత్వంలో 2009లో రూపొందిన ‘నాడోడిగల్’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌లో నటించిన శశికుమార్‌నే రెండో పార్ట్‌లో నటిస్తున్నారు. అంతేకాదు ఎస్.ఆర్. ప్రభాకరన్ దర్శకత్వంలో శశికుమార్ హీరోగానే ‘సుందరప్పాండియన్ 2’ తెరకెక్కనుందని కోలీవుడ్ సమచారం. రామ్‌బాలా దర్శకత్వంలో సంతానం హీరోగా రూపొందిన హారర్ చిత్రం ‘దిల్లుకు దుడ్డు’. ఇప్పుడు సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. మరికొందరి స్టార్ హీరోలతో పాటు, చిన్న హీరోలు కూడా సీక్వెల్ స్వింగ్‌లో రావడానికి చర్చలు జరుగుతున్నాయట. ఆల్రెడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘కలకలప్పు’కి సీక్వెల్‌గా సుందర్. సి రూపొందించిన ‘కలకలప్పు 2’ విడుదలైంది. ఇప్పటికి పదికి పైగా సీక్వెల్స్ ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. చూడబోతుంటే ఇది ‘సీక్వెల్ నామ సంవత్సరం’ అనాలేమో. -
పారితోషికం తీసుకోకుండా నటించను
ఈ రంగంలో నేనుంది డబ్బుకోసమే. పారితోషికం తీసుకోకుండా నేను నటించను అని పేర్కొన్నారు విశ్వనటుడు కమలహాసన్. ఒక పక్క విశ్వరూపం–2 చిత్ర విడుదల పనుల్లో బిజీగా ఉన్న ఆయన మరో పక్క తన తాజా చిత్రం శభాష్‌నాయుడు బ్యాలెన్స్ చిత్రీకరణను పూర్తి చేసే పనిలోనూ నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ విశ్వనటుడు తాజాగా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హిందీలో అమితాబ్‌బచ్చన్, సల్మాన్‌ఖాన్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ పోటీ కార్యక్రమం తమిళంలో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి నటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దీని టీజర్ బుధవారం ఆ టీవీ నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా కమల్ బుల్లితెరకు పరిచయం కావడం గురించి క్లారిటీ ఇస్తూ డబ్బు కోసమే తాను బుల్లితెరపై వ్యాఖ్యాతగా అవతారమెత్తాను అని చెప్పారు. డబ్బు కోసమే తానీరంగంలో ఉన్నానని, పారితోషికం తీసుకోకుండా తాను నటించనని అన్నారు. ఇక బుల్లితెరకు పరిచయం అవడం వల్ల డబ్బుతో పాటు సినిమాలకంటే ఎక్కువగా ప్రేక్షకులకు దగ్గరవ్వొచ్చని అన్నారు. ఇలా రెండూ ఒకే చోట లభించడంతో ఎవరు మాత్రం వద్దంటారని కమలహాసన్ ప్రశ్నించారు. అందుకే బిగ్‌బాస్ కార్యక్రమానికి ఉత్సాహంగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
లైకా ఖాతాలో విశ్వరూపం-2 ?
విశ్వరూపం-2 చిత్రం లైకా ఖాతాలో చేరే అవకాశం కనిపిస్తోంది. విశ్వనటుడు కమలహాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం విశ్వరూపం-2. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఆస్కార్ రవిచంద్రన్ ఆర్థిక సమస్యలనెదుర్కొంటున్న కారణంగా విశ్వరూపం-2 చిత్రం విడుదల అయోమయంగా మారింది. కమలహాసన్ తాజాగా శభాష్‌నాయుడు చిత్రంలో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమల్ లైకా సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి మలయాళ దర్శకుడు రాజీవ్‌కుమార్ దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ అమెరికా వెళ్లిన తరువాత ఆయన అనూహ్యంగా అనారోగ్యానికి గురి కావడంతో శభాష్‌నాయుడు చిత్ర దర్శకత్వ బాధ్యతలను కమలే నిర్వహించాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఈ చిత్ర షూటింగ్‌ను 50 శాతం పూర్తి చేసి చెన్నైకి తిరిగి వచ్చారు కమల్. కాగా తదిపరి షెడ్యూల్‌ను విశాఖపట్టణంలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుండగా కమలహాసన్ అనూహ్యంగా విపత్తుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో శభాష్‌నాయుడు చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో శభాష్‌నాయుడు చిత్ర విడుదల తేదీన విశ్వరూపం-2 చిత్రాన్ని విడుదల చేయాలని కమల్ నిర్ణయించినట్లు సమాచారం. ఆస్కార్ ఫిలింకు చిత్ర నిర్మాణ ఖర్చులను చెల్లించి ఈ చిత్రాన్ని ఆయన లైకా సంస్థతో కలిసి తెరపైకి తీసుకురావడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే విశ్వరూపం-2 చిత్రాన్ని లైకా విడుదల చేయడానికి ముందుకు రావడంతో ఆస్కార్ ఫిలింస్ అధిక మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.