లైకా ఖాతాలో విశ్వరూపం-2 ? | viswaroopam-2 going to lika list...? | Sakshi
Sakshi News home page

లైకా ఖాతాలో విశ్వరూపం-2 ?

Published Sun, Jul 31 2016 3:12 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

లైకా ఖాతాలో విశ్వరూపం-2 ?

లైకా ఖాతాలో విశ్వరూపం-2 ?

విశ్వరూపం-2 చిత్రం లైకా ఖాతాలో చేరే అవకాశం కనిపిస్తోంది. విశ్వనటుడు కమలహాసన్ నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం విశ్వరూపం-2. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఆస్కార్ రవిచంద్రన్ ఆర్థిక సమస్యలనెదుర్కొంటున్న కారణంగా విశ్వరూపం-2 చిత్రం విడుదల అయోమయంగా మారింది. కమలహాసన్ తాజాగా శభాష్‌నాయుడు చిత్రంలో నటిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమల్ లైకా సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. దీనికి మలయాళ దర్శకుడు రాజీవ్‌కుమార్ దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.

అయితే చిత్ర యూనిట్ అమెరికా వెళ్లిన తరువాత ఆయన అనూహ్యంగా అనారోగ్యానికి గురి కావడంతో శభాష్‌నాయుడు చిత్ర దర్శకత్వ బాధ్యతలను కమలే నిర్వహించాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఈ చిత్ర షూటింగ్‌ను 50 శాతం పూర్తి చేసి చెన్నైకి తిరిగి వచ్చారు కమల్. కాగా తదిపరి షెడ్యూల్‌ను విశాఖపట్టణంలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుండగా కమలహాసన్ అనూహ్యంగా విపత్తుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

దీంతో శభాష్‌నాయుడు చిత్ర షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో శభాష్‌నాయుడు చిత్ర విడుదల తేదీన విశ్వరూపం-2 చిత్రాన్ని విడుదల చేయాలని కమల్ నిర్ణయించినట్లు సమాచారం. ఆస్కార్ ఫిలింకు చిత్ర నిర్మాణ ఖర్చులను చెల్లించి ఈ చిత్రాన్ని ఆయన లైకా సంస్థతో కలిసి తెరపైకి తీసుకురావడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే విశ్వరూపం-2 చిత్రాన్ని లైకా విడుదల చేయడానికి ముందుకు రావడంతో ఆస్కార్ ఫిలింస్ అధిక మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement