వేసవిలో విశ్వరూపం | Vishwaroopam 2 to release ahead of Kaala? | Sakshi
Sakshi News home page

వేసవిలో విశ్వరూపం

Published Sat, Apr 21 2018 12:25 AM | Last Updated on Sat, Apr 21 2018 12:25 AM

Vishwaroopam 2 to release ahead of Kaala? - Sakshi

కమల్‌హాసన్‌

అవును...... మే లో విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నారట కమల్‌హాసన్‌. నాలుగు సంవత్సరాలుగా పలు వివాదాలతో లేటవుతున్న‘విశ్వరూపం2’ ఈ సమ్మర్‌కు కచ్చితంగా థియేటర్స్‌లో సందడి చేయనుందట. కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వరూపం’ సినిమాకు ఇది సీక్వెల్‌ అన్న విషయం తెలిసిందే.  రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై కమల్‌హాసన్‌ నిర్మించారు.

ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి  అయ్యాయనీ, ఎలాగైనా సమ్మర్‌లో తీసుకురావాలని ‘విశ్వరూపం 2’ చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని కోలీవుడ్‌ టాక్‌.  విశేషం ఏంటంటే.. ‘విశ్వరూపం 2’ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు ‘కాలా’ కంటే ముందే కంప్లీట్‌ అయిపోయాయట. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చారని టాక్‌. ఆల్రెడీ ఈ సినిమా ట్రైలర్‌ రెడీ అయిందని, తమిళనాడులో జరిగిన థియేటర్స్‌ బంద్‌ వల్ల రిలీజ్‌ చేయలేదని టాక్‌. ఆండ్రియా, పూజాకుమార్, శేఖర్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు జీబ్రాన్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement