
చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(ఎమ్‌ఎన్‌ఎమ్), అధికార డీఎంకే మధ్య తమిళనాడులో పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా తమ పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కమల్ పార్టీ ఎమ్‌ఎన్‌ఎమ్ శనివారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున ప్రచారం మాత్రమే చేస్తామని తెలిపింది.
చెన్నైలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివలయంలో డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్‌తో కమల్‌హాసన్ భేటీ తర్వాత ఎమ్‌ఎన్‌ఎమ్ పార్టీ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. అయితే పొత్తులో భాగంగా 2025లో డీఎంకే, ఎమ్‌ఎన్‌ఎమ్‌కు ఒక రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
పొత్తు ప్రకటన అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం తాము డీఎంకే కూటమిలో చేరామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక్క లోక్‌సభ స్థానాల్లో డీఎంకే తరపున ప్రచారం చేస్తానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment