విశ్వరూపం-2 ట్రైలర్‌ విడుదల | Kamal Hassan Vishwaroopam 2 Trailer Release | Sakshi
Sakshi News home page

‘ఏ ఒక్క మతానికో కట్టుబడటం తప్పుకాదు’

Published Mon, Jun 11 2018 5:33 PM | Last Updated on Mon, Jun 11 2018 5:55 PM

Kamal Hassan Vishwaroopam 2 Trailer Release - Sakshi

కమలహాసన్‌ ‘విశ్వరూపం’ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపారు. ఈ యూనివర్సల్‌ హీరోకు విశ్వరూపం విడుదల విషయంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా విశ్వరూపం 2 సినిమాను తెరకెక్కిస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో విడుదల కావల్సిన ‘విశ్వరూపం 2’ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హిందీలో ఆమీర్‌ ఖాన్‌, తమిళ్‌లో శృతి హాసన్‌, తెలుగులో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ విడుదల చేశారు. 

‘ఏ ఒక్క మతానికో కట్టుబడటం తప్పుకాదు.. దేశ ద్రోహం మాత్రం తప్పు’ అంటూ చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో చూపిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. జిబ్రాన్‌ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం అదిరిపోయేలా ఉన్నాయి. ట్రైలర్‌ విజువల్‌ పరంగానూ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. మరి ఈ సినిమాతో కమల్‌హాసన్‌కు భారీ విజయాన్ని అందుకుంటారో లేదో వేచి చూడాలి. కమల్‌ స్వీయ దర్శకత్వంలో ఆగస్టు 10న రాబోతున్న ఈ సినిమాలో ప్రియా, ఆండ్రియా కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement