
షారుక్ ఖాన్, కమల్‌హాసన్
కమల్‌హాసన్ రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘హే రామ్’ (2000). ఈ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో తెలిసిందే. మూడు నేషనల్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. హిందీ–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. విశేషం ఏంటంటే... ఇప్పుడు ఈ సినిమా రైట్స్‌ను షారుక్ ఖాన్ సొంతం చేసుకున్నారట. ఇటీవల క్రిస్టోఫర్ నోలన్ ఇండియాను సందర్శించినప్పుడు అదే వేడుకలో పాల్గొన్న కమల్‌హాసన్ ఈ విషయాన్ని వెల్లడించారు.‘‘అప్పట్లో హే రామ్’ సినిమాను షారుక్ ఖాన్ కేవలం ఫ్రెండ్‌షిప్ కోసం చేశారు.
ఈ సినిమాలో నటించినందుకు తనకు వాచ్ మాత్రమే ఇవ్వగలిగాను. ఎందుకంటే సినిమా పూర్తయ్యేసరికి అతనికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ మిగల్లేదు. కానీ ఇప్పుడు షారుక్ ఓ వాచ్ కంపెనీకే బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఈ సినిమా రైట్స్‌ను షారుక్ ఖాన్ ఇటీవలే భరత్ షా (‘హే రామ్’ సినిమా కో–ప్రొడ్యూసర్) దగ్గర నుంచి తీసుకున్నారు. ఈ సినిమా మెమొరీస్ అతని దగ్గర ఉండి ఉంటాయి. ఎందుకంటే అతను ఈ సినిమా కోసం ఫ్రెండ్‌షిప్, సర్వీస్ ఇచ్చాడు కాబట్టి’’ అని పేర్కొన్నారు కమల్. ఇంతకీ ‘హే రామ్’ రైట్స్‌ను షారుక్ సొంతం చేసుకున్నారంటే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment