‘‘ఎంత మంది మనల్ని వ్యతిరేకిస్తున్నారన్నది ముఖ్యం కాదు. మనం ఏం చేయాలనుకుంటున్నామన్నదే ముఖ్యం. ఎవరేమన్నా నేను ముందుకు వెళతాను. అన్ని వ్యతిరేకతలను తీసుకోవడానికి నేను సిద్ధం. ఎదుర్కోవడానికి కూడా సిద్ధమే’’ అని కమల్‌హాసన్ అన్నారు. కమల్‌హాసన్ ‘నర్పణి ఇయక్కమ్’ (వెల్ఫేర్ అసోసియేషన్) 39వ వార్షికోత్సవం చెన్నైలో జరిగింది. ఈ సమావేశంలో కమల్ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్నారు. ‘‘నేను రాజకీయల్లోకి వస్తాను. పొలిటికల్ పార్టీ పెడతాను.
స్విస్ బ్యాంక్‌లో నేను డబ్బు దాచుకోలేదు. అక్కడ ఉన్న మన డబ్బును వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను’’ అన్నారు. పొలిటికల్ పార్టీ కార్యకలాపాలు సజావుగా జరగడానికి ఓ మొబైల్ యాప్‌ని రూపొందించారట. పుట్టినరోజు (ఈ నెల 7)నాడు ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. పార్టీకి ఫండ్ ఇవ్వాలనుకుంటే ఆ వివరాలు ఈ యాప్‌లో ఉంటాయట. బర్త్‌డే నాడు ‘విశ్వరూపం–2’ ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలనుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment