Swiss bank
-
భారత్ చేతికి మరిన్ని స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: వార్షిక ఆటోమేటిక్ సమాచార మారి్పడి (ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం స్విస్ బ్యాంకుల్లోని ఖాతాదారుల వివరాలకు సంబంధించిన 5వ సెట్‌ను భారత్‌కు స్విట్జర్లాండ్ అందించింది. వీటిలో వందల కొద్దీ ఖాతాల వివరాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో కొందరు వ్యక్తులు, కార్పొరేట్లు, ట్రస్టులకు చెందిన అకౌంట్లు అనేకం ఉన్నట్లు వివరించాయి. భారత్‌కు స్విట్జర్లాండ్ అందించిన వివరాల్లో ఖాతాదారు పేరు, చిరునామా, దేశం, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు, ఖాతాల్లో బ్యాలెన్స్ మొదలైనవన్నీ ఉన్నట్లు పేర్కొన్నాయి. గత నెల సెపె్టంబర్లో సమాచార మారి్పడి చోటు చేసుకోగా తదుపరి విడత సెట్‌ను స్విట్జర్లాండ్ 2024 సెప్టెంబర్‌లో భారత్‌కు అందించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ రిటర్నుల్లో తమ ఆర్థిక వివరాలన్నీ సక్రమంగా పొందుపర్చారా లేదా అనేది పరిశీలించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకుని, పన్నులు ఎగ్గొడుతున్న కుబేరుల ఆటకట్టడానికి ఉద్దేశించిన ఏఈఓఐ కింద భారత్‌కు తొలిసారి 2019 సెపె్టంబర్లో మొదటి సెట్ వివరాలు లభించాయి. మరోవైపు, ఈ ఏడాది మొత్తం 104 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాల మారి్పడి జరిగినట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) తెలిపింది. 78 దేశాలతో సమాచారం ఇచి్చపుచ్చుకున్నట్లు పేర్కొంది. 25 దేశాల నుంచి తాము వివరాలు తీసుకున్నప్పటికీ ఆయా దేశాల గోప్యత ప్రమాణాలు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో లేనందున తాము తమ సమాచారమేమీ ఇవ్వలేదని వివరించింది. -
35,000 ఉద్యోగాలు కట్! స్విస్ బ్యాంకులో సగానికిపైగా కోతలు..
స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్.. తాను టేకోవర్ చేస్తున్న మరో స్విస్ బ్యాంకు క్రెడిట్ సూసీలో 35,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోందని బ్లూమ్‌బర్గ్ వార్తా సంస్థ తాజాగా కథనం వెలువరించింది. దాదాపు 45,000 మంది ఉద్యోగులు ఉన్న క్రెడిట్ సూసీ.. దాని సాల్వెన్సీ గురించి ఇన్వెస్టర్ల భయాలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దాదాపుగా కుప్పకూలింది. దీంతో స్విస్ ప్రభుత్వం భారీ బెయిలౌట్‌తో అండగా నిలవడంతో క్రెడిట్ సూసీను కొనుగోలు చేసేందుకు యూబీఎస్ గ్రూప్ ముందుకు వచ్చింది. ప్రపంచంలో ప్రముఖమైన ఈ రెండు బ్యాంకులు కలుస్తున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు ముందుగానే హెచ్చరించారు. కాగా ఉద్యోగ కోతలపై వివరణ కోసం అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ... యూబీఎస్‌ను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించింది. మూడు దశల్లో.. యూబీఎస్, క్రెడిట్ సూసీ రెండు బ్యాంకింగ్ సంస్థల్లో కలిపి గత సంవత్సరం చివరి నాటికి దాదాపు 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 37,000 మంది స్విట్జర్లాండ్‌లో పని చేస్తున్నారు. ఉద్యోగుల కోత మూడు దశల్లో ఉంటుందని, మొదటిది జూలై చివరలో, మిగిలినవి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉంటాయని ఉద్యోగులకు తెలియజేసినట్లుగా బ్లూమ్‌బర్గ్ నివేదిక ఆయా కంపెనీలకు దగ్గరగా ఉన్న మూలాలను ఉటంకిస్తూ పేర్కొంది. బ్యాంక్ టేకోవర్‌కు సంబంధించి రాబోయే నెలల్లో ఒడుదుడుకులు ఉంటాయని, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కఠినమైన నిర్ణయాలు ఉంటాయని యూబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి జూన్ నెల ప్రారంభంలో హెచ్చరించారు. ఇదీ చదవండి: Bank Holidays July 2023: నెలలో దాదాపు సగం రోజులు సెలవులే! -
స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డబ్బు అన్ని వేల కోట్లా?
భారతదేశంలో చాలా మంది ప్రముఖులకు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటాయని కొన్ని సందర్భాల్లో వినే ఉంటారు. స్విస్ బ్యాంకుల ఖాతాలను గురించి నిజ జీవితంలో కంటే సినిమాల్లో బ్లాక్ మనీ గురించి వచ్చే చాలా సందర్భాల్లో వినే ఉంటారు. కానీ ఈ బ్యాంకులో అకౌంట్స్ కలిగిన ఇండియన్స్ చాలా మందే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ స్విస్ బ్యాంకులో ఉన్న భారతీయులకు సంబంధించిన డబ్బు ఎంత ఉండొచ్చు? స్విస్ బ్యాంకు రూల్స్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచములోని చాలా దేశాల ధనవంతులు తమ డబ్బుని స్విస్ బ్యాంకులో దాచుకుంటారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే స్విస్ బ్యాంకు రూల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయని చెబుతారు. కావున అక్కడ అకౌంట్ ఉంటే చాలు లాకర్ ఇచ్చేస్తుంటారు. ఎవరు ఖాతా ఓపెన్ చేసారనే విషయాలు పెద్దగా పట్టించుకోరు. అంతే కాకుండా ఖాతాదారులకు సంబంధించిన వివరాలను ఎవరికీ వెల్లడించే అవకాశం లేదు. (ఇదీ చదవండి: విడుదలకు ముందే వన్‌ప్లస్ బడ్స్ వివరాలు లీక్ - ధర ఎంతంటే?) స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం, 2022 చివరి నాటికి భారతీయులకు, మన దేశంలోని కంపెనీలకు సంబంధించిన డబ్బు 3.42 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ అని తెలుస్తోంది. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 30 వేల కోట్లు. 2021 కంటే 2022లో 11 శాతం డిపాజిట్లు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) స్విస్ బ్యాంకుల్లో భారతీయుడు దాచుకున్న డబ్బుని బ్లాక్ మనీ అనలేమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పన్ను ఎగవేత వంటి వాటికీ అడ్డుకట్ట వేయడానికి ఇండియాకి నిరంతరం సహకరిస్తున్నామని వెల్లడించారు. దీని కోసం స్విట్జర్లాండ్ 2018లో భారత్‌లో టాక్స్ విషయాలకు సంబంధించిన సమాచార మార్పిడి కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే 2018 నుంచి స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న వారి వివరాలను భారత ట్యాక్స్ అథారిటీ చేతికి అందించినట్లు సమాచారం. -
దేశీ బ్యాంకింగ్‌పై ‘క్రెడిట్ సూసీ’ ప్రభావం ఉండదు..
న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ వ్యవస్థపై స్విస్ బ్యాంకు క్రెడిట్ సూసీ సంక్షోభ ప్రభావాలేమీ ఉండకపోవచ్చని ఆర్థిక సేవల దిగ్గజం జెఫ్రీస్ ఇండియా అభిప్రాయపడింది. మూతబడ్డ అమెరికన్ బ్యాంకు ఎస్వీబీ (సిలికాన్ వ్యాలీ బ్యాంకు)తో పోలిస్తే క్రెడిట్ సూసీకి భారత్‌తో కొంత ఎక్కువ అనుబంధమే ఉన్నప్పటికీ .. దానికి ఇక్కడ కార్యకలాపాలు మాత్రం స్పల్పంగా ఉండటమే ఇందుకు కారణమని ఒక నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం క్రెడిట్ సూసీకి భారత్‌లో ఒకే ఒక్క శాఖ, రూ. 20,000 కోట్ల కన్నా తక్కువ అసెట్స్ ఉన్నాయి. అంతర్జాతీయంగా కొన్ని బ్యాంకులు మూతబడటం, పలు బ్యాంకులు ఒత్తిడిలో ఉండటం వంటి అంశాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న కొత్త పరిణామాలను రిజర్వ్ బ్యాంక్ నిశితంగా పరిశీలిస్తోందని నివేదిక తెలిపింది. లిక్విడిటీపరమైన సమస్యలేమైనా వస్తే పరిస్థితిని చక్కదిద్దేందుకు అవసరమైతే ఆర్బీఐ సత్వరం జోక్యం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. భారత్ విషయంలో స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభాలేమైనా వచ్చినా తట్టుకుని నిలబడగలదని కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. క్రెడిట్ సూసీ ఇటీవలి కాలంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సౌదీ ఇన్వెస్టరు మరిన్ని పెట్టుబడులు పెట్టబోమంటూ ప్రకటించడంతో రెండు రోజుల క్రితం క్రెడిట్ సూసీ బ్యాంకు షేరు భారీగా పతనమైంది. అయితే, స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) 54 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించడానికి ముందుకు రావడంతో మరుసటి రోజు మళ్లీ కోలుకుంది. భారత్‌లో విదేశీ బ్యాంకులకు కార్యకలాపాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దేశీయంగా అసెట్స్‌లో వాటి వాటా 6 శాతంగా ఉంది. అయితే, డెరివేటివ్ మార్కెట్లలో (ఫారెక్స్, వడ్డీ రేట్లు) మాత్రం అవి చురుగ్గా ఉంటున్నాయి. ఆయా మార్కెట్లలో విదేశీ బ్యాంకులకు 50 శాతం దాకా వాటా ఉంటోంది. -
క్రెడిట్ సూసీకి ‘స్విస్ బ్యాంక్’ భరోసా
న్యూఢిల్లీ: ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రెడిట్ సూసీకి స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు అండగా నిల్చింది. వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకుపై ఇన్వెస్టర్లు, డిపాజిటర్లలో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు, దానిపై నమ్మకాన్ని కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా 54 బిలియన్ డాలర్ల మేర రుణాన్ని అందించేందుకు అంగీకరించింది. క్రెడిట్ సూసీ గురువారం ఈ విషయం వెల్లడించింది. దీంతో బ్యాంకు షేరు ఒక దశలో ఏకంగా 33% ఎగిసి 2.17 స్విస్ ఫ్రాంకులకు (1 స్విస్ ఫ్రాంకు సుమారు రూ. 89) పెరిగింది. అటు యూరప్ బ్యాంకింగ్ షేర్లు కూడా ఒక మోస్తరుగా పెరిగాయి. మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఇన్వెస్టరు నిరాకరించారన్న వార్తలతో క్రెడిట్ సూసీ షేరు బుధవారం 30% కుప్పకూలిన సంగతి తెలిసిందే. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్వీబీ, సిగ్నేచర్) మూతబడటం, క్రెడిట్ సూసీ ఆర్థిక పరిస్థితిపై నీలినీడలు కమ్ముకోవడం తదితర పరిణామాలతో అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభం ముంచుకొస్తోందన్న ఆందోళన నెలకొంది. అయితే, ఈ భయాలను తొలగించేందుకు, అంతర్జాతీయంగా కీలక బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న క్రెడిట్ సూసీని నిలబెట్టేందుకు స్విస్ నేషనల్ బ్యాంక్ రంగంలోకి దిగింది. మూలధనం, లిక్విడిటీపరమైన నిబంధనలకు అనుగుణంగా క్రెడిట్ సూసీ ఉంటే బ్యాంక్‌కు అవసరమైన తోడ్పాటు అందిస్తామని ప్రకటించింది. -
దివాలా అంచున స్విస్ బ్యాంక్?
2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభానికి ముసలం బ్యాంకింగ్ రంగంలోనే మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమాన్ బ్రదర్స్ దివాలా తీయడంతో స్టాక్ మార్కెట్లు పేక మేడల్లా కుప్పకూలాయి. ఇప్పుడు సరిగ్గా మళ్లీ అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగానికి అలాంటి షాక్ తగలబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అనేక సమస్యలతో సతమతమవుతున్న స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్విస్... క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ స్వయంగా దాని సీఈఓ వెల్లడించడంతో దివాలా తీయొచ్చంటూ గగ్గోలు మొదలైంది. న్యూయార్క్: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సంస్థ సీఈవో ఉల్రిచ్ కోర్నర్ పేర్కొన్నారు. దీంతో తాజా పునర్వ్యస్థీకరణ చర్యలకు తెరతీయనున్నట్లు సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించారు. తద్వారా తగిన చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే బ్యాంక్ పటిష్టంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకు షేరు పతనాన్ని చూసి కలత చెందొద్దని కూడా సిబ్బందికి సూచించారు. పటిష్ట స్థాయిలో మూలధన బేస్‌తోపాటు లిక్విడిటీ కూడా బాగానే ఉందని సీఈవో వివరించారు. అయితే, ఒకపక్క బ్యాంకు షేరు రోజుకో ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకుతుండటం... దివాలా వదంతుల నేపథ్యంలో ఉల్రిచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల (అక్టోబర్) 27న బ్యాంక్ చేపట్టనున్న వ్యూహాత్మక సమీక్ష ఫలితాలు వెలువడేవరకూ సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు నిర్ణయించుకున్నట్లు సీఈవో లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మీడియాలో ఊహాగానాలకు స్పందించకుండా క్లయింట్లకు సేవలందించడంపై దృష్టిపెట్టాలని కూడా తమ సిబ్బందికి ఉల్రిచ్ సూచించినట్లు సమాచారం. కాగా, బ్యాంకు ఈ నెల 27న మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనుంది. మూడు ముక్కలు... మూడేళ్లుగా వెలుగుచూస్తున్న రకరకాల స్కామ్‌లు... క్రెడిట్ స్విస్‌ను అతలాకుతం చేశాయి. మరోపక్క, యూరప్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం సెగలు, వడ్డీరేట్ల పెంపు ప్రభావం కూడా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్రెడిట్ స్విస్ గ్రూపును మూడు సంస్థలుగా విడదీసేందుకు బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. లాభదాయకంగా ఉన్న యూనిట్లను విక్రయించాలనేది బ్యాంకు యోచన. ప్రతిపాదనల ప్రకారం అడ్వయిజరీ బిజినెస్, అధిక ఒత్తిడిలోగల ఆస్తుల (హైరిస్క్ రుణాల)తో బ్యాడ్ బ్యాంక్‌లను విడదీయనుంది. వీటిని మినహాయించగా మిగిలిన బిజినెస్‌లతో మరో సంస్థ ఏర్పాటు కానుంది. అయితే ఈ అంశాలపై క్రెడిట్ స్వీస్ స్పందించకపోవడం గమనార్హం! ఇదీ నేపథ్యం... స్విట్జర్లాండ్‌లోని రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ స్విస్ గత మూడేళ్లలో రహస్య (స్పైయింగ్) కార్పొరేట్ కుంభకోణం, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల మూసివేత, రికార్డ్ ట్రేడింగ్ నష్టాలు, న్యాయపరమైన వ్యాజ్యాల పరంపర వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో బ్యాంక్ చైర్మన్ యాక్సెల్ లేమన్ వేసవిలో ఉల్రిచ్ కోర్నర్ను సీఈవోగా ఎంపిక చేసి బ్యాంకును గాడిలోపెట్టే బాధ్యతలు అప్పగించారు. బ్యాంక్ నిర్వహణలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అనుమతించారు. కాగా.. ఈ నెల మొదట్లో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 5,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇన్వెస్టర్లలో వణుకు..! గత కొద్ది నెలలుగా క్రెడిట్ స్విస్ ఎదుర్కొంటున్న సవాళ్లతో బ్యాంకు షేరు కుప్పకూలుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో 9 డాలర్లుగా ఉన్న షేరు ధర తాజాగా సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి (3.9 డాలర్లు) దిగజారింది. మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కాగా, సీఈఓ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బ్యాంక్ దివాలా తీయనుందంటూ ట్విటర్లో మారుమోగుతోంది. అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచడంతో మాంద్యం భయాలు వెంటాడుతున్న తరుణంలో క్రెడిట్ స్విస్ దివాలా వార్తలు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే జరిగితే మార్కెట్ సెంటిమెంట్ మరింత బలహీనపడొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు ఎలా స్పందిస్తాయోన్న ఉత్కంట సర్వత్రా నెలకొంది. -
ప్రధాని మోదీ జీ.. అప్పుడిచ్చిన హామీ ఏమైంది?
విదేశాలలో మన నల్లధనం గుట్టలకొద్దీ మూలుగుతోందని, అదంతా తెచ్చి దేశ పౌరుల ఖాతాల్లో వేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పెద్ద నోట్ల రద్దుకు ముందు.. చెప్పారు. పెద్ద నోట్లు రద్దయ్యాయి కానీ, అకౌంట్లలో చిన్నమొత్తమైనా వచ్చి పడలేదు. ఎక్కడి నల్ల ధనం అక్కడే ఉండిపోతే ఎలా పడుతుంది. పన్నుల ఎగవేత, అవినీతి, గుప్తధనం అక్రమ రవాణా, నేర కార్యకలాపాలు, దొంగ రవాణా.. వీటివల్ల నల్లధనం జమ అవుతూ ఉంటుంది. 1956లో మన నల్ల ధనం దేశ జీడీపీలో 4.5 శాతం ఉండగా, 1980–83 మధ్య ఇది 18 నుంచి 21 శాతానికి పెరిగింది. 2012లో భారత్‌లో మొత్తం నల్లధనం పరిమాణం రూ.63 లక్షల కోట్లని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అరుణ్ కుమార్ అధ్యయనంలో వెల్లడయింది. అవినీతి నిరోధక చట్టం (1988), బినామీ లావాదేవీల చట్టం (1988), అక్రమ ధన చలామణి నిరోధక చట్టం (2002), లోక్‌పాల్, లోకాయుక్త చట్టాలు, ఆఖరికి పెద్ద నోట్ల రద్దు కూడా నల్లధన వ్యాప్తిని నిరోధించలేక పోయాయి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ‘అనుబంధం’ నల్లధనం ఉత్పత్తికి ప్రధాన కారణంగా చెబుతున్న సామాజిక అభివృద్ధి అధ్యయనవేత్తలు.. మరో ఇరవై ఐదేళ్లకైనా నల్లధనం ఉత్పత్తి, విస్తృతి తగ్గితే గొప్ప సంగతేనని అంటున్నారు. 2020లో న్యూజిలాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, సింగపూర్, నార్వే.. అతి తక్కువ అవినీతి గల దేశాలుగా నిలిచాయి. ఇది కూడా చదవండి: ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామి భారత్ -
పేదలను కాల్చుకు తింటున్నారు
(చేవెళ్ల నుంచి సాక్షి ప్రతినిధి): ’స్విస్ బ్యాంకులో అక్రమంగా దాచుకున్న ధనాన్ని తెచ్చి ప్రతివ్యక్తి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి, 10 పైసలు కూడా వేయలేదు. ప్రతియేటా 2 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామన్నారు. అదే జరిగితే 50 లక్షలమంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలి. రైతు ఆదాయం రెండింతలుకాదు కదా పండించిన పంటను కొనుగోలు చేసే దిక్కులేకుండా పోయింది. అన్ని నిత్యావసరాల ధరలను పెంచి కేంద్ర, రాష్ట్ర పాలకులు సామాన్యులను కాల్చుకు తింటున్నారు’అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వివరించారు. ఏఐసీసీ పిలుపులో భాగంగా ’నిత్యావసరాల ధరల పెరుగుదలపై నిరసన యాత్ర ’పేరుతో శనివారం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ దిగ్విజయ్‌సింగ్‌తో కలసి రంగారెడ్డి జిల్లా ముడిమ్యాలలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి చేవెళ్ల ఇందిరాగాంధీ విగ్రహం వరకు 10 కిలోమీటర్ల పాదయాత్రలో రేవంత్ పాల్గొన్నారు. అనంతరం చేవెళ్ల చౌరస్తాలో ఏర్పాటు చేసినసభలో ఆయన మాట్లాడుతూ మోదీ, కేసీఆర్ గద్దెనెక్కిన ఎనిమిదేళ్లలో రూ.60 ఉన్న పెట్రోల్ లీటర్‌కు రూ.110 అయిందని, రూ.450 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి అయిందని, ఒక్క పెట్రోల్ ధర రూపంలోనే మోదీ, కేసీఆర్ ఈ ఎనిమిదేళ్లలో రూ.32 లక్షల కోట్లను దోచుకున్నారని విమర్శించారు. చేవెళ్ల గడ్డ.. కాంగ్రెస్‌కు అచ్చొచ్చిన అడ్డా..! చేవెళ్ల గడ్డ కాంగ్రెస్ పార్టీకి అచ్చొచ్చిన అడ్డా అని, నాడు వైఎస్ ఇక్కడి నుంచే పాదయాత్ర చేపట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చారని రేవంత్ చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తెచ్చేందుకే తెలంగాణ సమాజం కాంగ్రెస్ పక్షాన నిలబడిందని చెప్పారు. చేవెళ్ల సభలో ఏ పార్టీ కౌకుంట్ల ఎంపీటీసీ కావలి సుజాతతోపాటు పలువురు రేవంత్, దిగ్విజయ్‌సింగ్‌ల సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ‘ఇక కాంగ్రెస్ నుంచి పోయేవారు లేరు. వచ్చేవారే రెడీగా ఉన్నారు. టీఆర్ఎస్ చెరువు తెగింది. టీఆర్ఎస్ వాళ్ల బతుకు చేవెళ్ల బస్టాండ్ అయింది’అని రేవంత్ వ్యాఖ్యానించారు. సభకు ముందు చేవెళ్ల చౌరస్తాలోని వైఎస్సార్, ఇందిరాగాంధీ, కె.వి.రంగారెడ్డిల విగ్రహాలకు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల పక్షాన పోరాడేది కాంగ్రెస్ పార్టీనే పెద్దఎత్తున పెరిగిన ధరలతో పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారని దిగ్విజయ్ సింగ్ అన్నారు.పెట్రోల్, డీజిల్, గ్యాస్, పప్పు, నూనె, యూరియా, డీఏపీ ధరలు పెరిగి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక ఉపాధి సంస్థలను అమ్మేస్తోందని ఆరోపించారు. దేశంలో పేదల పక్షాన పోరాడేది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పారు. -
స్విస్ బ్యాంకుల్లో బ్లాక్‌మనీపై స్పందించిన కేంద్రం
న్యూ ఢిల్లీ: చాలా రోజుల తరువాత బ్లాక్ మనీ అంశం పార్లమెంట్లో వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లలో స్విస్ బ్యాంకులో ఎంత నల్లధనం జమ అయ్యిందనే ప్రశ్నను కాంగ్రెస్ ఎంపీ విన్సెంట్ హెచ్. పాలా. ప్రభుత్వాన్ని అడిగారు. విదేశాల నుంచి స్వదేశానికి నల్లధనాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలపమని విన్సెంట్ పార్లమెంట్లో లేవనెత్తారు. అంతేకాకుండా బ్లాక్‌మనీ వ్యవహారంలో ఎంతమందిని అరెస్టు చేశారని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని అడిగారు. పార్లమెంట్లో కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. గత పదేళ్లలో భారత్ నుంచి స్విస్ బ్యాంకుల్లో జమచేసిన బ్లాక్‌మనీకి సంబంధించి అధికారికంగా అంచనా లేదని తెలియజేశారు. అయితే, విదేశాలలో నిల్వ చేసిన నల్లధనాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ‘‘ది బ్లాక్ మనీ ఇంపోసిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్-2015’’ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం విదేశాలలో బ్లాక్‌మనీ జమచేసిన వారి కేసులపై సమర్థవంతంగా వ్యవహరిస్తుంది. బ్లాక్‌మనీపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు ఛైర్మన్, వైస్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు వ్యవహరిస్తారు. ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో భారత్ కలిసి పనిచేస్తోంది. బ్లాక్ మనీ యాక్ట్ కింద ఇప్పటివరకు 107 ఫిర్యాదులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్లాక్ మనీ యాక్ట్ సెక్షన్ 10 (3) / 10 (4) ప్రకారం, 2021 మే 31 వరకు 166 కేసులలో అసెస్మెంట్ ఆర్డర్లను జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. కాగా ఇందులో రూ .8,216 కోట్లు రికవరీ చేశామని కేంద్రం తెలిపింది. -
భారతీయల స్విస్ సంపదపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధనంపై వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఖండించింది. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో గత 13 ఏళ్లతో పోలిస్తే రికార్డు స్థాయిలో డిపాజిట్లు 2020లో చేసినట్లు ఆరోపణలు రాగా కేంద్రం ఈ వార్తలను తోసిపుచ్చింది. స్విస్ నల్లధనం.. అసలు కథేంటి ఈ వార్తలో ఏముందంటే.. 2019లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ధనం 6625 కోట్లుగా ఉండగా, గత ఏడాది ఏకంగా 20 వేల కోట్లకు చేరినట్లు ఓ మీడియా కథనం పేర్కొంది. కాగా ఈ వార్తపై కేంద్ర ఆర్థిక మంత్రి కార్యాలయం స్పందిస్తూ.. స్విస్ నేషనల్ బ్యాంక్‌కు వివిధ స్విస్ బ్యాంకులు సమర్పించిన మొత్తం లెక్కలు తప్పుగా చిత్రీకరించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అది కేవలం స్విట్జర్లాండ్‌లో దాచుకున్న భారతీయుల సొమ్ము కాదు అని వెల్లడించింది. ఇదే క్రమంలో 2019 నుంచి స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గినట్లు కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. అయితే స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన భారతీయల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయం తెలిపింది. డిపాజిట్లు తగ్గినట్లు చెప్తున్న ప్రభుత్వం, ఎంత మొత్తం అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తొలి రెండు స్థానాల్లో బ్రిటన్, అమెరికా మొత్తం స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో సుమారు 2 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌లకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 600 బిలియన్ డాలర్లు ఫారన్ కస్టమర్ డిపాజిట్లుగా ఉన్నాయన్నారు. 377 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌తో బ్రిటన్ ముందు నిలవగా, 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. ✅Finance Ministry refutes News media reports of alleged black money held by Indians in Switzerland ✅Information sought from Swiss Authorities to verify increase/decrease of deposits Read more➡️ https://t.co/W1fKhlh7LR (1/6) pic.twitter.com/tPUOciARJR — Ministry of Finance (@FinMinIndia) June 19, 2021 చదవండి: మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా జస్ప్రీత్ బుమ్రా..! -
భారతీయుల ‘స్విస్’ సంపద మూడింతలు
న్యూఢిల్లీ/జూరిచ్: భారతీయలు, భారత కంపెనీల సంపద స్విస్ బ్యాంకుల్లో 2020 చివరికి వార్షికంగా మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు (దాదాపు రూ.20,700 కోట్లు) చేరింది. 2019 ముగిసే నాటికి ఈ విలువ 899 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ (దాదాపు రూ.6,625 కోట్లు). రెండు సంవత్సరాల దిగువముఖం తరువాత 2020లో తిరిగి ఇండియన్ క్లైంట్స్ నిధులు ఏకంగా 13 సంవత్సరాల గరిష్టానికి చేరాయి. బాండ్లు, తత్సంబంధ ఇన్స్ట్రుమెంట్లలో (పథకాలు) ఉంచిన సంపద భారీగా పెరగడం దీనికి కారణం. కాగా, కస్టమర్ డిపాజిట్లు మాత్రం 2020లో పడిపోయాయి. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న బ్రాంచీలు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల ద్వారా భారతీయులు, భారత్ కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో ఉంచిన నిధుల గణాంకాలను స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గురువారం విడుదల చేసింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2006లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల నిధులు 6.5 బిలియన్ డాలర్లు. 2011, 2013, 2017సహా కొన్ని సంవత్సరాలను మినహాయిస్తే మిగిలిన కాలాల్లో ఈ పరిమాణాలు డౌన్ ట్రెండ్‌లోనే నడిచాయి. ► 2020లో కస్టమర్ అకౌంట్ డిపాజిట్లు 503.9 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.4,000 కోట్లు). 2019లో ఈ మొత్తం 550 మిలియన్ ఫ్రాంక్స్. ► గణాంకాల ప్రకారం, 2020 చివరినాటికి స్విట్జర్లాండ్‌లో 243 బ్యాంకులు పనిచేస్తున్నాయి. నల్లధనంపై లేని సమాచారం స్విట్జర్లాండ్‌లో భారతీయులు ఉంచినట్లు పేర్కొంటున్న తీవ్ర చర్చనీయాంశం ‘నల్లధనం’ గురించి గణాంకాల్లో ఎటువంటి ప్రస్తావనా లేదు. పైగా భారతీయులు స్విట్జర్లాండ్‌లో ఉంచిన నిధులను ‘నల్లధనం’గా పరిగణించబోమని ఆ దేశం తరచూ పేర్కొంటోంది. పన్ను ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి కేసుల విషయంలో విచారణకు భారత్‌కు మద్దుతు, సహకారం ఇస్తామని కూడా స్పష్టం చేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించి రెండు దేశాల మధ్య 2018 నుంచీ ఒక అవగాహనా ఒప్పందం కూడా అమల్లో ఉంది. ఈ మేరకు తమ దేశంలో భారతీయుల అకౌంట్ల సమాచారాన్ని 2019 సెప్టెంబర్‌లో మొట్టమొదటిసారి అందజేసింది. ప్రతి సంవత్సరం ఈ విధానాన్ని కొనసాగిస్తోంది. తొలి రెండు స్థానాల్లో బ్రిటన్, అమెరికా అన్ని స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో దాదాపు 2 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌లకు చేరాయి. ఇందులో 600 బిలియన్ డాలర్లు ఫారన్ కస్టమర్ డిపాజిట్లు. 377 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌తో బ్రిటన్ ముందు నిలిచింది. ఇందుకు సంబంధించి 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. 100 బిలియన్ ఫ్రాంక్స్ పైన నిలిచిన దేశాలు ఈ రెండే కావడం గమనార్హం. -
నల్ల కుబేరులకు ‘స్విస్’ నోటీసులు
న్యూఢిల్లీ/బెర్న్: స్విస్ బ్యాంకు ఖాతాల్లో నల్లధనం దాచుకున్న వారికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతున్నాయి. తాజాగా 11 మంది భారతీయులకు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ తాఖీదులు జారీ చేసింది. వారి ఖాతాల వివరాలను భారత ప్రభుత్వానికి అందజేయనున్నామని, దీనిపై అభ్యంతరాలేమైనా ఉంటే వెంటనే స్పందించాలని సూచించింది. అప్పీల్ చేసుకోవడానికి ఇదే ఆఖరు అవకాశమని స్పష్టం చేసింది. వీరిలో కృష్ణ భగవాన్ రామ్‌చంద్, కల్పేష్ హర్షద్ కినారివాలా మొదలైన వారి పేర్లు ఉన్నాయి. మిగతా వారి పేర్లను కేవలం పొడి అక్షరాలతో మాత్రమే స్విస్ ప్రభుత్వం తన గెజిట్ నోటిఫికేషన్లో ప్రస్తావించింది. దశాబ్దాలుగా నల్ల కుబేరులకు స్విస్ బ్యాంకులు ఊతంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే, నల్లధనంపై పోరులో భాగంగా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో స్విట్జర్లాండ్ ఈ చర్యలు చేపట్టింది. మార్చి నుంచి స్విస్ బ్యాంకుల భారతీయ క్లయింట్స్‌కు 25 నోటీసులు దాకా జారీ అయినట్లు సమాచారం. -
స్విస్ బ్యాంకుల్లో మనోళ్ల డిపాజిట్లు తగ్గాయి
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2017లో పెరగలేదు. సరికదా 34.5 శాతంమేర పడిపోయాయి. 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్విస్ బ్యాంకుల్లో డబ్బు 80 శాతం తగ్గినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్ గోయల్ స్వయంగా మంగళవారం పార్లమెంటుకు లిఖిత పూర్వక సమాధానం రూపంలో తెలిపారు. సెంట్రల్ బ్యాంకుల అంతర్జాతీయ సంస్థ– బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) గణాంకాలను ఉటంకిస్తూ మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. స్విస్ బ్యాంకుల్లో మూడు సంవత్సరాల నుంచి తగ్గుతూ వచ్చిన భారతీయుల డిపాజిట్లు 2017లో 50 శాతం పెరిగి 1.01 బిలియన్ స్విస్ ఫ్రాంక్ (రూ.7,000 కోట్లు)లుగా ఉన్నాయని స్విస్ నేషనల్ బ్యాంకు ఇటీవలే ప్రకటించింది. ఈ వార్తలను మంత్రి గోయల్ ప్రస్తావిస్తూ, ఇవి తప్పని స్విస్ అధికారులే పేర్కొన్నారని తెలిపారు. స్విస్ డిపాజిట్లకు బీఐఎస్ గణాంకాలే తగిన ఆధారమని ఆయన వివరించారు. భారతీయుల డిపాజిట్ల మొత్తం అది: ఎస్ఎన్బీ అయితే, తాము ఇటీవల వెల్లడించిన భారతీయుల డిపాజిట్ల గణాంకాలు నిజమేనని స్విస్ నేషనల్ బ్యాంకు తాజాగా స్పష్టం చేసింది. ఈ గణాంకాలు భారతీయ కస్టమర్లు, బ్యాంకులు, సంస్థలకు సంబంధించిన మొత్తమని తెలిపింది. భారత్‌లోని స్విస్ బ్యాంకు శాఖల్లోని డిపాజిట్లను కూడా కలిపి చెప్పామని వివరించింది. ఈ నేపథ్యంలో బీఐఎస్ గణాంకాలు మరితం ఆధారపడతగినవిగా పేర్కొంది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌సూసే ప్రస్తుతం మన దేశంలో ఒక బ్యాంకు శాఖను కలిగి ఉంది. అలాగే, ఆ దేశానికి చెందిన యూబీఎస్, జుర్చెర్ కంటోనల్ బ్యాంకు మాత్రం రిప్రజెంటేటివ్ కార్యాలయాన్ని కలిగి ఉన్నాయి. -
ఎవరివీ 300 కోట్లు?
స్విస్ బ్యాంకులో భారతీయులకు సంబంధించిన ఖాతాల్లో దాదాపు 300 కోట్ల రూపాయాలు మురిగిపోతున్నాయి. ముగ్గురు భారతీయులు, మరో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన ఖాతాల్లో ఈ 300 కోట్లు ఉన్నాయని స్విస్ బ్యాంక్ తాజా జాబితాలో పేర్కొంది. చాలా కాలంగా ఎలాంటి లావాదేవీలు జరగని, ఖాతాలో సొమ్మును క్లెయిమ్ చేసుకోని ఖాతాలు 3500కుపైగా ఉన్నాయని అంబుడ్స్‌మన్ తెలిపింది. తమ బ్యాంకుల్లో చాలా కాలం పాటు లావాదేవీలేమీ నిర్వహించని ఖాతాల వివరాలను అంబుడ్స్‌మన్ మొదటి సారిగా 2015లో ప్రకటించింది. ఆ తర్వాత నుంచి ఇలాంటి ఖాతాల్లో ఏ ఖాతాకు సంబంధించి అయినా లావాదేవీలు జరిగినా, సదరు ఖాతా తమదేనని ఎవరైనా సాక్ష్యాధారాలతో సహా నిరూపించుకున్నా, వాటిని జాబితా నుంచి తీసివేసి తాజా జాబితాను ప్రతి ఏడూ విడుదల చేస్తోంది.మూడేళ్లుగా స్విస్ బ్యాంక్ అంబుడ్స్‌మన్ ఈ జాబితాను ప్రకటిస్తున్నా ఇంత వరకు దానిలోని భారతీయ ఖాతాలకు సంబంధించి ఎలాంటి తీసివేతలూ లేవు.అంటే భారతీయులెవరూ ఆ ఖాతాలు తమవేనని నిరూపించుకోవడం లేదన్న మాట. -
స్విస్ డిపాజిట్లకు ముందుకురాని యజమానులు
జ్యూరిచ్/న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల్లోని డిపాజిట్లను క్లెయిమ్ చేసుకునే వారు కరువయ్యరు. స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ 2015 డిసెంబర్లో అక్కడి బ్యాంకుల్లో అచేతనంగా ఉన్న ఖాతాలు లేదా క్లెయిమ్ చేసుకోకుండా ఉన్నవాటి వివరాలతో కూడిన జాబితా విడుదల చేసింది. వీటిలో స్విట్జర్లాండ్ పౌరులతో పాటు విదేశీయులవి, భారతీయులకు సంబంధించిన ఖాతాలు కూడా ఉన్నాయి. కానీ, ఇంత వరకు వాటికి సంబంధించి ఏ మాత్రం పురోగతి లేదు. ఈ ఖాతాల అసలు యజమానులు లేదా వారి చట్టబద్ధమైన వారసులు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుగా నాడు జాబితాను విడుదల చేయడం జరిగింది. 3,500 ఖాతాలకు గాను కనీసం ఓ 6 భారతీయులకు సంబంధించినవి ఉన్నాయి. క్లెయిమ్ వస్తే గనుక సంబంధిత ఖాతాలను జాబితా నుంచి తొలగిస్తున్నారు. 2017లో కేవలం 40 ఖాతాలకు సంబంధించి క్లెయిమ్‌లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలకు చెందిన వారు స్విస్ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున డిపాజిట్లను దాచుకున్న విషయం గమనార్హం. అయితే, అంతర్జాతీయంగా నల్లధనంపై చర్యలు తీవ్రతరం కావడంతో స్విట్జర్లాండ్ భారత్ సహా పలు దేశాలతో సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేందుకు ఒప్పందాలు చేసుకుంది. స్విస్ నేషనల్ బ్యాంకు తాజా గణాంకాల ప్రకారం 2017లో భారతీయులకు సంబంధించిన ఖాతాల్లో రూ.7,000 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. -
అక్కణ్ణుంచి మన డబ్బు వెనక్కి తెస్తా!
‘‘ఎంత మంది మనల్ని వ్యతిరేకిస్తున్నారన్నది ముఖ్యం కాదు. మనం ఏం చేయాలనుకుంటున్నామన్నదే ముఖ్యం. ఎవరేమన్నా నేను ముందుకు వెళతాను. అన్ని వ్యతిరేకతలను తీసుకోవడానికి నేను సిద్ధం. ఎదుర్కోవడానికి కూడా సిద్ధమే’’ అని కమల్‌హాసన్ అన్నారు. కమల్‌హాసన్ ‘నర్పణి ఇయక్కమ్’ (వెల్ఫేర్ అసోసియేషన్) 39వ వార్షికోత్సవం చెన్నైలో జరిగింది. ఈ సమావేశంలో కమల్ తాను రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్నారు. ‘‘నేను రాజకీయల్లోకి వస్తాను. పొలిటికల్ పార్టీ పెడతాను. స్విస్ బ్యాంక్‌లో నేను డబ్బు దాచుకోలేదు. అక్కడ ఉన్న మన డబ్బును వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తాను’’ అన్నారు. పొలిటికల్ పార్టీ కార్యకలాపాలు సజావుగా జరగడానికి ఓ మొబైల్ యాప్‌ని రూపొందించారట. పుట్టినరోజు (ఈ నెల 7)నాడు ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. పార్టీకి ఫండ్ ఇవ్వాలనుకుంటే ఆ వివరాలు ఈ యాప్‌లో ఉంటాయట. బర్త్‌డే నాడు ‘విశ్వరూపం–2’ ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలనుకుంటున్నారట. -
స్విస్ బ్యాంకులో మన డిపాజిట్లు ఎందుకు తగ్గాయి?
న్యూఢిల్లీ: దేశంలో నల్లడబ్బును అరికట్టేందుకు వివిధ చర్యలు తీసుకోవడంతోపాటు విదేశాల్లో దాస్తున్న నల్లడబ్బును కూడా నియంత్రించేందుకు ఆయా దేశాలతో పాత చట్టాలను బలోపేతం చేసుకోవడం, కొత్త చట్టాలను తీసుకురావడం మంచి ఫలితాలనిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక జీఎస్టీ ప్రారంభోత్సవం రోజున (జూలై 1న) చెప్పారు. స్విస్ బ్యాంక్‌లో 2016 సంవత్సరానికి భారతీయుల డిపాజిట్లు అంతకుముందు సంవత్సరం కన్నా సగానికి సగం పడిపోవడమే అందుకు ఉదాహరణగా చూపారు. 2015 సంవత్సరంలో స్విస్ బ్యాంకులో భారతీయుల డిపాజిట్లు 8,135 కోట్ల రూపాయలు ఉండగా, 2016, జూన్ నాటికి 4,482 కోట్ల రూపాయలకు పడిపోయాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లనే స్విస్ బ్యాంక్‌లో మన భారతీయుల డిపాజిట్లు తగ్గాయా? ఏ ఏడాది నుంచి డిపాజిట్లు తగ్గుతున్నాయి? దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏమైనా ఉందా? తగ్గటానికి ఇతరత్రా కారణాలు ఇంకేవైనా ఉన్నాయా? స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన భారతీయ డిపాజిట్లు 2016 జూన్ నెల నాటివి. అదే సంవత్సరం నవంబర్ నెలలో పెద్ద నోట్లను మోదీ ప్రభుత్వం రద్దు చేసినందున వాటి ప్రభావం ఉండే అవకాశమే లేదు. ఇక స్విట్జర్లాండ్ ఆటోమేటిక్‌గా ప్రతి ఏటా భారత ప్రభుత్వానికి స్విస్ ఖాతాల్లో భారతీయుల డిపాజిట్ల వివరాలను అందుజేసేందుకు ఆ ప్రభుత్వంతో మోదీ ప్రభుత్వానికి 2016, నవంబర్ 22న ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2018, సెప్టెంబర్ నెల నుంచి మాత్రమే అమల్లోకి వస్తుంది. పైగా ఈ ఒప్పందంలో పెద్ద మెలిక ఉంది. 2018, సెప్టెంబర్ నెలకు ముందున్న బ్యాంకు డిపాజిట్ వివరాలను వెల్లడించే ప్రసక్తే లేదు. 2018, సెప్టెంబర్ నెల నుంచి మాత్రమే, అది అప్పటికున్న అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయుల బ్యాంకు లావాదేవీల వివరాలను అందజేస్తుంది. అంటే మొదటిసారిగా ఖాతా వివరాలు 2019, సెప్టెంబర్ నెలలో మాత్రమే భారత్‌కు అందుతాయి. డిపాజిట్‌దారుల పేర్లను ఎట్టి పరిస్థితుల్లో బహిర్గతం చేయమన్న షరతుతోనే స్విస్ ఈ ఒప్పందానికి అంగీకరించింది. పైగా ఇలాంటి ఒప్పందం స్విట్జర్లాండ్‌తో ఒక్క భారత్ దేశమే కాదు. మొత్తం 40 దేశాలు చేసుకున్నాయి. 2016, జూన్ నాటికి స్విస్ ఖాతాల్లో భారతీయుల డిపాజిట్లు 4,482 రూపాయలకు పడిపోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి చర్యలకు సంబంధం లేదు. మరి డిపాజిట్లు ఎందుకు పడిపోతున్నాయి. గతంలో 2012లో ఒక్కసారి పడిపోగా ఆ తర్వాత 2014, 2015, 2016 సంవత్సరాల్లో వరుసగా భారతీయుల డిపాజిట్లు పడిపోతూ వస్తున్నాయి. పన్నుకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో పారదర్శకతను కోరుకునే అంతర్జాతీయ సంస్థ ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్’ 2014లోనే స్విస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొంది. ఈ ఒప్పందంపై భారత్ సహా 50 దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఈ 50 దేశాలకు చెందిన ఖాతాదారుల లావాదేవీల వివరాలను స్విస్ బ్యాంక్ ఆయా దేశాలకు అందజేయాల్సి ఉంటుందని ఆ సంస్థ హెడ్ మోనికా భాటియా తెలిపారు. ఆ ఒప్పందం ప్రభావం వల్లనే భారతీయుల డిపాజిట్లు సగానికి సగం తగ్గి ఉంటాయని ఆర్థిక నిపుణుల భావిస్తున్నారు. -
స్విస్ బ్యాంకుల్లో భారీగా తగ్గిన భారతీయుల డబ్బు
♦ 2016లో రూ.4,500 కోట్లు ♦ ఏడాదిలో సగానికి సగం డౌన్ జ్యూరిచ్, న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము కనిష్ట స్థాయికి పడిపోయింది. 2015తో పోల్చితే 2016లో ఈ డబ్బు సగానికి సగం పడిపోయి, రూ. 4,500 కోట్లుగా(676 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్) నమోదయ్యింది. విదేశాల్లో ఉన్న నల్లడబ్బును తీసుకురావడానికి సంబంధించి భారత్‌లో పెరుగుతున్న ఒత్తిడి, ఈ దిశలో కేంద్రం ప్రయత్నాల వంటి నేపథ్యంలో వెలువడిన గణాంకాలు ఇవి. అయితే 2016లో ప్రపంచవ్యాప్తంగా విదేశీ క్లెయింట్ల డబ్బు స్విస్ బ్యాంకుల్లో పెరగడం విశేషం. ఈ మొత్తం దాదాపు రూ.96 లక్షల కోట్లకు(1.42 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్) చేరడం గమనార్హం. 2015లో ఈ మొత్తం 1.41 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్. స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ)తాజా గణాంకాల ప్రకారం... భారతీయులకు స్విస్ బ్యాంకుల్లో ప్రత్యక్షంగా ఉన్న మొత్తం 664.8 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్. ట్రస్టీల రూపంలో ఉన్న మొత్తం 11 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్. వరుసగా మూడేళ్ల నుంచీ స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు తగ్గుతూ వస్తోంది. 1987 నుంచీ స్విస్ తన బ్యాంకుల్లో విదేశీయుల డబ్బు గణాంకాలను ప్రకటిస్తోంది. ఆతర్వాత భారతీయుల డబ్బు ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. 2006 మధ్య నెలల్లో ఇక్కడ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు రికార్డు స్థాయి రూ.23,000 కోట్లకు చేరడం గమనార్హం. -
విదేశాల్లోని నల్లధనాన్నీ మోదీ రప్పిస్తారు
విశాఖ అవగాహన సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్య సాక్షి, విశాఖపట్నం: విదేశాల్లోని నల్లధనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రప్పిస్తారని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్లధనం వెలికితీతపై తొలి తీర్మానం, పోలవరం ప్రాజెక్టుపై మలి తీర్మానం చేశారని, అప్పట్నుంచే ప్రధాని నల్లధనంపై యుద్ధానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. స్విట్జర్లాండ్‌తో కుదుర్చుకున్న చారిత్రక ఒప్పందంతో స్విస్ బ్యాంక్ ఖాతాల్లో దాచుకున్న భారతీయుల నల్లధనం వివరాలు త్వరలోనే వెల్లడవుతాయన్నారు. ‘నల్లధనంపై మోదీ సమరం..’ పేరిట పెద్దనోట్ల మార్పిడిపై శుక్రవారం సాయంత్రం విశాఖ బీజేపీ కార్యాలయంలో జరిగిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక అసమానతల్ని సరిచేయడానికే ప్రధాని పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇది అన్నాహజారే స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయమన్నారు. మోదీ తిరుగుబాటుదారుడని, పరిస్థితులతో రాజీపడరని, గుజరాత్లో మూడు దఫాలు ఆ పట్టుదలతోనే విజయం సాధించారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు చర్య వల్ల వేలాదిమందికే నష్టమని, కోట్లాదిమంది పేద, మధ్యతరగతి వారికి లాభం చేకూరుతుందన్నారు. -
ఎన్ఎస్జీ సభ్యత్వానికి స్విస్ బాసట
భారత్‌కు మద్దతుగా నిలిచిన స్విట్జర్లాండ్ - నల్లధనం వెలికితీతకు సహకారం - భారత్‌కు ఉన్నతాధికారిని పంపనున్న స్విస్ - దేశాధ్యక్షుడు ష్నీడర్‌తో మోదీ భేటీ జెనీవా/వాషింగ్టన్: భారత దౌత్యంలో కీలక ఘట్టం. అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం పొందేందుకు భారత్‌కు కీలక దేశమైన స్విట్జర్లాండ్ మద్దతు పలికింది. సోమవారం స్విస్ పర్యటన ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశం మద్దతు కూడగట్టడంలో విజయం సాధించారు. అలాగే స్విస్ బ్యాంకుల్లో పోగైన భారతీయుల నల్లధనాన్ని వెలికితీయడంలో పరస్పరం సహకారం కోసం ఇరుదేశాలు అంగీకరించాయి. స్విస్ అధ్యక్షుడు జోవాన్ ష్నీడర్ అమ్మన్‌తో మోదీ సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై సమగ్ర చర్చలు జరిపారు. అనంతరం ష్నీడర్, మోదీలు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి మద్దతిస్తామని ష్నీడర్ ప్రకటించారు. ‘అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంలో భారత కృషి అమోఘం. ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మా దేశం క్రియాశీలక మద్దతిస్తుంది’ అని చెప్పారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం పొందడంలో పరస్పరం సహకరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయన్నారు. భారత్‌ను అర్థం చేసుకొని బాసటగా నిలిచినందుకు ష్నీడర్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం(ఎఫ్టా)లోని దేశాలైన స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లీచ్టన్స్టీన్లతో స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చించేందుకు భారత్ సన్నద్ధంగా ఉందన్నారు. భారత అవసరాలకు అనుగుణంగా స్విస్ వృత్తి, విద్య శిక్షణ వ్యవస్థను మలిచేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. ఇరుదేశాల ప్రజల మధ్య పటిష్ట బంధాల కోసం ఈ ఏడాదిలో స్విస్ జాతీయుల కోసం ఈ-టూరిస్ట్ వీసా సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. భారత్‌కు రండి.. స్విస్ సీఈఓలతో సమావేశంలో మోదీ మాట్లాడుతూ.. భారత్ ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. భారత్‌లో 2-3 స్విట్జర్లాండ్లను నిర్మించాలని కోరుకుంటున్నామని చెప్పారు. భారత రైల్వే, ఇతర మౌలిక వసతులను స్విస్ టెక్నాలజీతో అభివృద్ధి చేయాలని, దీనికోసం తాము స్విస్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ‘ఎన్నో స్విస్ కంపెనీల ఉత్పత్తులు భారత్‌లోని ముంగిళ్లలో ఉన్నాయి. ఈ వాణిజ్య అనుబంధాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని భారత ఆర్థిక వృద్ధిలో పాలుపంచుకునేందుకు మరిన్ని స్విస్ కంపెనీలు ముందుకు రావాలి’ అని స్విస్ వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్‌లోని 125 కోట్ల మంది ప్రజానీకంతో యావత్ ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. స్విస్‌లో భారత్ సినిమాలు భారత చిత్రసీమకు స్విస్ ప్రముఖ గమ్యస్థానమని మోదీ ప్రత్యేకంగా చెప్పారు. ‘భారత సినీ పరిశ్రమ స్విస్ అందాలను మా ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. రొమాంటిక్ గీతాల చిత్రీకరణ కోసం బాలీవుడ్ స్విట్జర్లాండ్‌కు వస్తోంది’ అని చెప్పారు. అలాగే స్విట్జర్లాండ్ దేశస్తులు పెద్దసంఖ్యలో భారత్‌ను సందర్శించాలని కోరారు. స్విస్ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో జతకట్టి సానియా మీర్జా, లియాండర్ పేస్లు ఎన్నో గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సాధించారని కొనియాడారు. ఇలా ఉమ్మడి లక్ష్యాలు, విలువలు, ప్రజల అనుసంధానత, పటిష్ట వాణిజ్య భాగస్వామ్యం కలిసి సంబంధాలను కొత్త శిఖరాలకు చేరుస్తాయన్న నమ్మకముందని మోదీ చెప్పారు. అమెరికాకు మోదీ .. ఐదు దేశాల పర్యటనలో భాగంగా స్విస్ పర్యటన ముగించుకొని మోదీ అమెరికాకు వెళ్లారు. మంగళవారం వాషింగ్టన్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఆ దేశాధ్యక్షుడు ఒబామాతో మోదీ సమావేశమవుతారు. ఆ తర్వాత మోదీ గౌరవార్థం ఒబామా విందు ఇస్తారు. వీరిద్దరు భేటీకానుండటం ఇది ఆరోసారి. ఈనెల 8న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. మోదీ పర్యటన ఇరుదేశాల సంబంధాల్లో చిరస్థాయిలో నిలిచిపోతుందని వైట్‌హౌస్ కొనియాడింది. . ఎన్ఎస్జీ లో స్విస్ మద్దతు కీలకం ఎన్ఎస్జీలో 48 సభ్యదేశాలున్నాయి. అణురంగానికి సంబంధించిన కీలక అంశాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది.అణు సాంకేతికత, వాణిజ్యం, ఎగుమతి చేసేందుకు సభ్యదేశాలను అనుమతిస్తుంది. భారత అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ట్రాక్ రికార్డును చూసి అమెరికాతోపాటు ఎన్ఎస్జీలోని పలు దేశాలు భారత్‌కు బాసటగా ఉన్నాయి. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో భారత్‌కు స్విస్ మద్దతు కీలకం. ఒక్క దేశం వ్యతిరేకంగా ఉన్నా ఎన్ఎస్జీ సభ్యత్వానికి ఇబ్బందే. సభ్యత్వం కోసం కొన్నేళ్లుగా శ్రమిస్తున్న భారత్ గత నెల 12న అధికారికంగా దరఖాస్తు చేసింది. ఈ అంశం ఈనెల 9న వియన్నాలో, 24న సియోల్‌లో జరగనున్న ఎన్ఎస్జీ ప్లీనరీ సమావేశాల్లో చర్చకు రానుంది. ఈనేపథ్యంలో చైనాతోనూ భారత్ సంప్రదింపులు జరుపుతోంది. నల్లధనం వెలికితీతకు... నల్లధనం, పన్ను ఎగవేత అంశాలు ఇరుదేశాలకు ప్రాథమ్యాలని, వీటిపై ఉమ్మడి పోరాటం చేస్తామని మోదీ చెప్పారు. పన్నుఎగవేతదారులను చట్టం ముందు నిలబెట్టేందుకు అవసరమైన సమాచారాన్ని వేగవంతంగా బదిలీ చేసుకోవడంపై చర్చించామన్నారు. నల్లధనం వెలికితీతకు సంబంధించిన తమ ఉన్నతాధికారిని భారత్‌కు పంపేందుకు స్విట్జర్లాండ్ అంగీకరించడం గమనార్హం. ఈనెల 14న ఆ దేశ కార్యదర్శి ఢిల్లీకి రానున్నారు. విదేశాల్లో పోగైన నల్లధనాన్ని రప్పిస్తామని మోదీ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీ నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. -
'చట్టం'తో ఓటు హక్కుకు కత్తెర
రెండోమాట పార్లమెంటు సభ్యులలో సుమారు 300 పైచిలుకు యథావిధిగా అవినీతికి ఏతమెత్తగా, మరికొన్ని వందల మంది స్విస్ బ్యాంకుల్లో 24 లక్షల కోట్ల రూపాయల్ని అక్రమంగా దాచారు. ఇంకొన్ని వందల మంది శాసనసభ్యులు నేరగాళ్లుగా నమోదై ఉన్నవాళ్లు. ఇలాంటి 'ప్రజా ప్రతినిధులే'ఈ దేశ 'ప్రజాస్వామ్య'రక్షణకు 'పూచీ'పడుతున్నంత కాలం, ఈ వింత దృశ్యాన్ని ఆసక్తితో తిలకిస్తున్న ప్రభుత్వాలు, పాలకులున్నంత కాలం 'నిరక్షరాస్యత'నుంచి సామాన్య ప్రజలు విమోచన పొందడం అసాధ్యం! ఈ సత్యాన్ని న్యాయమూర్తులు గుర్తిస్తే చాలు. ఒకవైపున ఉత్తరప్రదేశ్‌లోని ఓ మారుమూల గ్రామం (మన్సూర్పూర్ మాఫీ) పంచాయతీ చరిత్రలోనే మొదటిసారిగా సంభవించిన అసాధారణ పరిణామానికి అంకురార్పణ జరిగిన మరుసటి రోజునే (10.12.2015) కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు ఒకటి వెలువడటం విశేషం! ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలోని ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ (గ్రామ్ ప్రధాన్) పదవికి జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా మహిళలు ఆ రోజున (9.10.2015) తమ ఓటు హక్కును, పోటీ చేసే హక్కును నిలబెట్టుకోడానికి ముందుకు రావటం, తెగించి వినియోగించుకోవడం ఒక చారిత్రక సన్నివేశం! మన్సూర్పూర్ మాఫీ దేశ రాజధాని ఢిల్లీకి 150 కిలోమీటర్లు, యూపీ రాజధాని లక్నోకు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామంలోని మైనారిటీలకు చెందిన మహి ళలు పంచాయతీ ఎన్నికల్లో ఓటు చేయకుండా మగాళ్లు అడ్డుకునే వారు. అయితే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వారు ఓటు వేయడాన్ని అనుమతించేవారు. కాని ఈసారి పంచాయతీ అధ్యక్ష పదవిని స్త్రీలకు కేటా యించారు. అయినా, మహిళలు ఓటు వేయడానికి వీల్లేదని పురుషులంతా అడ్డుకున్నారు! ఉన్నతాధికారుల జోక్యం తర్వాత కొందరు మహిళలు తెగించడంతో కొంత ఫలితం కలిగింది. ఓటు వేయగలిగిన వారు కేవలం తొమ్మిది మందే! ఆ మాత్రం ప్రోత్సాహంతోనే, వచ్చే ఎన్నికల్లో గ్రామ మహిళలంతా ఓటింగ్‌లో పాల్గొనేట్టు చేస్తామని గ్రామీణులు హామీ పడ్డారు! సంభాల్ జిల్లాలో మొత్తం సగటు అక్షరాస్యత 57 శాతం ఉన్నా పురుషుల అహంకారం వల్ల మహిళలు ఓటు హక్కు వినియోగించుకోడానికి తీవ్ర విఘాతం కలిగింది! బహుజన స్త్రీపురుషుల హక్కుల హరణానికే ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే- రాజ్యాంగం ప్రజలకు కల్పించిన సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కును మింగేసేలా హరియాణా పంచాయతీ రాజ్ సవరణ చట్టం (2015) వచ్చింది కాబట్టి. దీని ప్రకారం ఏ నిరక్షరాస్యులైన స్త్రీ, పురుషులూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు! అంటే, ప్రజాబాహుళ్యంలోని నిరక్షరాస్యులుగా ఉన్న వారందరి ఎన్నికల్లో పోటీకి నిలబడే హక్కుకూ, తద్వారా ఓటు హక్కుకు 'కత్తెర'వేయడం అవసరమని నేటి బీజేపీ పాలకులు భావిస్తున్నారు! అందుకే ఈ కొత్త చట్టం విన్యాసాలు, కొత్త రకం 'కొలబద్దలూ' ప్రాథమిక విద్యను, ప్రాథమిక వైద్య, ఆరోగ్య రంగాలను భారీ ఎత్తున ప్రైవేటీకరించి ఇప్పటికే పాలకులు సామాన్య ప్రజాబాహుళ్యానికి అవి అందుబాటులో లేకుండా చేశారు. దీని పర్యవసానమే, హరియాణా తెచ్చిన కొత్త సవరణ చట్టం 'సర్పంచ్'పదవికి పోటీ చేసే అభ్యర్థులకు విధించిన 'కొలబద్దలు' సాధారణ అభ్యర్థులయితే మెట్రిక్యులేషన్ (ఎస్ఎస్ఎల్సీ) పాసయి ఉండాలి. మహిళలయితే 8వ తరగతి, షెడ్యూల్డ్ తరగతి స్త్రీలయితే 5వ తరగతి పాసయి ఉండాలి! ఈ కొలబద్ద అమలులోకి వస్తే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న ఎస్సీ మహిళల్లో 60 శాతం, పురుషుల్లో 41 శాతం పోటీకి అర్హులు కాకుండా పోతారు! ఈ పరిస్థితిని సమీక్షించుకున్న తరవాతనైనా సుప్రీం ధర్మాసనం (జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ మనోహర్ సప్రీ) రాజ్యాంగం నిర్దేశించని ఈ కొత్త కొలబద్దల్ని అనుమతించి ఉండాల్సింది కాదు. ఒకవేళ ఇతర రాష్ట్రాలకన్నా హరియాణా 'సంపన్న రాష్ట్ర'మని కోర్టు భావించినా అది తన తీర్పు హరియాణాకే వర్తిస్తుందని స్పష్టం చేయవలసింది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 'ప్రజాప్రయోజన వ్యాజ్యం'దాఖలు చేసిన ముగ్గురు మహిళలూ- 'అక్షరశూన్యులయినంత మాత్రాన'ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వహణలో వారు (నిరక్షరాస్యులు) పాల్గొనడాన్ని అనర్హులను చేసే చట్ట నిబంధనను సవాలు చేశారు! హరియాణాలోని 'దారిద్య్ర రేఖకు ఇంకా దిగువనే ఉండిపోయిన 8.5 లక్షల కుటుంబాలలో 7.2 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో మరుగుదొడ్ల సౌకర్యం కలిగింద'ని ధర్మాసనం భావించి ఉండొచ్చు. కానీ, ఆ కారణంగా, 'నిరక్షరాస్యుల'న్న కారణంగా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్ణయాల్లో భాగస్వాములుగా ఉండటం కోసం ప్రాథమిక హక్కుగా ఉన్న వయోజన ఓటింగ్ హక్కును దళిత బహుజన వర్గాల స్త్రీ, పురుషులకు నిరాకరించేలా సవరణ చట్టం తేవటం వేరు! ఓటర్లలో రెండు అసమ వర్గాలా? ప్రాథమిక విద్య, ఆరోగ్య, ఉపాధి, సౌకర్యాలను ప్రజాబాహుళ్యానికి అందించాలన్న రాజ్యాంగ లక్ష్యం నెరవేరిందా? అన్నదే నేటి ప్రాథమిక ప్రశ్న అని మరచిపోరాదు. ఎలాంటి వివక్షకూ చోటివ్వకుండా స్త్రీ, పురుషులకు సార్వత్రిక ఓటు హక్కును ఇచ్చిన రాజ్యాంగం లక్ష్య నిర్వచనా పత్రమే ఇది 'భారత ప్రజలమైన మేము రూపొందించుకున్న పత్రమ’’ని ప్రకటించు కుంది! ప్రజల్ని అక్షరాస్యుల్ని చేసే బాధ్యతను విస్మరించి, వారిని చీకట్లో ఉంచేసిన పాలకుల నిర్వాకం కొనసాగుతున్నంత కాలం ‘ఆ పాపం ఎవరిదని'బొడ్లో చేయి వేసి ప్రశ్నించే హక్కు నిరక్షరాస్యులకు ఉంటుందని గుర్తించాలి! ఈ విషయాన్ని ధర్మాసనం బోళాగా ఒప్పేసుకుంది కూడా: 'హరియాణా చట్టం రెండు రకాల ఓటర్లను సృష్టించింది. ఒక రకం: విద్యారంగంలో తమ ప్రతిభ, సామర్థ్యం వల్ల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులైన వారు కాగా, రెండవ రకం: ఆ అర్హతలు పొందని వారనీ’'వర్గీకరించింది అని పేర్కొంది! కాని తీర్పు చెప్పిన జస్టిస్ చలమేశ్వర్ ఆ సవరణ చట్టానికి ఆమోదం ప్రకటించారే గాని, తామే అన్నట్టు 'ఓటర్లలో రెండు వర్గాలను సృష్టించిన హరియాణా చట్టాన్ని'కాలదన్నలేకపోయారు! అందుకే, చదువు సంధ్యలు లేని నిరక్షరాస్యులైన కోట్లాది మంది స్త్రీ, పురుషుల్ని ప్రజాస్వామ్య మనుగడకు మూల స్తంభాలైన పంచాయతీరాజ్ వ్యవస్థ విధివిధానాల నుంచి, నిర్వహణ నుంచి తప్పించే ప్రక్రియను రాజ్యాంగం తిరస్కరించవలసివచ్చింది! భారత వ్యవస్థలో కుల, మత, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో దగా పడుతున్న దళితులతో పాటు, సంపన్న వర్గాల స్త్రీలు కూడా అనేక రకాల దోపిడీకి, వివక్షకు గురవుతు న్నందున ఆ స్త్రీలు కూడా 'దళిత వర్గం కిందికే వస్తారని' అంబేడ్కర్ అన్నారు. చారిత్రక పరిణామక్రమంలో అక్షరాస్యులైన 'బడా చదువరుల'కన్నా, కొంత మంది బడా మేధావులకన్నా నిరక్షరాస్యులైన ప్రజలే స్వాతంత్య్ర ఉద్యమాలలోనూ, విప్లవాలలోనూ ముందుకురికి, అశేష త్యాగాలు చేశారు! భారత స్వాతంత్య్ర సంగ్రామంలో నిరక్షరాస్యుల అసామాన్యమైన పాత్రే అందుకు ఉదాహరణ. దెబ్బదెబ్బకూ ‘వందేమాతరం'నినాదాన్ని శంఖంగా పూరించి తోటి వారిని మేల్కొల్పిన నిరక్షరాస్యులున్నారు! నాడు ఎంతో చైతన్యంతో సంచలనం సృష్టించిన ఉద్యమాలలో పాల్గొనదలిచిన సామాన్యులకు 'కనీస విద్యార్హత'ల కొలబద్దలు లేవు! నిరక్షరాస్య సామాన్యులే చరిత్ర నిర్మాతలు 'స్త్రీ'చుట్టూ కంచెలు, ముళ్లపొదలు అనాదిగా అల్లుతూ వారి ఎదుగుదలను అడ్డుకున్న మగవారిలోని స్వార్థపరులే 'ఆడదాని మాట ఆపదలకు మూలం'అనీ, 'ఆడది తిరిగి చెడుతుంద'నీ అన్నారు. మాతృస్వామిక వ్యవస్థ వర్థిల్లినన్నాళ్లూ స్త్రీమూర్తే సమాజాన్నీ కుటుంబ వ్యవస్థనూ సజావుగా తీర్చిదిద్దింది. పితృస్వామిక వ్యవస్థ వచ్చిన తర్వాతనే స్త్రీ జాతికి రకరకాల కష్టాలూ, నష్టాలూ. కాని వర్షాలు లేక, పంటలు ఎండిపోయిన చెరువుల కోసం ఆత్మాహుతి చేసుకున్న 'చిన్నక్కమ్మ/పెద్దక్కమ్మ'లు సామాన్య నిరక్షరాస్య స్త్రీలేనని గ్రామ చరిత్రలు వెల్లడిస్తున్నాయి! చెరువు తెగిపోకుండా ఆపడం కోసం ప్రాణత్యాగం చేసిన ఒక ముసలమ్మ కట్టమంచి రామలింగా రెడ్డి చేతిలో 'ముసలమ్మ మరణం'కావ్యంగా రూపొందింది. 1975 ఎమర్జెన్సీ ఎత్తివేసిన వెంటనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చీపుళ్లతో ఊడ్చేసినట్లు ఉత్తరాదిలో ఇందిరాగాంధీని ఓడించిన వాళ్లు నిరక్షరాస్యులైన సామాన్యులే! ప్రసిద్ధ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం వ్యాఖ్యానించినట్లు 'మనం అనుభవిస్తున్న ప్రకృతి సంపదను అనేక సందర్భాలలో సామాన్య మహిళల బలిదానాలే పరిరక్షించాయి.'తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరవనితలే చరిత్రకు రూపురేఖలు దిద్దారు! శ్రీకృష్ణదేవరాయల అంతఃపురంలో వంటావార్పులు చూసే సామాన్య మహిళలు (బోనకత్తెలు) కామక్క, ఎర్రక్కలు చెరొక చెర్వు తవ్వించారని కైఫీయత్తులు నమోదు చేశాయి! కాని పార్లమెంటు సభ్యులలో సుమారు 300 పైచిలుకు యథావిధి అవినీతికి ఏతమెత్తగా, మరికొన్ని వందల మంది స్విస్ బ్యాంకుల్లో 24 లక్షల కోట్ల రూపాయల్ని అక్రమంగా దాచారు. ఇంకొన్ని వందల మంది శాసనసభ్యులు నేరగాళ్లుగా నమోదై ఉన్నవాళ్లు. ఇలాంటి ‘ప్రజా ప్రతినిధులే'ఈ దేశ 'ప్రజాస్వామ్య'రక్షణకు 'పూచీ'పడుతున్నంత కాలం, ఈ వింత దృశ్యాన్ని ఆసక్తితో తిలకిస్తున్న ప్రభుత్వాలు, పాలకులు న్నంత కాలం ‘నిరక్షరాస్యత'నుంచి సామాన్య ప్రజలు విమోచన పొందడం అసాధ్యం! ఈ సత్యాన్ని న్యాయమూర్తులు గుర్తిస్తే చాలు. చదవేస్తే ఉన్న మతికాస్తా పోయిందనే సామెత ఎందుకు పుట్టుకొచ్చిందో ఒక్కసారి అందరం ఆలోచించాలి! సీనియర్ సంపాదకులు: ఏబీకే ప్రసాద్ abkprasad2006@yahoo.co.in -
ఐట్యూన్స్, గ్యాస్, డౌన్లోడ్..!
స్విస్ బ్యాంకుల్లో లావాదేవీలకు రహస్య సంకేతాలు ఇవి... జ్యూరిక్: కాదేదీ ‘కోడ్’కు అనర్హం అంటే ఇదేనేమో! ఇంతకీ దేనికంటారా.. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచుకునేవాళ్లకు రహస్య సంకేతాల్లో ట్రెండ్ ఇది. అంతర్జాతీయంగా వివిధ దేశాలు నల్లధనంపై కొరడా ఝుళిపిస్తుండటంతో స్విస్ బ్యాంకులు తమ గుట్టును విప్పాల్సి వస్తోంది. కేవలం ఖాతాల వివరాలను రహస్యంగా ఉంచుకోవడానికి మాత్రమే కోడ్లను వినియోగిస్తుంటారనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విషయం. అయితే, అక్కడి బ్యాంకర్లకు క్లయింట్లకు మధ్య జరిగే ప్రతి ఒక్క లావాదేవీకి కూడా ఒక రహస్య సంకేతం ఉంటుందన్న విషయం ఇటీవలే బయటికొచ్చింది. అమెరికా పన్ను శాఖలతో పలు స్విస్ బ్యాంకులు చేసుకున్న సెటిల్మెంట్ ఒప్పందం ప్రకారం ఖాతాలకు చెందిన అనేక వివరాలను ఆయా బ్యాంకులు తెలియజేశాయి. ఇందులో కోడ్లకు సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా స్విస్ బ్యాంక్ క్లయింట్లు తమ ఖాతాల నుంచి సొమ్మును ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పడానికి ‘డౌన్లోడ్’ అనే కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుందట! అదేవిధంగా నిధులను డ్రా చేసుకోవాలంటే చెప్పాల్సిన రహస్య సంకేతాల్లో ‘ఐట్యూన్స్’, ‘గ్యాస్’ వంటివి ఉన్నాయి. బ్లాక్ మనీపై భారత్ సహా అనేక దేశాలు ఇటీవల పెద్దయెత్తున ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో స్విస్ బ్యాంకులు రహస్య ఖాతాల గుట్టును విప్పాల్సి వస్తోంది. అయితే, తాజా కోడ్లను పరిశీలిస్తే.. ఇప్పటికే స్విస్ బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో నిధులు సింగపూర్, ఇజ్రాయెల్, సైప్రస్, లెబనాన్, హాంకాంగ్, దుబాయ్ వంటి దేశాలకు తరలిపోయిందన్న విషయం తేటతెల్లమవుతోంది. యూఎస్ న్యాయ శాఖకు వివిధ స్విస్ బ్యాంకులు ఇచ్చిన ‘స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్’ నివేదిక దీన్ని బయటపెట్టింది. తమ క్లయింట్లు నల్లధనాన్ని దాచుకోవడానికి వివిధ దేశాల్లో దొంగ సంస్థలను రిజిస్టర్ చేసుకోవడానికి, బోగస్ బీమా పథకాలను సృష్టించడంలో ఎలా తోడ్పాటునందించిందీ కూడా బ్యాంకులు ఆ నివేదికలో వెల్లడించాయి. భారీస్థాయి(హై ప్రొఫైల్) ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ ఈవెంట్లకు హాజరయ్యే సంపన్నులను తమ నల్లధనాన్ని సురక్షితంగా ఎలా దాచుకోవచ్చో వివరించేందుకు స్విస్ బ్యాంకులు ప్రత్యేకంగా రిలేషన్షిప్ మేనేజర్లను రంగంలోకి దించేవన్న సంగతి కూడా తాజాగా బట్టబయలైంది. -
స్విస్ బ్యాంకుల్లో.. తగ్గిన భారతీయుల సొమ్ము
2014లో 10 శాతం డౌన్ రూ. 12,615 కోట్లకు తగ్గుదల జ్యూరిక్ : స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు గతేడాది దాదాపు 10 శాతం తగ్గింది. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ అయిన స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్ఎన్బీ) వెల్లడించిన గణాంకాల ప్రకారం 2014 ఆఖరు నాటికి ఈ మొత్తం 1.8 బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా (సుమారు రూ. 12,615 కోట్లు) ఉంది. అంతక్రితం ఏడాది ఈ మొత్తం 2.03 బిలియన్ స్విస్ ఫ్రాంకులుగా ఉండేది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ సంస్థలు, వ్యక్తులు దాచిన డబ్బు ఇంత తక్కువ స్థాయికి తగ్గిపోవడం ఇది రెండోసారి. 2012లో ఇది దాదాపు రూ. 8,530 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత ఏడాది (2013లో) 40 శాతం పెరిగింది. నల్ల ధనాన్ని దాచుకున్న వారి పేర్లు వెల్లడించాలంటూ స్విస్ బ్యాంకులపై భారత్ సహా ప్రపంచ దేశాల ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, ఇతర దేశాల వారు స్విస్ బ్యాంకుల్లో దాచుకునే డబ్బు గణనీయంగా పెరిగింది. 2013లో రూ. 90 లక్షల కోట్లుగా ఉండగా.. 2014లో ఇది రూ. 103 లక్షల కోట్లకు చేరింది. అమెరికన్లు స్విస్ బ్యాంకుల్లో దాచిన సొమ్ము వరుసగా రెండో ఏడాది కూడా పెరిగి 244 బిలియన్ స్విస్ ఫ్రాంకుల స్థాయికి చేరింది. బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర దేశాల వారి నిధులూ ఇదే కోవలో పెరిగాయి. ఎస్ఎన్బీ అధికారికంగా వెల్లడించిన గణాంకాల్లో నల్లధనం వివరాల గురించి ప్రస్తావన లేదు. పెరిగిన లాభాలు.. తగ్గిన ఉద్యోగులు.. 2014లో స్విస్ బ్యాంకుల స్థూల లాభాలు 6.4 బిలియన్ స్విస్ ఫ్రాంకుల మేర పెరిగాయి. స్విట్జర్లాండ్‌లోని 275 బ్యాంకుల్లో 246 బ్యాంకులు లాభాలార్జించాయి. అసాధారణ ఆదాయం నమోదు కావడం, ఇతరత్రా వ్యయాలు తగ్గడం ఇందుకు దోహదపడ్డాయి. మరోవైపు, బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య 1,844 మేర తగ్గి, 1,25,289కి చేరింది. -
ఇద్దరు నల్ల కుబేరుల పేర్లు వెల్లడి
బెర్న్: స్నేహలత సాహ్ని, సంగీత సాహ్ని.. ఈ ఇద్దరు మహిళలకు స్విస్ బ్యాంక్‌లో అకౌంట్లున్నాయి. అయితే వీరి పుట్టిన తేదీ వివరాలు మినహా, మరే వివరాలను స్విట్జర్లాండ్ వెల్లడించలేదు. నల్ల కుబేరుల పేర్ల వెల్లడిలో భాగంగా స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ) ఈ రెండు పేర్లను బయటపెట్టింది. అయితే వారి వివరాలను భారత ప్రభుత్వానికి వెల్లడించకూడదనుకుంటే, 30 రోజుల్లోగా ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్ కోర్టుకు వీరు అప్పీల్ చేసుకోవచ్చని ఎఫ్‌టీఏ తెలిపింది. వీరిరువురి పేర్లతో పాటు బ్రిటిష్, స్పెయిన్, రష్యాలకు చెందిన నల్ల కుబేరుల పేర్లను ఎఫ్‌టీఏ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన వారి ఇనిషియెల్స్ మాత్రమే వెల్లండించింది కానీ పూర్తి వివరాలను బయటపెట్టలేదు. మొత్తం మీద 40 మంది వివరాలను స్విస్ ఫెడరల్ గెజిట్‌లో ప్రచురించారు. భవిష్యత్తులో మరింత మంది వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి. -
'350 మంది ఖాతాల మదుపు పూర్తి చేశాం'
న్యూఢిల్లీ : నల్లధనం కేసుల వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ 350 మంది ఖాతాల మదుపు పూర్తి చేశామని, మిగతా ఖాతాల మదింపు మార్చిలోగా పూర్తి చేస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. అలాగే స్విస్ అధికారులతో మాట్లాడేందుకు ఓ బృందాన్ని అక్టోబర్‌లోనే పంపినట్లు జైట్లీ తెలిపారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఆరు, ఏడు నెలలుగా చర్యలు తీసుకుంటోందన్నారు. కాగా విదేశీ బ్యాంకుల్లో బ్లాక్ మనీ పోగేసుకున్న 60 మందిపై దర్యాప్తు ప్రారంభించనుంది. వీరి ఖాతాల్లో రూ.1,500 కోట్లకు పైగా సొమ్ము ఉన్నట్లు అధికారులు గుర్తించారని సమాచారం. గత అక్టోబర్‌లో 627 మంది నల్ల కుబేరుల పేర్లతో కేంద్రం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.