స్విస్ బ్యాంకులో 1.95 బిలియన్ల పైనే భారతీయుల ధనం!
స్విస్ బ్యాంకులో 1.95 బిలియన్ల పైనే భారతీయుల ధనం!
Published Thu, Jun 19 2014 3:57 PM | Last Updated on Sat, Sep 2 2017 9:04 AM
జ్యూరిచ్/న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అర్ధిక అనిశ్చితి నెలకొన్నా.. స్విస్ బ్యాంకులో భారతీయుల నల్లధనం గత సంవత్సరంలో 14 వేల కోట్ల మేరకు పెరిగినట్టు స్విస్ నేషనల్ బ్యాంక్ ఓ నివేదికను విడుదల చేసింది. గత సంవత్సరం 40 శాతంతో 1.42 బిలియన్ స్విస్ ఫ్రాంక్ లు పెరిగిందని డేటా విడుదల చేసింది. అయితే విదేశీ కస్టమర్ల ధనంలో రికార్డు స్థాయిలో తగ్గినట్టు వెల్లడించింది.
విదేశీ కస్టమర్ల ధనం 2013 సంవత్సరాంతానికి 90 లక్షల కోట్లు (1.56 ట్రిలియన్ డాలర్లు) క్షీణించగా, భారతీయుల 14 వేల కోట్లు పెరిగిందని తాజా గణాంకాల ద్వారా వెల్లడించింది. స్విస్ బ్యాంక్ చరిత్రలో ఇదే కనిష్టమని, భారతీయుల ధనం కూడా మూడింతలు తగ్గినట్టు నివేదికలో వెల్లడించారు.
స్విస్ బ్యాంకుల్లో వ్యక్తులు, సంస్థలు, ఇతరులు దాచుకున్న సొమ్ము మొత్తం 1.95 బిలియన్లు కాగా, వెల్త్ మేనేజర్స్, ఫండ్స్, అధికారిక బినామీల దాచిన సోమ్ము 77.3 మిలియన్లని బ్యాంక్ వెల్లడించింది. భారతీయ ప్రభుత్వం, ఇతర దేశాల నుంచి కస్టమర్ల వివరాలను వెల్లడించాలని తెస్తున్న ఒత్తిడి నేపథ్యంలో స్విస్ నేషనల్ బ్యాంక్ తాజా గణాంకాలను విడుదల చేసింది.
Advertisement
Advertisement