'రాహుల్ గాంధీ డ్రగ్స్ తీసుకుంటూ చాలా సార్లు దొరికారు'
ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీలపై భారతీయ జనతాపార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ సర్కస్ సింహంలా, సోనియా రింగ్ మాస్టార్గా వ్యహరిస్తున్నారని ఆయన అభివర్ణించారు.
సోనియా గాంధీ ఆస్తులు స్విస్ బ్యాంకు ఖాతాలలో మూల్గుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గతంలో యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు నాలుగు సార్లు డ్రగ్స్ తీసుకుంటు దొరికిపోయారని సుబ్రహ్మణ్యస్వామి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేజీ బేసిన్ వల్ల 24 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.