స్విస్ బ్యాంకులో భారతీయులకు సంబంధించిన ఖాతాల్లో దాదాపు 300 కోట్ల రూపాయాలు మురిగిపోతున్నాయి. ముగ్గురు భారతీయులు, మరో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన ఖాతాల్లో ఈ 300 కోట్లు ఉన్నాయని స్విస్ బ్యాంక్ తాజా జాబితాలో పేర్కొంది. చాలా కాలంగా ఎలాంటి లావాదేవీలు జరగని, ఖాతాలో సొమ్మును క్లెయిమ్ చేసుకోని ఖాతాలు 3500కుపైగా ఉన్నాయని అంబుడ్స్‌మన్ తెలిపింది. తమ బ్యాంకుల్లో చాలా కాలం పాటు లావాదేవీలేమీ నిర్వహించని ఖాతాల వివరాలను అంబుడ్స్‌మన్ మొదటి సారిగా 2015లో ప్రకటించింది.
ఆ తర్వాత నుంచి ఇలాంటి ఖాతాల్లో ఏ ఖాతాకు సంబంధించి అయినా లావాదేవీలు జరిగినా, సదరు ఖాతా తమదేనని ఎవరైనా సాక్ష్యాధారాలతో సహా నిరూపించుకున్నా, వాటిని జాబితా నుంచి తీసివేసి తాజా జాబితాను ప్రతి ఏడూ విడుదల చేస్తోంది.మూడేళ్లుగా స్విస్ బ్యాంక్ అంబుడ్స్‌మన్ ఈ జాబితాను ప్రకటిస్తున్నా ఇంత వరకు దానిలోని భారతీయ ఖాతాలకు సంబంధించి ఎలాంటి తీసివేతలూ లేవు.అంటే భారతీయులెవరూ ఆ ఖాతాలు తమవేనని నిరూపించుకోవడం లేదన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment