claiming
-
'విక్రమ్ ల్యాండర్ నేనే డిజైన్ చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి..
అహ్మదాబాద్: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకిన క్షణాన దేశం అంతా ఉప్పొంగిపోయింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకగానే.. ఓ వ్యక్తి ఆ క్రెడిట్ తనదేనని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. తాను ఇస్రోలో చంద్రయాన్ 3 మిషన్లో పనిచేశానని చెప్పుకున్నాడు. తాను తయారు చేసిన ల్యాండర్ డిజైన్ జాబిల్లిని తాకిందని గొప్పలకు పోయాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూరత్కు చెందిన మితుల్ త్రివేది.. ఇస్రోలో పనిచేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో పాలు పంచుకున్నట్లు చెప్పుకున్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అవగానే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దీనిపై గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మితుల్ త్రివేది వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు సూరత్ పోలీసు కమీషనర్ అజయ్ తోమర్ తెలిపారు. లోకల్ మీడియాలో ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని తేలినట్లు వెల్లడించారు. త్రివేది ఇన్స్టాలో ఇస్రో శాస్త్రవేత్తగా పేరు పెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆయనకు పీహెచ్డీ ఉన్నట్లు చెప్పుకోవడం కూడా అబద్ధమేనని వెల్లడించారు. ఆయనకు కేవలం బీకాం డిగ్రీ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నాసాకు ఫ్రీలాన్సర్గా పనిచేసినట్లు చెప్పుకోవడం కూడా క్రెడిట్ సంపాదించుకునే ప్లాన్లో భాగమేనని వెల్లడించారు. మరోమారు మితుల్ త్రివేదిని ప్రశ్నించనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్.. ఇప్పటికే 4లక్షల మొక్కలు -
విరాళం రూ.2 లక్షలకు మించితే తెలియజేయాలి..
న్యూఢిల్లీ: సామాజిక సేవా సంస్థలు వెల్లడించాల్సిన వివరాల నిబంధనలను ఆదాయపన్ను శాఖ సవరించింది. ఈ మార్పులు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక మీదట చారిటబుల్ సంస్థలు తమ కార్యకలాపాలు ధార్మికమైనవా లేదా మతపరమైనవా లేక మతపరమైన సేవా కార్యక్రమాల కిందకు వస్తాయా? అన్నది వెల్లడించాల్సి ఉంటుంది. ఒకరోజులో రూ.2 లక్షలకు మించి ఎవరైనా విరాళం ఇస్తే ఆ వివరాలను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలి. చెల్లించిన వ్యక్తి, చిరునామా, పాన్ నంబర్ ఇవ్వాలి. ఆదాయపన్ను చట్టంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన ట్రస్టులు, వైద్య, విద్యా సంస్థల ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఈ సంస్థలు ఐటీ శాఖ నుంచి రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది. -
ఎవరివీ 300 కోట్లు?
స్విస్ బ్యాంకులో భారతీయులకు సంబంధించిన ఖాతాల్లో దాదాపు 300 కోట్ల రూపాయాలు మురిగిపోతున్నాయి. ముగ్గురు భారతీయులు, మరో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన ఖాతాల్లో ఈ 300 కోట్లు ఉన్నాయని స్విస్ బ్యాంక్ తాజా జాబితాలో పేర్కొంది. చాలా కాలంగా ఎలాంటి లావాదేవీలు జరగని, ఖాతాలో సొమ్మును క్లెయిమ్ చేసుకోని ఖాతాలు 3500కుపైగా ఉన్నాయని అంబుడ్స్మన్ తెలిపింది. తమ బ్యాంకుల్లో చాలా కాలం పాటు లావాదేవీలేమీ నిర్వహించని ఖాతాల వివరాలను అంబుడ్స్మన్ మొదటి సారిగా 2015లో ప్రకటించింది. ఆ తర్వాత నుంచి ఇలాంటి ఖాతాల్లో ఏ ఖాతాకు సంబంధించి అయినా లావాదేవీలు జరిగినా, సదరు ఖాతా తమదేనని ఎవరైనా సాక్ష్యాధారాలతో సహా నిరూపించుకున్నా, వాటిని జాబితా నుంచి తీసివేసి తాజా జాబితాను ప్రతి ఏడూ విడుదల చేస్తోంది.మూడేళ్లుగా స్విస్ బ్యాంక్ అంబుడ్స్మన్ ఈ జాబితాను ప్రకటిస్తున్నా ఇంత వరకు దానిలోని భారతీయ ఖాతాలకు సంబంధించి ఎలాంటి తీసివేతలూ లేవు.అంటే భారతీయులెవరూ ఆ ఖాతాలు తమవేనని నిరూపించుకోవడం లేదన్న మాట. -
బీమా ఉన్నా... బిల్లు మొత్తం రాదు!!
ఒకోసారి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద భారీగా కవరేజీ ఉన్నా.. క్లెయిమ్ సమయంలో అరకొర మాత్రమే చేతికి రావొచ్చు. ఉదాహరణకు మనకు రూ. 2 లక్షల దాకా కవరేజీ ఉందనుకుందాం. వైద్య చికిత్స బిల్లు రూ.లక్షే అయింది. ఇలాంటప్పుడు కవరేజీ రూ.2 లక్షల దాకా ఉంది కాబట్టి.. క్లెయిమ్ చేసిన రూ. లక్ష తిరిగి వస్తుందనే చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి పలు సందర్భాల్లో క్లెయిమ్ చేసిన దాంట్లో పాక్షికంగానే ఇన్సూరెన్స్ సంస్థ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం సబ్–లిమిట్ నిబంధన. దానిపై అవగాహన కల్పించేదే ఈ కథనం. సబ్ లిమిట్స్ అంటే... మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కొన్ని రకాల చికిత్సలకు చెల్లింపులపరంగా నిర్దేశించిన కొన్ని పరిమితులనే సబ్ లిమిట్స్గా వ్యవహరిస్తారు. ఇవి సాధారణంగా ఈ ఆరోగ్య సమస్య చికిత్సకు ఇంత మొత్తం మాత్రమే ఇవ్వడం జరుగుతుందనో లేదా మొత్తం సమ్ ఇన్సూ ర్డ్లో నిర్దిష్ట శాతం మాత్రమే ఇవ్వడం జరుగుతుందనో కంపెనీ పేర్కొంటుంది. ఈ పరిమితులను పాలసీలో అంతర్గతంగానే పేర్కొనడం జరుగుతుంది. హెల్త్ పాలసీని తీసుకునేటప్పుడు ప్రధానంగా రెండు రకాల సబ్ లిమిట్స్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మొదటిది హాస్పిటల్ రూమ్ రెంట్ కాగా, రెండోది నిర్దిష్ట ఆరోగ్య సమస్యల చికిత్స వ్యయాలపై నిర్దేశించే పరిమితులు. సబ్ లిమిట్స్ ప్రభావాలు.. గది అద్దెపై పరిమితుల ప్రభావాలు.. మిగతా హాస్పిటల్ చార్జీల మీద కూడా ఉం టాయి. ఉదాహరణకు డాక్టర్ విజిట్, శస్త్ర చికిత్స, నర్సింగ్ చార్జీలు, ఆపరేషన్ థియేటర్ చార్జీలు, సర్జన్ ఫీజులు, అనెస్థటిస్ట్, స్పెషలిస్టుల ఫీజులు, ఇతరత్రా వైద్య చికిత్సా వ్యయాలు.. ఇవన్నీ కూడా మీరు ఎంచుకునే గది మీదే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు.. నిర్దిష్ట శస్త్ర చికిత్సకు ట్విన్ షేరింగ్ గదిలోనైతే.. రూ. 20,000, సింగిల్ రూమ్లోనైతే రూ. 40,000 వ్యయం అవుతుందనుకుందాం. ట్విన్ షేరింగ్ రూమ్లో డాక్టర్ విజిట్ ఫీజు రూ. 1,000 కాగా.. సింగిల్ రూమ్లో రూ. 2,000 అనుకుందాం. ఇక మీరు రోజుకు రూ. 5,000 టారిఫ్ ఉండే గదిని తీసుకున్నారనుకుందాం. ఇప్పుడు లెక్కేస్తే.. 4రోజులకు మీ గది అద్దె రూ. 20,000 అవుతుంది. అయితే, మీ హెల్త్ పాలసీలో గది అద్దెపై గరిష్ట పరిమితి రూ.2,000 మాత్రమే. దీంతో మిగతా రూ. 12,000 (అదనంగా రోజుకు రూ. 3,000 చొప్పున, 4 రోజులకు) మొత్తాన్ని మీరే కట్టాల్సి వస్తుంది. ఇది ఇక్కడితో అయిపోలేదు. ముందుగా అనుకున్నట్లే.. మనం ఎంచుకున్న రూమ్ని బట్టి చికిత్సా వ్యయాలూ మారి పోతుంటాయి. కాబట్టి మీరు ఎంచుకున్న రూ. 5,000 టారిఫ్ గది ప్రకారం.. డాక్టర్ విజిట్, సర్జరీ, మెడికల్ టెస్టులు మొదలైన వాటికి రూ. 2లక్షలు అయ్యాయనుకుందాం. ఇది మీ పాలసీ సమ్ ఇన్సూర్డ్ రూ. 2లక్షలకు లోబడే ఉంది. కానీ.. మీ పాలసీలో నిర్దేశించిన రూమ్ రెంట్ సబ్ లిమిట్స్ ప్రకారం.. రూ. 2,000 టారిఫ్ గదిలో ఈ వ్యయాలు రూ. 1.50 లక్షలే అవుతాయి. అంటే నిర్దేశించిన సబ్ లిమిట్స్ని మించిన రూమ్ని తీసుకోవడం వల్ల గది అద్దె అదనపు మొత్తంతోపాటు.. మరో రూ. 50,000 కూడా మీ జేబు నుంచే కట్టాల్సి ఉంటుంది. నిర్దిష్ట చికిత్సల వ్యయాలపై పరిమితులు అత్యధిక కవరేజీ ఉండేలా హెల్త్ పాలసీ తీసుకున్నా.. కొన్ని ఆరోగ్య సమస్యల చికిత్సల వ్యయాలపై నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. వీటిని గురించిన వివరాలు పాలసీలో ప్రత్యేకంగా కంపెనీ పేర్కొంటుంది. ఇలాంటి చికిత్సల వ్యయాలపై వేర్వేరు కంపెనీలు విధించే పరిమితులు వేర్వేరుగా ఉండొచ్చు. స్థూలంగా చెప్పొచ్చేదేమిటంటే.. సమ్ ఇన్సూర్డ్ అధికంగా ఉన్నంత మాత్రాన ప్రతీ వైద్య చికిత్సకూ పూర్తి స్థాయిలో క్లెయిమ్ చేసుకోవడానికి సాధ్యం కాకపోవచ్చు. ఆయా చికిత్సా వ్యయాలపై సబ్ లిమిట్సే ఇందుకు కారణం. చికిత్స వ్యయాలపై సబ్ లిమిట్స్కి ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు కార్డియాక్ సమస్య చికిత్సకు సబ్–లిమిట్ 50 శాతం మాత్రమే ఉన్న పక్షంలో మీ సమ్ అష్యూర్డ్ రూ. 5 లక్షలు ఉన్నప్పటికీ.. రూ. 2.5 లక్షలకు మించి క్లెయిమ్ చేయడానికి ఉండదు. అలాగే, కిడ్నీలో రాళ్ల సమస్య చికిత్స వ్యయాలు రూ. 1 లక్ష అయ్యాయనుకుందాం. కానీ హెల్త్ పాలసీ ప్రకారం.. దీని చికిత్సకు రూ. 40,000 మాత్రమే సబ్ లిమిట్ ఉంటే.. మిగతా రూ. 60,000 మన జేబు నుంచి కట్టాల్సి వస్తుంది. సబ్ లిమిట్స్ విషయంలో గుర్తుంచుకోదగిన విషయాలు.. ►వీలైనంత వరకూ సబ్–లిమిట్స్ లేని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి. అలా కుదరకపోతే.. ఏ చికిత్సకు ఎంత వరకూ వ్యయ పరిమితి ఉంటుందో క్షుణ్నంగా తెలుసుకున్నాకే తీసుకోండి. ►వెసులుబాటు బట్టి సమ్ ఇన్సూర్డ్ అత్యధికంగా ఉండేలా చూసుకుంటే.. ఒకవేళ సబ్–లిమిట్స్ ఉన్నా.. వాటి పరిమితి కూడా అధికంగానే ఉంటుంది. ►అయితే, సమ్ ఇన్సూర్డ్ ఎక్కువయ్యే కొద్దీ.. కట్టాల్సిన ప్రీమియం కూడా పెరుగుతుంది. కాబట్టి నెలవారీ ఖర్చులను బేరీజు వేసుకుని దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ► హెల్త్ కవర్ ప్లాన్ షరతులు, నిబంధనలు మొదలైన వాటన్నింటినీ క్షుణ్నంగా చదివి, అర్థం చేసుకోవాలి. ►మీ ఆర్థిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణమైన హెల్త్ పాలసీని ఎంపిక చేసుకునేటప్పుడు.. ఏయే వ్యాధులు కవరేజీ పరిధిలోకి రావో, వేటికి మినహాయింపులు ఉన్నాయో తెలుసుకోవాలి. -
పెనాల్టీలను తప్పించుకోవచ్చు..
రిటర్నుల దాఖలుకు ఈ నెల 5తో గడువు తేదీ అయిపోయింది. కాకపోతే ఏదైనా కారణం వల్ల రిటర్న్ దాఖలు చేయనివారు చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేసినా పర్వాలేదు. టీడీ ఎస్, అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా మొత్తం పన్ను భారం మార్చి 2016లో చెల్లించిన ట్లయితే... ఈ రోజు/రేపు అంటే గడువు తేది తర్వాత రిటర్న్ దాఖలు చేయవచ్చు. అదనంగా వడ్డీ చె ల్లించాల్సిన పనిలేదు. ఎటువంటి ప్రమాదం లేదు. గాబరా పడనక్కర్లేదు. వెంటనే వేయండి. ఒకవేళ రిఫండ్ క్లెయిమ్ చేయ్యాలనుకోండి. ఈ రోజు వేసినా మీ రిఫండ్ మీకు వస్తుంది. మీ రిఫండ్కి ఏ ఢోకా లేదు. అయితే డిపార్ట్మెంట్ వారు మీకు రిఫండ్ మీదిచ్చే నామమాత్రపు వడ్డీ మాత్రం ఇవ్వరు. ఇది స్వల్పంగా ఉంటుంది.గడువు తేది దాటిపోయింది. రిటర్నులు వేయలేదు. పన్ను భారం పూర్తిగా కాకుండా కొంత భాగమే చెల్లించారు. ఈ సందర్భాల్లో మీకు అదనంగా వడ్డీ వడ్డిస్తారు. చెల్లించవలసిన ప్రతి వంద కి.. నెలకి 25 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి. బయటి నుంచి ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చి పన్నులు చెల్లించడం కన్నా.. ఒకటి లేదా రెండు నెలల జాప్యం జరిగి రిటర్నులు ఆలస్యంగా వేయడంతో వడ్డీ మినహా ఎలాంటి నష్టం లేదు. కానీ ఎక్కువ మొత్తం బకాయి ఉన్నప్పుడు ఈ వడ్డీలు తడి సి మోపెడవుతాయి. వడ్డీ చెల్లించడం వలన ఆదాయం పెరగదు. వడ్డీని ఖర్చుగా పరిగణించరు. వ్యాపారం, స్టాక్ మార్కెట్ వ్యవహారాలు, ఇంటి రుణ వడ్డీ, క్యాపిటల్ గెయిన్ వంటి అంశాల్లో నష్టం వాటిల్లిన సందర్భాల్లో గడువు తేదిలోపు రిటర్నులు వేయకపోతే ఈ నష్టాన్ని బదిలీ చేయరు. సకాలంలో వేయడం వలన ఇలాంటి నష్టాల్ని వచ్చే సంవత్సరానికి బదిలీ చేస్తారు. ఇలా చేయడంతో ఈ నష్టం మేరకు వచ్చే సంవత్సరంలో ఆదాయం తగ్గుతుంది. ఫలితంగా పన్ను భారమూ తగ్గుతుంది. ఇది ఎంతో ప్రయోజనకరం. దీనిని దృష్టిలో ఉంచుకొని రిటర్నులు సకాలంలో వేయాలి. 2015-16 ఆర్థిక సంవత్సరం రిటర్నును 31.03.2017లోగా దాఖలు చేయకపోతే పెనాల్టీలు వేస్తారు. అలాగే సెల్ఫ్ అసెస్మెంట్ పన్ను కట్టకపోయినా.. అసెస్మెంట్ జరిపిన తర్వాత డిమాండ్ చెల్లించకపోయినా పెనాల్టీలు పడతాయి. ఇంచుమించు ప్రతి తప్పుకి పెనాల్టీలు ఉన్నాయి. వీటి వలన మీ ట్రాక్ రికార్డ్ పాడవుతుందన్న విషయం. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి & కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
క్లెయిమ్ పరిష్కారం కష్టమేం కాదు!
♦ పాలసీ తీసుకున్నప్పుడే జాగ్రత్త అవసరం ♦ ఆరోగ్య వివరాలేవీ దాచిపెట్టకుంటే ఉత్తమం ♦ చిరునామా, నామినీలు మారితే వెంటనే సవరణ ♦ అన్నీ సరిగా ఉన్నా క్లెయిమ్ కాకుంటే ప్రత్యామ్నాయాలు ♦ అంబుడ్స్మన్ నుంచి ఐఆర్డీఏకు కూడా... అసలు బీమా పాలసీ తీసుకునేదే కుటుంబ రక్షణ కోసం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కనుక... ఆపత్కాలంలో ఆదుకుంటుందనే బీమా పాలసీని తీసుకుంటాం. మరి అనుకోని సంఘటన జరిగాక... ఆ దురదృష్టకర పరిస్థితుల్లో పాలసీ అక్కరకు రాకపోతే..? ఇక్కడ క్లెయిమ్ పరిష్కారం విధాన ప్రక్రియ సులభంగా జరగడం ముఖ్యం. చాలా మంది ఇక్కడే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిజానికి బీమా క్లెయిములంటే.. చాలా కష్టంతో కూడుకున్నవని అనిపించే ఉదంతాలు మనకు తరచూ ఎదురవుతుంటాయి. గందరగోళాన్ని తొలగించి, క్లెయిమ్ ప్రక్రియపై అవగాహన కల్పించడానికే ఈ కథనం. క్లెయిమ్ ప్రక్రియ నిజంగానే సులభంగా జరగాలంటే పాలసీదారులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. ⇔ ముందుగా తీసుకోదల్చుకున్న బీమా పథకం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సందేహాలుంటే ఏజెంటును లేదా బీమా కంపెనీని అడిగి నివృత్తి చేసుకోవాలి. సంతృప్తికరమైన సమాధానాలు పొందాకే సంతకం చేయాలి. ⇔ సంతకం చేసే ముందు దరఖాస్తు ఫారాన్ని కూడా చదవాలి. ఖాళీ ఫారంపై సంతకం చేయొద్దు. వివరాలన్నీ మీరే నింపడం మంచిది. ఒకవేళ ఎవరిదైనా సహాయం తీసుకుంటే అన్నీ సరిగ్గా నింపారో లేదో చూసుకోవాలి. ఇంగ్లిషులోని ఫారంను అర్థం చేసుకోవడం కష్టమైతే .. సన్నిహితులో, స్నేహితులో, బంధువులో నమ్మకస్తుల సహాయం తీసుకోవాలి. ⇔ మీ వయస్సు, చదువు, ఆదాయం, వృత్తి, అలవాట్లు, కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర, ఇతరత్రా బీమా పాలసీలుంటే ఆ వివరాలు... అన్నీ వాస్తవాలనే తెలపాలి. ⇔ సరైన బ్యాంకు అకౌంటు వివరాలు పొందుపరిస్తే, మెచ్యూరిటీ లేదా క్లెయిమ్ మొత్తాలు నేరుగా ఖాతాలోకి డిపాజిట్ అవుతాయి. జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులను నామినీలుగా పెట్టొచ్చు. వారి పేరు, పుట్టిన తేదీ, బంధుత్వం, చిరునామా మొదలైన వివరాలు కచ్చితమైనవిగా ఉండాలి. ఒకవేళ నామినీలు ఒకరికంటే ఎక్కువుంటే.. ఏ నిష్పత్తిలో వాటాలుండాలనేది కూడా పొందుపర్చాలి. బీమా పాలసీ వివరాలను.. నామినీలకు కూడా తెలియపర్చాలి. క్లెయిమ్ సులభ పరిష్కారంలో ఇది ఎంతో కీలకం. ⇔ ఇన్సూరెన్స్ కంపెనీ.. మీరు సంతకం చేసిన దరఖాస్తు ఫారం కాపీ, పాలసీ ప్రయోజనాల పత్రాన్ని పంపాలి. బీమా పాలసీ చేతికొచ్చాక మరోసారి వివరాలన్నీ సరిచూసుకోవాలి. తప్పులేమైనా కనిపిస్తే వెంటనే కంపెనీ దృష్టికి తీసుకెళ్లాలి. ⇔పాలసీని సురక్షితమైన ప్రదేశంలో ఉంచి, నామినీకి కూడా తెలియజేయాలి. పాలసీ పత్రాల్లో కంపెనీ కాంటాక్ట్ వివరాలుంటాయి. అవసరమైన సందర్భంలో బీమా సంస్థను వెంటనే ఎలా సంప్రదించాలో నామినీకి చెప్పాలి. అలాగే నామినీకి ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లెసైన్సు, పాన్ కార్డు వంటి సరైన గుర్తింపు, చిరునామా ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ ఖాతా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ⇔ చిరునామా లేదా నామినీల వివరాల్లో మార్పులేమైనా ఉంటే తక్షణం బీమా కంపెనీకి తెలియజేయాలి. ఈ విషయంలో ఆలస్యం సరికాదు. వివరాలు అన్నీ క్షుణ్ణంగా సంబంధిత అధికారికి అందజేయాలి. ⇔ క్లెయిమ్ సమయంలో దాఖలు చేయాల్సిన పత్రాల గురించి పాలసీ కాంట్రాక్టులోనే ఉంటుంది (ఉదా. డెత్ సర్టిఫికెట్, డాక్టర్ రిపోర్టు, నామినీ కేవైసీ పత్రాలు మొదలైనవి). వాటి గురించి తెలుసుకోవాలి. ⇔ క్లెయిమ్ చేయాల్సి వస్తే సాధ్యమైనంత త్వరగా ఘటన గురించి బీమా కంపెనీకి తెలియజేయాలి. అవసరమైన పత్రాలన్నీ అందించాలి. ⇔ క్రమం తప్పకుండా ప్రీమియంలు కట్టడం చాలా ముఖ్యం. లేకపోతే పాలసీ ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇలా బీమా పాలసీ విషయంలో జాగ్రత్తలన్నీ పాటిస్తే.. క్లెయిమ్ ప్రక్రియ వేగంగా, సులభంగా పూర్తవుతుంది. ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి... అన్నీ సరిగ్గా చేసినా క్లెయిమ్ పరిష్కారంలో సమస్యలెదురైతే ప్రత్యామ్నాయాలేంటి? ఒకసారి చూద్దాం... పాలసీ క్లెయిమ్ వస్తే బీమా కంపెనీ 30 రోజుల్లోపు పరిష్కరించాలి. తిరస్కరిస్తే దానికి కారణాలు కూడా చెప్పాలి. కంపెనీ అలా చెయ్యకుంటే బీమా అంబుడ్స్మన్ను ఆశ్రయించొచ్చు. రూ.20 లక్షల విలువ వరకు గల పాలసీ కేసులను అంబుడ్స్మన్ విచారించే అవకాశం ఉంది. ఒకవేళ క్లెయిమ్ కరెక్టేనని, బీమా కంపెనీ తప్పిదం వల్లే అది ఆలస్యమవుతోందని అంబుడ్స్మన్ భావిస్తే... పరిహారం విషయమై బీమా కంపెనీలకు ఆదేశాలివ్వటం కూడా జరుగుతుంది. ఐఆర్డీఏ సాయం కూడా... బీమా కంపెనీల సేవా లోపాలు, ఏజెంట్ల తీరుపై పాలసీదారులు బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏ)కు ఫిర్యాదు చేయవచ్చు. కాల్ సెంటర్కు 155255కు ఫోన్ కాల్ ద్వారా లేదా ఐఆర్డీఏ తాలూకు ఐఆర్జీఏ పోర్టల్లో igms.irda.gov.in ఫిర్యాదు దాఖలు చేసే అవకాశం ఉంది. వినియోగదారుల ఫోరానికి... ఈ వేదికల్లో సమస్యకు పరిష్కారం లభించకపోతే పాలసీదారులు నేరుగా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించవచ్చు. అతి తక్కువ వ్యయంతో తక్కువ సమయంలోనే తగిన న్యాయ సహాయం పొందడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది.