బెర్న్: స్నేహలత సాహ్ని, సంగీత సాహ్ని.. ఈ ఇద్దరు మహిళలకు స్విస్ బ్యాంక్‌లో అకౌంట్లున్నాయి. అయితే వీరి పుట్టిన తేదీ వివరాలు మినహా, మరే వివరాలను స్విట్జర్లాండ్ వెల్లడించలేదు. నల్ల కుబేరుల పేర్ల వెల్లడిలో భాగంగా స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టీఏ) ఈ రెండు పేర్లను బయటపెట్టింది.
అయితే వారి వివరాలను భారత ప్రభుత్వానికి వెల్లడించకూడదనుకుంటే, 30 రోజుల్లోగా ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్ కోర్టుకు వీరు అప్పీల్ చేసుకోవచ్చని ఎఫ్‌టీఏ తెలిపింది. వీరిరువురి పేర్లతో పాటు బ్రిటిష్, స్పెయిన్, రష్యాలకు చెందిన నల్ల కుబేరుల పేర్లను ఎఫ్‌టీఏ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చెందిన వారి ఇనిషియెల్స్ మాత్రమే వెల్లండించింది కానీ పూర్తి వివరాలను బయటపెట్టలేదు. మొత్తం మీద 40 మంది వివరాలను స్విస్ ఫెడరల్ గెజిట్‌లో ప్రచురించారు. భవిష్యత్తులో మరింత మంది వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
ఇద్దరు నల్ల కుబేరుల పేర్లు వెల్లడి
Published Tue, May 26 2015 2:00 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
Advertisement