
మొండి బాకీలు లక్షల కోట్లు!
విశ్లేషణ: బ్యాంకులు ప్రతీ ఏటా ఆదాయ, వ్యయాల పట్టిక తయారుచేస్తాయి. అలా తయారు చేసిన అకౌంట్లలో ఈ మొండి బాకీలను ఆదాయంలో చూపిస్తారు. మొండి బాకీలను ఆదాయంలో చూపించడమేమిటి? అలా చూపించడం వల్ల లాభాలు తగ్గుతాయి. ఈ మొండి బాకీలు బ్యాంకులకు రావాల్సిన ఆదాయమే కదా అని, ఆ మొండి బాకీల మొత్తం ఇంత అని అకౌంట్లలో చూపిస్తారు. అలా చూపిస్తున్న మొత్తం 2008-09లో రూ.11,121 కోట్లయితే, 2011-12 నాటికి రూ.34,534 కోట్లకు చేరింది.
మనమంతా బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాం. అవసరం పడినప్పుడు తీసుకుంటుంటాం. దాచుకున్న మొత్తం మీద బ్యాం కు వడ్డీ ఇస్తుంది. మనం బ్యాంకుల్లో జమచేసిన డబ్బును అవ సరమైన వారికి అప్పు ఇచ్చి వడ్డీ వసూలు చేసి అందులో కొంత భాగాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వారికి ఇవ్వగా, మిగతా భాగాన్ని బ్యాంకు యాజ మాన్య యంత్రాంగానికి కొంత ఖర్చు చేయగా, మిగిలినది లాభం ఖాతాలోకి వెళుతుంది. కుప్లంగా బ్యాంకులు చేసే పని ఇదే. ఒక రకంగా ఇది వడ్డీ వ్యాపారమే.
బ్యాంకుల వద్ద నుంచి మనలాంటి వాళ్లం ఇల్లు కట్టుకోవడానికో, బిడ్డ పెళ్లికో అప్పు తెచ్చుకుంటాం. ఈ అప్పు నిర్ణీత కాలంలో వాయిదాల మీదనో మొత్తంగానో తిరిగి చెల్లించకపోతే (కార్పొరేట్లతో సహా) అది మొండి బాకీ అవుతుంది. ఇలాంటి మొండి బాకీల విలువ రెండు లక్షల కోట్లు! వసూలు చేయకుండా బ్యాంకులు నిద్రపో తున్నాయా? చిన్నాచితకా వాళ్లయితే వాళ్ల చెంబూ, తపాలా లాంటివి బయటకు విసిరేస్తారు. కాని రుణాలు తీసుకున్న వారు పెద్ద వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లు అయితే, జాబులు రాస్తారు, నోటీసులు పంపి స్తారు, ఫోన్లో మాట్లాడతారు, బాబ్బాబూ త్వరగా చెల్లిం చండి అని వేడుకుంటారు. లేదా వారి ప్రతినిధులను పిలిచి ముందు వడ్డీ చెల్లించండి లేదా రుణంలో కొంత భాగం చెల్లించండి అని వేడుకుంటారు. వీరి విషయంలో బ్యాంకు యాజమాన్యాలు కఠినంగా వ్యవహరించేందుకు జంకుతాయి. అందుకు కారణం వాళ్లంతా పాలకులకు చుట్టాలు. ఏ మంత్రిగారో ఫోన్ చేస్తారు. దాంతో సరి.
సహజంగానే మొండి బాకీలు తాటిచెట్టు ఎత్తుకు పెరిగిపోతున్నాయి. ఇచ్చిన రుణాలు వసూలు కాకపోవ డంపై ప్రధాని మొదలుకొని, చిదంబరం వరకూ అందరూ ఆందోళన వెలిబుచ్చుతున్నారు. కఠినంగా వ్యవహరించ మంటున్నారు. కానీ ఇదంతా ఏదో చేసేస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నాం అనే భ్రమ కల్పించడానికి మాత్రమే. ఈ కార్పొరేట్ల వద్ద విదేశాల్లో ఉన్న పరిశ్రమలు, వ్యవసాయ భూములు కొనడానికి మాత్రం డబ్బు పుష్కలంగా ఉం టుంది. కానీ దేశంలో బ్యాంకుల నుంచి తెచ్చుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి మాత్రం ఉండదు. పాలకు లతో వారికి ఉన్న సంబంధాలను అడ్డంపెట్టుకుని చెల్లిం పులను వాయిదా వేస్తున్నాయి. ఫలితంగా మొండి బాకీలు పెరుగుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న బడా బాబులకు ఆ రుణం తీర్చే స్థోమతలేదా? బ్లాక్ మార్కెట్లోకి తరలించడానికి, స్విస్ బ్యాంకుల్లో దాచుకోవ డానికి కావాల్సినన్ని నిధులున్నాయి.
నేషనల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ అధ్యయనం ప్రకారం అక్రమ సంపద పరిణామం 10 లక్షల కోట్ల రూపాయలు. హవాలా రూట్‌లో దేశ సరిహద్దులను దాటిన నల్లధనం అదనం. ఇది జాతి ద్రోహం కాక మరే మిటి? విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయ బడా బాబుల నల్లధనం మొత్తం 45 లక్షల కోట్లు. కానీ దేశంలో ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించడానికి మాత్రం వారి మనసు ఒప్పదు. ఇదేమిటని అడిగితే దేశ ఆర్థిక దుస్థితిని అడ్డం పెట్టుకొంటారు. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం మొత్తం రూ.45 లక్షల కోట్లలో ఎంతో కొంత రాబట్టినా ద్రవ్యలోటును తగ్గించుకోవచ్చునని బడా బాబుల సంస్థ అయిన ‘ఫిక్కీ’యే స్వయంగా అంటున్నది.
బ్యాంకు యాజమాన్యాలు ఏమీ తక్కువ తినలేదు. వారికి ఉన్న పరిమితుల్లో వాళ్లు చేసే దందాలు వాళ్లూ చేస్తుంటారు. కాని అసలు నేరస్తులు మంత్రులు, రాజకీయ నాయకులే. మొండి బ్యాంకు రుణాల్లో ఇక ఎట్టి పరిస్థితు ల్లోనూ ఈ రుణం తిరిగిరాదనుకున్నప్పుడు ఆ రుణాలను రద్దు చేస్తారు. 2011-12లో ఇలా రద్దు చేసిన మొత్తం రూ.4,300 కోట్లు. మరికొన్ని రుణాలు సకాలంలో కొన్ని అనివార్య కారణాలవల్ల చెల్లించలేకపోతే, వాటిని మళ్లీ కొత్త రుణాలుగా భావిస్తారు. ఈ రుణాల మొత్తం పైన ఉదహరించిన కాలంలో రూ.1,06,800 కోట్లు. మొండి బాకీలు రూ.97,100 కోట్లు. ఇవన్నీ కలిపితే మొత్తం మొండి బాకీలు రూ.2,03,900 కోట్లు.
ఒక్క 2011-12 లోనే ఈ మొండి బాకీలు రూ.97,900 కోట్ల నుంచి రూ.1,42,300 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో సింహ భాగం ప్రభుత్వ రంగం బ్యాంకులే. ఒకపక్క మంత్రులు, అధికారులు, రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చి తమ వారికి రుణాలు ఇప్పిస్తారు. మొండి బాకీలు పేరుకుపోవ డానికి మూలకారణం ఇదే. రాజకీయ నాయకులు, వారి దన్ను చూసుకుని బడాబాబులు ఠలాయిండంతో, సహ జంగానే మొండి బాకీలు పోనుపోను కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల స్థూల రుణాలు ఏటేటా ఎలా పెరిగి పోతున్నాయో చూడండి.
మామూలుగా బ్యాంకులు ప్రతీ ఏటా ఆదాయ, వ్యయాల పట్టిక తయారుచేస్తాయి. అలా తయారు చేసిన అకౌంట్లలో ఈ మొండి బాకీలను ఆదాయంలో చూపి స్తారు. మొండి బాకీలను ఆదాయంలో చూపించడమే మిటి? అలా చూపించడం వల్ల లాభాలు తగ్గుతాయి. ఈ మొండి బాకీలు బ్యాంకులకు రావాల్సిన ఆదాయమే కదా అని, ఆ మొండి బాకీల మొత్తం ఇంత అని అకౌంట్లలో చూపిస్తారు. అలా చూపిస్తున్న మొత్తం 2008-09లో రూ.11,121 కోట్లయితే, 2011-12 నాటికి రూ.34,534 కోట్లకు చేరింది. అంటే చెల్లించని రుణాన్ని చెల్లించవచ్చు, అందుచేత అది రాబోయే ఆదాయం అని అకౌంట్ల తయా రీలో చేసే మతలబు. దీనినే మసిపూసి మారేడుకాయ చేయడం అంటారు.
రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు గడ్డి తిన డం అంటే లంచాలు మేయడం ప్రస్తుత ప్రధాని హయాం లో ఇంతింతై వటుడింతై అన్నట్లు మరీ మరీ ఎక్కువ కావ టమే కాదు, రోజూ పళ్లుతోముకున్నంత మామూలై పోయింది. షరా మామూలైపోయింది. అయితే లక్షలు, కోట్లు పోగైపోతుంటే, ఆ నల్లధనం అంతా ఏం చేయాలి, ఎలా దాచాలి! అనేది ఓ సమస్యగా మారిందంటే ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. కానీ ప్రభుత్వ రంగంలో, పెద్ద పెద్ద బ్యాంకుల్లో కూడా ఇలా జరగడం క్షంతవ్యం కాదు. ఈ అక్రమాలు దృష్టికి వచ్చినప్పుడు ఆ బ్యాంకులపై రిజర్వు బ్యాంకు జరిమానాలు విధించింది కూడా. ఈ విషయంలో బ్యాంకు యాజమాన్యాల పాత్ర క్షమార్హం కాదు. ఇలాంటి బ్యాంకుల యాజమాన్యాల చేతుల్లో మన కష్టార్జితం పెడుతున్నాం. ప్రయివేటు బ్యాంకుల్లో కాకుం డా ప్రభుత్వ రంగ పొదుపు చేసుకున్న కష్టార్జితం పెడితే క్షేమం అని మనమంతా అనుకుంటాం. కానీ కంచే చేను మేస్తే?!