మీరు బ్యాంక్‌లో పెద్ద మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని అనుకుంటున్నారా?అయితే ఇది మీ కోసమే. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రాబడిని వచ్చేలా పలు బ్యాంకులు ఆశాజనకంగానే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆ వడ్డీ రేట్ల ఆధారంగా బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే మంచిదని ఆర్ధిక వేత్తలు సలహా ఇస్తున్నారు.
మనలో చాలా మందికి ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్ చేస్తే రాబడి తక్కువగా ఉంటుందని అనుకుంటారు. అందులో కొంత వాస్తవం ఉన్నా.. మీ డబ్బులు సేఫ్‌గా ఉంటాయని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం బ్యాంకులు దీర్ఘకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5% నుండి 6.5% వరకు ఆఫర్ చేస్తున్నాయి. అయితే, మీరు ఎఫ్‌డీలో పెట్టాలని నిర్ణయించుకునే ముందు బ్యాంకులు, పోస్టాఫీసులు అందించే వడ్డీ రేట్లను పోల్చడం మంచిది.
లాంగ్ టర్మ్‌లో ఎలా ఉంటుంది
వేర్వేరు లక్ష్యాలకు వేరే రకమైన పెట్టుబడి ప్రణాళిక అవసరం. ఉదాహరణకు ఎఫ్‌డీలో పెట్టుబడులు నిజమైన రాబడిని ఇవ్వవు. అనగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని అందించవు. కాబట్టి మీ పిల్లల విద్య కోసం 15 సంవత్సరాల ఎఫ్‌డీలో నిధులు ఉంచడం వల్ల లాభం ఉండదు. అయితే మీరు ఒకటి లేదా రెండు సంవత్సరాలకే పరిమితం చేసుకోవాలంటే ఎఫ్‌డీలపై బ్యాంకులు అందించే ఇంట్రస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment