
సరైన హిట్టు లేక వరుస పరాజయాలతో కొనసాగుతున్న తమిళ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం ‘కదరం కొండన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ సినిమా దర్శకుడు రాజేష్ ఎమ్ సెల్వ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది.
ఇక ఈ టీజర్‌లో విక్రమ్ న్యూ లుక్ లో చాలా స్టైలిష్‌గా ఉండటంతో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని యూనివర్సల్ హీరో కమల్ హాసన్.. తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్ కూడా నటించారు. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న కమల్ హాసన్, విక్రమ్‌లు కలిసి చేస్తోన్న ఈ సినిమాతో వీళ్లిద్దరు సక్సెస్ అందుకుంటారా అనేది వేచి చూడాలి. ఇక ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘భారతీయుడు 2’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment