Indian 2 Movie Team Approach Tamannaah For Doing Heroine Role- Sakshi
Sakshi News home page

Indian 2 Movie: 'ఇండియన్‌ 2' హీరోయిన్‌ కోసం అన‍్వేషణ.. మిల్క్‌ బ్యూటీ పక్కానా ?

Published Mon, Dec 6 2021 9:15 AM | Last Updated on Mon, Dec 6 2021 1:40 PM

Indian 2 Movie Team Approach Tamannaah For Doing Heroine Role - Sakshi

Indian 2 Movie Team Approach Tamanna For Doing Heroine Role: లోక నాయకుడు కమల్‌హాసన్‌ కథానాయకుడిగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక‍్కిస్తున్న చిత్రం 'ఇండియన్‌ 2' (భారతీయుడు 2). సినిమా సెట్స్‌పైకి వెళ్లినప్పటినుంచి ఏదో ఒక రూపంలో అవాంతరాలు వచ్చి పడుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. అనేక వివాదాలతో లైకా ప్రొడక్షన్స్‌, దర్శకుడు శంకర్‌ కోర్టును ఆశ్రయించారు. అనంతరం ఆ వివాదాలన్ని సద్దుమణిగాయి. ఇక షూటింగ్ ప్రారంభిద్దాం అని అనుకునే సరికి కమల్‌హాసన్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇటీవలే ఆయన కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అంతకుముందు ఈ సినిమా నుంచి కాజల్‌ అగర్వాల్‌ రూపంలో సమస్య వచ్చింది. 

'ఇండియన్‌ 2' చిత్రం నుంచి చందమామ కాజల్‌ అగర్వాల్‌ తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాజల్‌ ప్రెగ్నెంట్‌ అని, అందుకే సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. కాజల్‌ స్థానాన్ని బర్తీ చేయడానికి చిత్రబృందం అన్వేషణలో పడింది. మొదటగా కాజల్‌ స్థానంలో త్రిషను తీసుకోడానికి ఆమెను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు తాజాగా మిల్క్‌ బ్యూటీ తమన్నా పేరు తెరపైకి వచ్చింది. 'ఇండియన్‌ 2'లో హీరోయిన్‌గా, వయసు మళ్లిన పాత్రలో కనిపించాల్సి ఉంది. తమన్నా ఈ రెండు పాత్రలకు న్యాయం చేస్తారని చిత్ర బృందం భావించదట. తమ‍్ము బేబీకి కూడా పాత్ర నచ్చడంతో హీరోయిన్‌గా చేసేందుకు అంగీకరంచిందని టాక్‌ వినిపిస్తోంది. త‍్వరలో అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నాయి కోలీవుడ్‌ వార్గాలు. 



ఇదీ చదవండి: ఇండియన్‌ 2 నుంచి కాజల్‌ ఔట్‌.. మరో స్టార్‌ హీరోయిన్‌కు ఛాన్స్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement